Just In
Don't Miss
- News
అసెంబ్లీలో వంశీ సీటు కేటాయింపులో ట్విస్టు : స్పీకర్ ప్రకటించారు..కానీ: వైసీపీ తరపున..!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Finance
నేటి నుంచి FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
- Movies
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఆండ్రాయిడ్ ఫోన్లలో తలెత్తే సమస్యలు వాటికి పరిష్కారాలు..
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోనూ సాంకేతిక లోపాలు తలెత్తటం సహజం. ఈ డివైసెస్‌లో తలెత్తే పలు సమస్యలు, వాటిని పరిష్కరించుకునేందుకు సులువైన మార్గాలను నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది..

బ్యాటరీ సమస్యా..
మీ ఫోన్‌ను బ్యాటరీ బ్యాకప్ సమస్య వేధిస్తోందా..? అయితే DU Battery Saver & Fast Charge యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ బ్యాటరీ యూసేజ్‌ను దగ్గరగా మానిటర్ చేయటంతో పాటు ఫోన్ బ్యాగ్రౌండ్లో మీకు తెలియకుండా రన్ అవుతోన్న యాప్స్‌ను ఎలిమినేట్ చేసేస్తుంది. తద్వారా బ్యాటరీ బ్యాకప్ అనేది మెరుగుపడుతుంది.

పనితీరు నెమ్మదిగా ఉందా..
మీ ఫోన్ పనితీరు చాలా నెమ్మదిగా ఉంది. అయితే Clean Master for Android Mobile యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఫోన్లో పేరుకుపోయి ఉన్న అన్వాంటెడ్ ఫైల్స్‌ను క్లియర్ చేసిన పనితీరును మెరుగుపడేలా చేస్తుంది.

వై-ఫైతో కనెక్ట్ అవ్వటం లేదా
మీ ఆండ్రాయిడ్ ఫోన్ వై-ఫైతో కనెక్ట్ అవ్వటం లేదా? అయితే ఓ సారి రీస్టార్ట్ చేసి చూడండి. అప్పటికి సమస్య పరిష్కారం కానట్లయితే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఒక నిమిషం పాటు వెయిట్ చేయండి. ఆ తరువాత ఎయిర్‌ప్లేన్ మోడ్ నుంచి బయటకు వచ్చేసి వై-ఫైతో కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే ఫోన్‌ను సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లండి.

సర్వర్స్‌తో సింక్ అవ్వటం లేదా..
మీ ఆండ్రాయిడ్ ఫోన్ గూగుల్ సర్వర్స్‌తో సింక్ అవ్వటం లేదా? అయితే మీ అకౌంట్ పాస్వర్డ్ ఛేంజ్ అయ్యిందేమో చెక్ చేసుకోండి. పాస్ వర్డ్ విషయంలో సమస్య లేదని తేలినట్లయితే గూగుల్ అకౌంట్‌ను ఫోన్ నుంచి రిమూవ్ చేసి మరొకసారి యాడ్ చేయండి. సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది.

స్క్రీన్ లాక్‌ను మరిచిపోయారా..
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్ర్కీన్ లాక్‌ను మరిచిపోయారా? అయితే.. బైపాస్, అన్‌లాక్ ఆండ్రాయిడ్ ప్యాట్రన్ వంటి పద్థతులను ఉపయోగించి స్క్రీన్ లాక్‌ను అన్‌లాక్ చేయవచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ డీఫాల్ట్ కీబోర్డ్ వర్క్ అవ్వటం లేదా? అయితే గూగుల్ కీబోర్డ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమస్య పరిష్కారమైపోతుంది.

స్క్రీన్ టర్నాఫ్ అయిపోతుందా..
ఫోన్ ఛార్జ్ అవుతున్నపుడు స్క్రీన్ టర్నాఫ్ అయిపోతుందా? అయితే ఫోన్ సెట్టింగ్స్‌లోని Applications/ Development సెక్షన్ లోకి వెళ్లి ‘Stay awake' ఆప్షన్ పై టిక్ మార్క్ చేసినట్లయితే ఫోన్ ఛార్జ్ అవుతన్నంత సేపు స్క్రీన్ ఆన్ అయ్యే ఉంటుంది.

బ్లూటూత్ పని చేయటం లేదా...
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ పని చేయటం లేదా? ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి రిస్టార్ట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. బ్లూటూత్ షేర్ క్యాచీని తొలగించటం ద్వారా బ్లుటూత్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

ఎస్డీ కార్డును గుర్తించటం లేదా?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ మెమురీ కార్డును గుర్తించటం లేదా? అయితే ఆ కార్డును ఫార్మాట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇలా చేయాలంటే.. Go to settings > Storage > Format SD card > Ok

సిమ్‌కార్డ్‌ను గుర్తించటం లేదా?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ సిమ్‌కార్డ్‌ను గుర్తించటం లేదా? ముందుగా వేరే సిమ్‌లను వేసి ప్రయత్నించిండి. ఒకవేళ సమస్య మీ సిమ్ కార్డ్‌లో ఉంటే పరిష్కరించుకోవచ్చు. మీరు అడాప్టర్‌తో కూడిన మైక్రోసిమ్‌ను వినియోగిస్తున్నట్లయితే నానో సిమ్గా మార్చి ప్రయత్నించండి.

కెమెరా యాప్ స్టార్ట్ అవటం లేదా..
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కెమెరా యాప్ స్టార్ట్ అవటం లేదా అయితే ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ మెనూలోకి ప్రవేశించి కెమెరా యాప్‌ను సెలక్ట్ చేసుకోండి. కెమెరా యాప్ ఓపెన్ అయిన తరువాత ‘Force stop' ‘clear data', ‘clear cache' ఆప్షన్లను ‘Apply' చేయండి. చాట్ మెసెంజర్స్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి కెమెరాను యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసే ముందు ఓసారి వాటిని తొలగించి చూడండి. సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790