iPhoneలో స్లీప్ షెడ్యూల్‌ ఫీచర్‌ని ఆన్ చేయడం ఎలా?

|

కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల విడుదల చేసిన iOS 14 అప్ డేట్ తో ఐఫోన్లో కొత్తగా స్లీప్ షెడ్యూల్ అనే కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఈ ఫీచర్ దీని యొక్క పేరుకు తగ్గట్టుగా మీ యొక్క నిద్ర సమయాలను షెడ్యూల్ చేయడానికి మరియు మీ నిద్రవేళకు ముందు మిమ్మల్ని హెచ్చరించడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మందికి దీని గురించి తెలియదు.

Apple iPhone ios 14 New Update Feature Sleep Schedule Enable Process Step-by-Step

మీరు ఈ ఫీచర్‌ని ఉపయోగించాలని అనుకుంటే కనుక మీకు ఐఫోన్ తప్ప మరేమీ అవసరం లేదు. అయితే మీ వద్ద యాపిల్ వాచ్ ఉంటే కనుక ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఆపిల్ వాచ్‌తో మీరు ఎంత సమయం నిద్రపోయారో వంటి వివరాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ స్లీప్ షెడ్యూల్ ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్‌లో స్లీప్ షెడ్యూల్‌ను ఉపయోగించే విధానం

Apple iPhone ios 14 New Update Feature Sleep Schedule Enable Process Step-by-Step

స్టెప్ 1: మీ ఐఫోన్‌లో హెల్త్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: తరువాత బ్రౌజ్ ట్యాబ్‌ మీద నొక్కండి.

స్టెప్ 3: మీరు స్లీప్ ఎంపిక కోసం క్రిందికి స్క్రోల్ చేయండి మరియు దానిని ఎంచుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు మీరు "యువర్ షెడ్యూల్" ఎంపికను చూస్తారు. దాని క్రింద ఉన్న ఎడిట్ ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 5: ఇక్కడ మీరు మీ నిద్రసమయాన్ని మరియు మేల్కొనే సమయాన్ని షెడ్యూల్ చేయవచ్చు.

(మీరు స్క్రోల్ వీల్‌పై నొక్కి పట్టుకుని మీకు నచ్చిన నిద్ర సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసిన సమయాన్ని బట్టి మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో మీరు చూస్తారు.)

Apple iPhone ios 14 New Update Feature Sleep Schedule Enable Process Step-by-Step

స్టెప్ 6: మీరు మీ యొక్క నిద్ర సమయాన్ని సెట్ చేసిన తర్వాత దిగువకు స్క్రోల్ చేసి అలారం ఎంపికను కనుగొనండి. దాని క్రింద మీరు కావాలనుకుంటే వేకప్ అలారాన్ని కూడా సెటప్ చేయవచ్చు (మీరు అలారం, వైబ్రేషన్ ప్యాటర్న్‌ల కోసం సౌండ్‌ను కూడా సెట్ చేయవచ్చు. అంతేకాకుండా తాత్కాలికంగా ఆపివేసే ఎంపికలను ప్రారంభించవచ్చు లేదా నిలిపివేయవచ్చు).

స్టెప్ 7: మీరు ఈ ఎంపికలను పూర్తి చేసిన తర్వాత 'Done' ఎంపిక మీద నొక్కండి.

పైన తెలిపిన దశలను అనుసరించడంతో మీరు మీ ఐఫోన్‌లో మీరు రోజులో ఎంత సమయం నిద్రపోతారో సులభంగా షెడ్యూల్ చేయవచ్చు. మీరు ప్రతి రోజు క్రమశిక్షణలో ఉండటానికి ఈ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇది నిద్రవేళకు అరగంట ముందు మీకు తెలియజేస్తుంది. తద్వారా మీరు చేసే పనిని ఆపివేసి నిద్రకు ప్రాధాన్యతను ఇవ్వవచ్చు.

Best Mobiles in India

English summary
Apple iPhone ios 14 New Update Feature Sleep Schedule Enable Process Step-by-Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X