Amazon Prime వీడియో ‘షఫుల్ ఎపిసోడ్’ ఫీచర్ ను ఉపయోగించడం ఎలా?
వినోదం కోసం ఉపయోగించే OTT యాప్ లలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్తగా 'షఫుల్ ఎపిసోడ్స్' బటన్‌ను విడుదల చేసింది. ఇది యాదృచ్ఛికంగా ఎపిసోడ్‌లను ప్లే చేస్తుంది. ఎపిసోడ్లను క్రమం తప్పకుండా ప్లే చేయకూడదనుకున్నప్పుడు మరియు తరువాత ఏది ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. వీడియో యొక్క ఎపిసోడ్లను యాదృచ్చికంగా చూడటానికి వినియోగదారులు 'షఫుల్ ఎపిసోడ్లు' బటన్‌పై క్లిక్ చేయవచ్చు. ఈ క్రొత్త బటన్ అందరికి అందుబాటులో ఉంది. ఇది 'డౌన్‌లోడ్' మరియు 'మోర్' బటన్ల మధ్య అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోని 'షఫుల్ ఎపిసోడ్స్' బటన్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో 'షఫుల్ ఎపిసోడ్' ఫీచర్ ను ఉపయోగించే విధానం
*** అమెజాన్ వీడియో 'షఫుల్ ఎపిసోడ్స్' ప్రస్తుతం iOS వినియోగదారులకు అందుబాటులో లేదు కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
*** ఆండ్రాయిడ్ యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క కొత్త ఫీచర్‌ను యాక్సిస్ చెయ్యడానికి తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.

*** అమెజాన్ ప్రైమ్ లో ఏదైనా షోలు లేదా సిరీస్‌ను ఓపెన్ చేసి మీరు యాదృచ్ఛికంగా ఎపిసోడ్‌లను చూడాలనుకునే సీజన్‌ను ఎంచుకోండి.
*** తరువాత సీజన్ నుండి యాదృచ్ఛిక ఎపిసోడ్‌ను ప్లే చేయడానికి 'షఫుల్ ఎపిసోడ్లు' బటన్‌పై క్లిక్ చేయండి.
*** ఈ ఫీచర్ ఒక నిర్దిష్ట సీజన్ నుండి ఎపిసోడ్లను మాత్రమే ప్లే చేస్తుందని గమనించండి. ఉదాహరణకు మీరు సిరీస్ యొక్క సీజన్ 1 ను ఎంచుకున్న తరువాత 'షఫుల్ ఎపిసోడ్స్' బటన్ ను నొక్కిన తరువాత ఆ సీజన్ నుండి ఎపిసోడ్లను మాత్రమే ప్లే చేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ ప్రత్యర్థి నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదే విధమైన ఫీచర్ ను పరీక్షిస్తోంది. ఇది వినియోగదారులు వారు చూడాలనుకుంటున్న కంటెంట్ లేదా వారు ఇంతకు ముందు చూసిన లేదా వారి జాబితాలో సేవ్ చేసిన సినిమాల ఆధారంగా చూడాలనుకుంటున్న వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








