మీ Android పోన్‌‌కు మాది గ్యారెంటీ!

|

Android స్మార్ట్‌పోన్‌లను యూజ్ చేసే ప్రతిఒక్కరు లేవనెత్తే సమస్య బ్యాటరీ బ్యాకప్. లెక్కకు మిక్కిలి స్మార్ట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ సమస్యలు కామన్‌గా మారిపోయాయి. ఈ సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఎక్కువ శాతం మంది యూజర్లు థర్డ్ పార్టీ బ్యాటరీ సేవింగ్ యాప్స్ పై ఆధారపడతున్నారు.

 మీ Android పోన్‌‌కు మాది గ్యారెంటీ!

కొన్ని సంర్భాల్లో ఈ యాప్స్ వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్‌ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ వంతు ఏకాగ్రతతో బ్యాటరీ సేవింగ్ మర్గాలను అనుసరించటం ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ప్రతి ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఉపయోగపడే బ్యాటరీ సేవింగ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం...

Read More : డిజిటల్ కెమెరా వద్దు.. స్మార్ట్‌ఫోనే ముద్దు!

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ, 3జీ, 4జీ ఎల్టీఈ వంటి ఫీచర్లు బ్యాటరీ శక్తిని ఆరగించటంలో ముందు వరసలో ఉంటాయి. కాబట్టి, ఈ ఫీచర్లను అవసరం మేరకే వాడుకోండి. అవసరంలేని సమయంలో టర్నాఫ్ చేసేయండి.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

ఫోన్‌లో మీరు క్లోజ్ చేసే అప్లికేషన్స్, మీ కళ్ల ముందు కనిపించకపోయినప్పటికి, బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి బ్యాటరీ బ్యాకప్‌ను వృథాగా ఖర్చు చేసేస్తుంటాయి. ఫోన్ బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఏఏ యాప్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేసుకుంటుందో తెలుసుకోవచ్చు. తద్వారా వాటిని మానిటర్ చేసుకోవచ్చు.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్
 

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

మీ ఫోన్‌లో బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఉన్నట్లయితే, బ్యాటరీ డౌన్ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా ఆ ఫీచర్ యాక్టివేట్ అయ్యే విధంగా ఫోన్ సెట్టింగ్స్‌ను మార్చుకోండి.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

లైవ్ వాల్‌పేపర్స్ మీ ఫోన్‌కు మంచి లుక్‌ను తీసుకువస్తాయ్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి నిరంతర కదులుతూ ఉండటం కారణంగా ఎక్కువ బ్యాటరీ పవర్‌ను ఖర్చు చేసుకుంటాయి. కాబట్టికి వీటిని పక్కన పెట్టి డార్క్ వాల్‌పేపర్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ ద్వారా మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఎంతో కొంత బ్యాటరీ ఆదా అవుతుంది.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

స్ర్కీన్ టైమ్ అవుట్‌ను మరింత తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

ఫోన్ వైబ్రేషన్స్ టర్నాప్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది.

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

టాప్ బ్యాటరీ సేవింగ్ టిప్స్

ఫోన్‌లోని అప్లికేషన్‌లను తరచూ అప్‌డేట్ చేసుకోవటం ద్వారా యాప్స్ ఎక్కువ బ్యాటరీ పవర్‌ను ఖర్చు చేయవు.

Best Mobiles in India

English summary
8 Tips and Tricks Every Android Smartphone User Should Know for a Longer Battery Life. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X