Home
How to

AC Usage Tips ఇంట్లో AC వినియోగిస్తున్నారా... కూలింగ్‌ తక్కువగా ఉంటోందా.. ఇదే కారణం..!

ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక మంది ఎయిర్‌ కండిషనర్‌లను (AC) లను వినియోగిస్తున్నాయి. అయితే కొన్ని కారణాలలో గది చల్లగా మార్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇందుకు ఫిల్టర్‌ సహా సెట్టింగ్స్‌ సరిగా లేకపోవడం సహా మరిన్ని కారణాలున్నాయి.

దీంతోపాటు కూలింగ్‌ సక్రమంగా లేకపోవడానికి రిఫ్రిజిరెంట్‌ లీక్‌ ప్రధాన కారణం. రిఫ్రిజిరెంట్‌ గ్యాస్‌ ద్వారానే వేడి గాలి చల్లగా మారుతుంది. అనంతరం వేడి గాలి బ్లోయర్‌ ద్వారా గది బయటకు వెళ్లేలా ఏర్పాట్లు ఉంటాయి. ఏదైనా సందర్భంలో గ్యాస్‌ లెవల్‌ తక్కువగా ఉన్నా లేదా లీక్‌ అవుతున్నా.. కూలింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది.

air conditioner gas leakage problem tips

ఎయిర్‌ కండిషనర్‌ (Air Conditioner) రిఫ్రిజిరెంట్‌ గ్యాస్‌ లీకేజీకి అనేక కారణాలున్నాయి. తుప్పు పట్టడం కూడా గ్యాస్‌ లీకేజీకి ఒక కారణం. కండెన్సర్‌ పైప్లు తుప్పు పట్టడం కారణంగా రిఫ్రిజిరెంట్‌ లీకేజీ జరుగుతుంది ఫలితంగా కూలింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. దీంతోపాటు సక్రమంగా ఇన్‌స్టాల్‌ చేయకున్నా.. కూలింగ్‌ సమస్యలు తలెత్తుతాయి.

కంప్రెషర్‌ మోటర్‌లోని వైబ్రేషన్ల కారణంగా గ్యాస్‌ లీకేజీ జరిగే అవకాశం ఉంటుంది. పిన్‌హోల్‌ లీక్‌ల కారణంగా కూడా రిప్రిజిరెంట్‌ గ్యాస్‌ లీక్‌ కానుంది. అయితే కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ లీకేజీని నియంత్రించవచ్చు. ఫలితంగా తక్కువ సమయంలో గదిని చల్లగా మార్చేయవచ్చు.

ఎయిర్‌ కండిషనర్‌ అవుట్‌డోర్‌ యూనిట్‌ను గది బయట ఇన్‌స్టాల్‌ చేస్తాయి. అయితే సాధ్యమైనంత వరకు అవుట్‌ డోర్‌ యూనిట్‌పై నేరుగా సూర్యకాంతి ప్రసారం కాకుండా చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు శీతాకాలంలో సాధారణంగా AC లకు తక్కువగా వినియోగిస్తారు. అటువంటి సమయాల్లో అవుడ్‌డోర్‌ యూనిట్‌ను కప్పి ఉంచాలి.

దీంతోపాటు అల్యూమినియం కండెన్సర్‌ లకు బదులుగా రాగి (Copper) కండెన్స్‌ర్‌లను వినియోగించడం ఉత్తమం. దీంతోపాటు క్రమం తప్పకుండా సర్వీస్‌ చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా లీకేజీ సమస్యలను నివారించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిర్‌ కండిషనర్‌ ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.

ముఖ్యంగా AC లను వినియోగిస్తున్న సమయంలో ఆ గదిలోని కిటికీలు పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. మరియు సూర్యకాంతి నేరుగా గదిలోకి ప్రవేశించకుండా కర్టెన్‌లను ఏర్పాటుచేసుకోవాలి. దీంతోపాటు గదిలోని చల్లని గాలి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి.

దీంతోపాటు ఎయిర్‌ కండిషనర్ ను నిరంతరం వినియోగిస్తే.. అధిక విద్యుత్‌ ఛార్జీలకు అవకాశం ఉంటుంది. అందువల్ల టైమర్‌ ఏర్పాటుచేసుకొని.. గది అవసరమైన ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా లేదా మాన్యువల్‌ ఆఫ్‌ చేసుకొనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకొనే AC లకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. మరియు ఫిల్టర్లను శుభ్రం చేయడం లేదా అవసరం అయితే కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లీకేజీ సమస్యలు లేకుండా చూడాలి. లీకేజీతో ఎయిర్‌ కండిషనర్‌ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

దీంతోపాటు ఏసీలు వినియోగిస్తున్న సమయంలో గదులను త్వరగా చల్లగా మార్చేందుకు ఫ్యాన్‌ను ఉపయోగించవచ్చు. ఏసీ ద్వారా గది అంతా చల్లదనం విస్తరించేందుకు ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంటుంది. ఫ్యాన్‌లు ఉపయోగించడం వలన త్వరగా గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
air conditioner gas leakage problem what is the reason here are the tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X