ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

|

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ పనితీరు విషయంలో రోజు రోజుకు స్లో అవుతోందని ఆందోళణ చెందుతున్నారా..? వాస్తవానికి ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు మేం సూచించే సింపుల్ ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా మీ ఫోన్ పనితీరు మరింత వేగాన్ని అందుకుంటుంది. ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా మరి...

Read More : ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి అప్లికేషన్స్ లేదా ఆపరేటింగ్ సిస్టం కారణం కావొచ్చు. ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న Trepn Profiler వంటి యాప్స్ ఈ ఫోన్‌కు సంబంధించి రియల్ - టైమ్ సీపీయూ లోడ్‌ను చూపుతాయి. ఫోన్‌లోని వివిధ విభాగాల పనితీరుకు సంబంధించి ఈ యాప్ చూపించే విశ్లేషణ ద్వారా సమస్య ఎక్కడో ఉందో కనిపెట్టవచ్చు.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

కంప్యూటర్ తరహాలో స్మార్ట్‌ఫోన్‌లోనూ రకరకాల అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అయితే, పలు సందర్భాల్లో ఈ యాప్స్ కారణంగానే ఫోన్ ప్రాసెసింగ్ వేగం మందగిస్తుంది. అందుకే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న యాప్స్ ఎప్పటిక్పుడు పర్యవేక్షిస్తూ నిరుపయోగంగా మారిన వాటిని అన్‌ఇన్‌‍స్టాల్ చేయటం మంచిది.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అడ్వాన్సుడ్ టాస్క్ మేనేజర్ యాప్ మొబైల్ ప్రాసెసింగ్‌ను పర్యవేక్షింటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడైన మొబైల్ ప్రాసెసింగ్ తగ్గినట్ల అనిపిస్తే ఈ యాప్‌ను ఆశ్రయిస్తే చాలు, మొబైల్ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ జాబితాను చూపిస్తుంది. వాటిలో అవసరంలేని వాటిని క్లోజ్ చేయవచ్చు.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

మల్టీటాస్కింగ్, ఫోన్ ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తంది. కాబట్టి, ర్యామ్ వాడకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్‌కు ర్యామ్ అవసరం ఉంటుంది. ఒకేసారి రకరకాల యాప్స్‌ను వినియోగిస్తున్నట్లయితే ర్యామ్ వేగం మందగించి మొబైల్ ప్రాసెసింగ్ నత్తనడకన సాగుతుంది.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ర్యామ్‌ను పొదుపుగా వాడుకునేందుకు రకరకాల యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్లీన్ మాస్టర్ ఒకటి. ఈ ప్రత్యేకమైన యాప్ రన్ అవుతున్న యాప్స్‌ను కిల్ చేయటంతో పాటు బ్రౌజర్‌లోని డేటా, హిస్టరీ ఇంకా క్యాచీలను తొలగించి, ర్యామ్ ఖాళీని పెంచుతుంది.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ వేగం మందగించటానికి హోమ్ స్ర్కీన్ పై నిరుపయోగంగా ఉన్న విడ్జెట్‌ల కూడా ఒక కారణం కావొచ్చు. కాబట్టి వీటిని డిసేబుల్ చేయటం ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

మీ ఫోన్‌కు సంబంధించి యానిమేషన్స్ ఇంకా ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా ఫోన్ వేగం పెరుగుతుంది.

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

ఫోన్ నెమ్మదించటానికి కారణాలేంటి..?

నెమ్మదిగా రన్ అవుతోన్న ఫోన్‌ను రిస్టార్ట్ చేయటం ద్వారా కొంతలో కొంత ఉపశమనం లభించి ఫోన్ వేగం పెరుగుతుంది.

Best Mobiles in India

English summary
Android device running slow? Here's how to speed up your phone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X