మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను లాక్ చేయాలంటే..?

Posted By:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను రహస్యంగా ఉంచాలనుకుంటున్నారా..?, ఫోన్‌లోని మీ రహస్య డాటాను ఎవరికంటా పడకుండా నిక్షిప్తంగా భద్రపరిచేందుకు పలు ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే హ్యాండ్‌సెట్‌ను నిక్షేపంగా టేబుల్ పై వదిలి వెళ్లొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను లాక్ చేయాలంటే..?

హైడ్ పిక్షర్స్ ఇన్ వాల్టీ (Hide Pictures in Vaulty):

ఈ ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌‍లోని ఫోటోలతో పాటు వీడియోలను భద్రపరుచుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ ఓపెన్ చేసి భద్రపరచాల్సిన ఫోటోలు లేదా వీడియోలను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. దింతో మీరు భద్రపరచాల్సిన డాటా ప్రత్యేకమైన ప్రయివేటు గ్యాలరీలోకి వచ్చి చేరుతుంది. పాస్‌వర్డ్ ఇంకా పిన్ భద్రత. వ్యూ, సెర్చ్, జూమ్, ఫిల్టర్, రీనేమ్ ఫోటోస్ వంటి ఫీచర్లను ఈ అప్లికేషన్ కల్పిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. డౌన్‌లోడ్ లింక్:

హైడ్ ఇట్ ప్రో (Hide It Pro):

ఈ ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు, అప్లికేషన్స్, మెసేజస్ ఇంకా కాల్ డాటాను ఎవకి కంటా పడకుండా హైడ్ చేస్తుంది. అత్యుత్తమ సర్వీస్‌ను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఆడియో మేనేజర్ అప్లికేషన్ ప్రధాన ఆకర్షణ.  పిన్ ఇంకా పాస్‌వర్డ్ సౌలభ్యత. పొందుపరిచిన ఎన్‌క్రిప్షన్ టూల్ మీ డాటాకు మరింత భద్రత కల్పిస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. డౌన్‌లోడ్ లింక్:

హైడ్ పిక్షర్స్- కీప్‌సేఫ్ వాల్ట్ (Hide pictures - KeepSafe Vault):

ఈ అప్లికేషన్ ద్వారా మరింత సులభంగా మీ ఫోన్‌లోని ఫోటో ఇంకా వీడియో ఫైళ్లను భద్రపరుచుకోవచ్చు. ఎన్‌క్రిప్షన్ ఫీచర్ లేదు. పిన్‌కోడ్ ఆధారంగా పని చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. డౌన్‌లోడ్ లింక్:


వాల్ట్ - హైడ్ ఎస్ఎంఎస్, పిక్షర్స్ & వీడియోస్ (Vault-Hide SMS, Pics & Videos):

ఈ  అప్లికేషన్  పెద్ద సంఖ్యలో ప్రైవసీ అప్షన్‌లను కలిగి ఉంది. ఎన్‌క్రిప్టిడ్ విధానం ద్వారా ఫోటోలతో పాటు వీడియోలను భద్రపరుచుకోవచ్చు. పాస్‌వర్డ్ ప్రొటెక్సన్, కాంటాక్ట్ సమాచారంతో పాటు టెక్స్ట్ సందేశాలు, కాల్ హిస్టరీని హైడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ లభ్యమవుతోంది. డౌన్‌లోడ్ లింక్:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting