Apple AirPodsలో సాధారణ సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా..?

Wireless హెడ్ఫోన్స్ అనగానే ఎవరికైనా గుర్తువచ్చే ఒకేఒక్క ఉత్తమమైన హెడ్ఫోన్స్ ఆపిల్ ఎయిర్పాడ్స్, అంతగొప్ప పనితనాన్ని కలిగి ఉన్న airpods కూడా కొన్ని సమస్యలతో వినియోగదారుల అసహనానికి కారణమవుతుంది.

|

Wireless హెడ్ఫోన్స్ అనగానే ఎవరికైనా గుర్తువచ్చే ఒకేఒక్క ఉత్తమమైన హెడ్ఫోన్స్ ఆపిల్ ఎయిర్పాడ్స్, అంతగొప్ప పనితనాన్ని కలిగి ఉన్న airpods కూడా కొన్ని సమస్యలతో వినియోగదారుల అసహనానికి కారణమవుతుంది. Airpods వినియోగదారులు ఎక్కువగా విన్నవించే సమస్యలలో ముఖ్యమైనవి కాల్ డ్రాపింగ్, పెయిరింగ్ సమస్యలు, ఆడియో సమస్యలు. ఇలాంటి సమస్యలు మీకుకూడా ఉత్పన్నమవుతూ ఉంటే మీకోసమే ఈ పద్దతులు. Aripods, wireless మరియు చిన్నవిగా ఉన్నకారణంగా airpods ఎక్కడైనా మర్చిపోవడం లేదా ఒకAirpod కనపడకపోవడం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటుంటారు. వీరికోసం iphone లోనే ప్రత్యేకమైన సదుపాయంకూడా కల్పించబడినది. FindMyIphone అనే ఈఫీచర్ ద్వారా Airpods ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉన్నది.

airpods

మీiphone డివైజ్ లో find my iphone అనువర్తనాన్ని తెరవడం లేదా Icloud websiteలో మీ ఆపిల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి find my iphone అనే setting ద్వారా మీairpods ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉన్నది. ఇక్కడs elect your airpods అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా mapలో మీ airpods ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే సౌలభ్యం కల్పించబడినది. వీటి చార్జింగ్ అయిపోయే లోపునే వీటిని కనుక్కోవలసివస్తుంది.

BSNL సంచలనం, 40 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరిక !BSNL సంచలనం, 40 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరిక !

ఈ సెట్టింగ్ ద్వారా మీ Airpodsలో టోన్ వినిపించేలా చేయవచ్చు, తద్వారా Airpods ఎక్కడ ఉన్నాయో త్వరగానే తెలుసుకునే వీలుంటుంది. మీ Airpods switchonలో ఉన్నప్పుడూ green లైట్ వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ అవి టర్న్ఆఫ్ అయిపోయినా కూడా map, మీరు ఎక్కడనుండి వెతుకులాట మొదలుపెట్టవచ్చో అన్న ఆలోచనను కూడా ఇవ్వగలదు.

పెయిరింగ్ సమస్యలు:

పెయిరింగ్ సమస్యలు:

Airpods వినియోగదారులు ఎక్కువగా ఎదుర్కునే సమస్యలలో ఈ పెయిరింగ్ సమస్యకూడా ఒకటి. ఒకవేళ ఇవి పెయిర్ కాని పక్షంలో వీటిని తిరిగి చార్జింగ్ కేస్ లో 10సెకండ్లు ఉంచి తర్వాత మీ చెవులకు పెట్టుకుని ప్రయత్నించి చూడండి. అయినాకూడా పనిచేయని పక్షంలో మీ ఫోన్ లో బ్లూటూత్ ఒకసారి ఆఫ్ చేసి కొన్ని సెకండ్ల నిడివి తర్వాత మరలా ఆన్ చేసి ప్రయత్నించండి. ఒకవేళ ఈప్రయత్నం కూడా విఫలమయితే airpods రీసెట్ చెయ్యడమే చివరి మార్గం.

 ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఆడియో సమస్యలు:

ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఆడియో సమస్యలు:

Airpods ఆండ్రాయిడ్ డివైజులకు కనెక్ట్ చేసి వాడుతున్నప్పుడు సహజంగా ఎదుర్కునే సమస్య ఆడియో output సమస్య. IOS డివైజులకు కనెక్ట్ చేసినప్పుడు వచ్చే సాధారణ సౌండ్ క్వాలిటీ కన్నా ఆండ్రాయిడ్ డివైజులలో వచ్చే సౌండ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం airpods సహజంగా IOS,iphoneలలో ఉన్న w1 చిప్ తో అనుసంధానమై సౌండ్ ఇస్తుంది. కానీ ఈ చిప్ ఆండ్రాయిడ్ డివైజులలో ఉండదు. ముఖ్యంగా బ్లూటూత్ ఆడియో డివైజులలో 2 రకాల సౌండ్ వాల్యూమ్ లెవల్స్ ఉంటాయి. సోర్స్ డివైజ్ కాగా,ఆడియో డివైజ్. మీరు Airpods ఆండ్రాయిడ్ డివైజ్ కు కనెక్ట్ చేసినప్పుడు IOSచిప్ తో అనుసంధానమైనట్లుగా ఆండ్రాయిడ్ డివైజులలో ఉండదు. తద్వారా ఆడియో తక్కువగా ఉంటుంది. అయినా దీనికి ఒక పరిష్కారం ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు volumeRockers ద్వారా sound నియంత్రించుకునే వెసులుబాటు ఉంది. తద్వారా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయబడిన డివైజ్ సౌండ్ ప్రత్యేకంగా నియంత్రించుకునే సౌలభ్యం ఉంటుంది.

కాల్ డ్రాప్స్:

కాల్ డ్రాప్స్:

Airpods ద్వారా కాల్ డ్రాప్స్ జరుగుతున్న ఎడల దీనికి కూడా ఒక పరిష్కారం చూపబడింది. ఒక ఒక airpodతో కాల్ స్వీకరించడం చేయండి. కేవలం ఒకే Airpodద్వారా కాల్ స్వీకరించే వెసులుబాటుకూడా ఇందులో కల్పించబడింది. కొన్ని సందర్భాలలో ఒక airpod పూర్తిగా డిసేబుల్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది, తద్వారా కాల్ డ్రాపింగ్ నుండి బయటపడవచ్చు. కానీ ఇది బాటరీ త్వరగా అయిపోవడానికి కారణం అవుతుంది.

బాటరీ లైఫ్:

బాటరీ లైఫ్:

Airpods ఒక ఫుల్ చార్జితో 5గంటలు వినియోగించుకునేలా ఉంటాయి. కానీ దీని సమయం తగ్గుతూరావడం కూడా గమనించవచ్చు. కానీ అధికంగా బాటరీ డ్రైనింగ్ కు గురవుతూ ఉన్నట్లు మీకు అనిపిస్తే మాత్రం జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. AutomaticEarDetection ఆన్ లో ఉందోలేదో ముందు పరీక్షించుకోండి. ఈ ఫీచర్ ఆన్ లో ఉన్నప్పుడు, Airpods మీచెవులకు చేరినప్పుడే పనిచేసేలా, చెవులనుండి తీసినవెంటనే sleepmode వెళ్ళేలా చేయగలుగుతుంది. తద్వారా మీairpods త్వరగా బాటరీడ్రైన్ కు గురికావు.

రీసెట్టింగ్ airpods :

రీసెట్టింగ్ airpods :

పైనచెప్పిన అన్ని పరిష్కారాలు మీకు సంతృప్తిని ఇవ్వనిపక్షంలో చివరగా మీరు చేయగలిగిన ఒకేఒక్క పని మీairpods రీసెట్ చేయడం. ఇది ఏసమస్య లేకుండా కొత్తవిగా కొన్నప్పుడు ఎలా మీచేతికి వచ్చాయో, ఆ స్థితికి తిరిగి వెళ్లిపోతుంది. మీరు మరలా కాన్ఫిగర్ చేసుకొనేలా ఉంటాయి. మీAirpods case వెనుక ఉన్న బట్టన్ కాసేపు నొక్కిపట్టుకొని ఆరెంజ్ లైట్ వెలిగేదాకా వేచిచూడండి. తద్వారా అవి రీసెట్ చేయబడుతాయి. ఇప్పుడు మరలా మీడివైజ్ కు కనెక్ట్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ వినియోగదారులైతే మాత్రం మిగిలిన బ్లూటూత్ డివైజుల మాదిరిగానే అన్పెయిర్ చేసి మరలా పెయిర్ చేసే ప్రయత్నం చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Apple AirPods user? Here's how you diagnose the common problems More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X