AC ని ఎంత ఎత్తులో అమర్చాలో తెలుసా.. చాలా మంది చేసే పొరపాట్లు ఇవే..!
దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాలు, నగరాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అధిక ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు మూడు నెలలపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ప్రజలు చల్లదనం కోసం ఏసీ, ఎయిర్ కూలర్ లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా AC (ఎయిర్ కండిషనర్) కొనుగోలు చేయాలని భావిస్తుంటే, కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
జాగ్రత్తలు తీసుకోవాలి :
ఏసీ కొనుగోలు చేసే సమయంలో బ్రాండ్, తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకొని మెరుగైన పనితీరు కనబరిచే సామర్థ్యం సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీంతోపాటు ఏసీని కొనుగోలు చేశాక, ఇంట్లో లేదా ఆఫీస్‌లో అమర్చే సమయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎంత ఎత్తులో అమర్చాలి :
AC ని ఎక్కడ అమర్చారనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది సరైన అవగాహన లేకుండా AC ను అమర్చుతుంటారు. అలా చేయడం వల్ల గది చల్లగా అయ్యేందుకు ఏసీ ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏసీని కొనుగోలు చేసిన వారు ఎంత ఎత్తులో అమర్చాలో తెలుసుకోవాలి.
ఇలా చేస్తే గది త్వరగా చల్లబడుతుంది :
చాలా మంది సీలింగ్‌కు అత్యంత సమీపంలో ఏసీలను అమర్చుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడూ కూడా ఫ్లోర్ నుంచి 7 లేదా 8 అడుగుల ఎత్తులో ఏసీని అమర్చాల్సి ఉంటుంది. ఫలితంగా తక్కువ సమయంలో గది చల్లబడేందుకు అవకాశం ఉంటుంది.
గది విస్తీర్ణం ఆధారంగా కూడా :
అయితే గది విస్తీర్ణం ఆధారంగా ఈ ఎత్తు నిబంధనలో కొన్ని మార్పులు ఉంటాయి. ఉదాహరణకు మీ సీలింగ్ ఎత్తు 8 లేదా 9 అడుగులు ఉంటే, అందుకు అనుగుణంగా ఏసీని అమర్చాల్సి ఉంటుంది. సరైన ఎత్తులో అమర్చడం వల్ల గది కూడా త్వరగా చల్లబడుతుంది. దీంతో ఎక్కువ సమయం ఏసీని ఆన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు.
ఈ రూల్స్ కూడా పాటించాలి :
దీంతోపాటు ఏసీలను ఇప్పటికే వినియోగిస్తున్న వారు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు ఫిల్టర్‌లను క్లిన్ చేసుకోవాలి. దీంతోపాటు నేరుగా సూర్యకాంతి ప్రసరించే ప్రాంతంలో ఏసీ అవుట్‌డోర్, ఇన్‌డోర్ యూనిట్‌లను అమర్చకూడదు.
ఫ్యాన్ వినియోగించవచ్చా? :
ఏసీలను ఆన్ చేసే ముందే గది నుంచి చల్లదనం బయటకు వెళ్లే అవకాశం ఉండే ప్రాంతాలను మూసి ఉంచాలి. మరియు ఏసీ వినియోగిస్తున్న సమయంలో ఫ్యాన్ కూడా ఆన్ చేసి పెట్టవచ్చు. దీని వల్ల చల్లదనం గది మొత్తం త్వరగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది.
ఏసీలను కొనుగోలు చేసే సమయంలో 5 స్టార్ రేటింగ్ ఉండే వాటిని ఎంపిక చేసుకోవాలి. దీని వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ప్రస్తుతం తక్కువ విద్యుత్‌తో మెరుగైన పనితీరు కనబరిచే ఎయిర్ కండిషనర్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో సర్వీసింగ్ సదుపాయం ఉన్న బ్రాండ్‌లను ఎంచుకోవడం ఉత్తమం. లేకుంటే సర్వీసింగ్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు.


Click it and Unblock the Notifications








