Home
How to

స్మార్ట్‌ఫోన్‌లో మరియు బ్రౌజర్ లో గూగుల్ చాట్‌ని యాక్టివేట్ చేయడం ఎలా??

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ గత సంవత్సరం Gmailతో చాట్‌ను అనుసంధానించింది. వర్క్‌స్పేస్ యూజర్‌లకు ఈ ఆప్షన్ మొదట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ఇది మే 2021 నుండి iOS, ఆండ్రాయిడ్ మరియు వెబ్‌లోని Gmail వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇంటి వద్ద నుండి రిమోట్ గా పని చేయడం కోసం మారారు. Slack నుండి 'రియల్-టైమ్ కోలాబోరేటివ్ చాట్', మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటివి ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేయడానికి అనుకూలమైనవిగా మారాయి. అయితే గూగుల్ సంస్థ తన యొక్క ప్రత్యర్థులకు పోటీగా తన Gmail నుండి నేరుగా చాట్‌ను సులభంగా యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని తీసుకువచ్చింది. అయితే దీన్ని ఉపయోగించడానికి Gmail కోసం గూగుల్ చాట్ ని యాక్టివేట్ చేయాలి. బ్రౌజర్ మరియు మొబైల్ పరికరంలో ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. Gmail చాట్‌ని యాక్టివేట్ చేయడానికి కింద ఉన్న సాధారణ గైడ్ ను అనుసరించండి.

Activate Google Chat Process Using Gmail on Smartphone and Browser Step by Step

మొబైల్‌లో గూగుల్ చాట్‌ను యాక్టివేట్ చేసే విధానం

** ఎడమవైపు ఎగువభాగంలో మూలలో ఉన్న మూడు-లైన్ చిహ్నాన్ని నొక్కండి. క్రిందికి స్క్రోల్ చేసి "సెట్టింగ్స్" ఎంపికను ఎంచుకోండి.

** తర్వాత మీ అకౌంటును ఎంచుకుని "జనరల్" ఎంపికకి నావిగేట్ చేయండి.

** ఆండ్రాయిడ్ టోగుల్ కోసం "షో ది చాట్ & స్పేస్‌ ట్యాబ్‌" ఎంపికను ఎంచుకోండి. మీరు iOS పరికరాన్ని ఉపయోగిస్తుంటే కనుక "షో చాట్ & స్పేస్ ట్యాబ్‌ను"ని ఆన్ చేయండి.

** దీనిని అనుసరించడం ద్వారా మీరు స్క్రీన్ దిగువన చాట్ మరియు స్పేస్‌ల చిహ్నాలను చూస్తారు.

వెబ్ బ్రౌజర్‌లో గూగుల్ చాట్ ని యాక్టివేట్ చేసే విధానం

Activate Google Chat Process Using Gmail on Smartphone and Browser Step by Step

** మీ Gmail అకౌంటును ఓపెన్ చేసి సెట్టింగ్‌ల విభాగంకు వెళ్లండి.

** తరువాత "సి ఆల్ సెట్టింగ్స్ " ఎంపికను ఎంచుకోండి.

** ఆ తర్వాత టాప్ మెనూలో "చాట్ మరియు మీట్" ఎంపికను ఎంచుకోండి.

** మీకు "గూగుల్ చాట్," "క్లాసిక్ హ్యాంగ్ ఔట్స్" మరియు "ఆఫ్" ఎంపిక ఎంపిక ఇవ్వబడుతుంది.

** తరువాత మీరు మీ Gmail ఇన్‌బాక్స్‌కు కుడి వైపున మీ చాట్‌లు మరియు రూమ్స్ కోసం సైడ్‌బార్‌ను చూస్తారు.

Activate Google Chat Process Using Gmail on Smartphone and Browser Step by Step

మొబైల్‌లో చాట్‌ని ప్రారంభించడానికి చాట్ చిహ్నాన్ని నొక్కి ఆపై దిగువ భాగంలో కుడి మూలలో ఉన్న "కొత్త చాట్" పాప్‌అప్‌పై ఒక వ్యక్తి పేరును టైప్ చేయండి. మీరు రూమ్ ని కూడా సృష్టించవచ్చు. వెబ్ కోసం Chat లేదా Spaces బాక్స్‌ల మూలల్లో ఉన్న ప్లస్ గుర్తుపై క్లిక్ చేయండి. మీరు డ్రాప్-డౌన్ మెనుని చూస్తారు. మొబైల్ లాగా మీరు ఒక వ్యక్తితో చాట్ చేయడానికి టాప్ ఫీల్డ్‌లో పేరును టైప్ చేయాలి. ఆ తర్వాత మీరు చిన్న పాప్-అప్ బాక్స్‌లోకి తీసుకోబడతారు.

Best Mobiles in India

English summary
Activate Google Chat Process Using Gmail on Smartphone and Browser Step by Step
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X