Home
How to

ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు హై-రిస్క్ అలర్ట్! మీ ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి

ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు కేంద్ర భద్రతా సంస్థ CERT-In ఆగస్టు 19, 2026న హై-రిస్క్ అలర్ట్ జారీ చేసింది. iOS 26.6.1, iPadOS 26.6.1 కంటే పాత వెర్షన్లతో పనిచేసే డివైజ్‌లలో తీవ్రమైన సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు హెచ్చరించింది. ఈ ముప్పు చాలా ప్రమాదకరమైనదని, యూజర్లు వెంటనే తమ పరికరాలను అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. సిస్టమ్ కోర్ కాంపోనెంట్లలో జరిగే 'కోడ్-ఎగ్జిక్యూషన్' దాడులను ఈ లేటెస్ట్ అప్‌డేట్ అడ్డుకుంటుందని ఆపిల్ వెల్లడించింది.

ఆపిల్ సంస్థ ఆగస్టు 17, 2026న iOS, iPadOS 26.6.1 అప్‌డేట్‌లను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌కిట్ (WebKit), కెర్నెల్ (Kernel), మీడియా విభాగాల్లో ఉన్న సెక్యూరిటీ లోపాలను ఇందులో సరిచేసింది. హానికరమైన కంటెంట్ ద్వారా డివైజ్‌లలో కోడ్ రన్ చేసేందుకు వీలు కల్పించే దాదాపు 20 నుంచి 30 వరకు లోపాలను ఈ అప్‌డేట్‌ క్లియర్ చేసింది. గత మూడు వారాల్లో ఆపిల్ విడుదల చేసిన మూడో సెక్యూరిటీ అప్‌డేట్ ఇది కావడం గమనార్హం. CERT-In ఇచ్చిన హెచ్చరికలు కూడా ఆపిల్ ఆగస్టు 17న అందించిన సెక్యూరిటీ ప్యాచ్‌లకు సంబంధించినవే.

Apple iPhone and iPad Security Alert: Update to iOS 26.6.1 Immediately to Prevent Hacking Risks (2026)

ఐఫోన్, ఐపాడ్ అప్‌డేట్ చేసుకునే విధానం

మీ డివైజ్‌ను అప్‌డేట్ చేయడానికి Settings > General > Software Update ఆప్షన్‌లోకి వెళ్లి 'Update Now' పై టాప్ చేయండి. వైఫై ఆన్ చేసి, ఛార్జింగ్ 50 శాతం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ స్టోరేజ్ చాలకపోతే 'Offload Unused Apps' వాడండి లేదా 'Optimize iPhone Storage' ఆన్ చేసుకోండి. 'Automatic Updates' ఆన్ చేసుకుంటే, రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అదే అప్‌డేట్ అవుతుంది. ఫోన్ రీస్టార్ట్ అయ్యాక Settings > General > About లోకి వెళ్లి చూస్తే iOS 26.6.1 అని కనిపిస్తుంది; RSR ఉంటే పక్కన ఒక అక్షరం చేరుతుంది.

యూపీఐ భద్రత, వాట్సాప్ టూ-స్టెప్ వెరిఫికేషన్

బ్యాంకు అధికారులు లేదా ఆర్‌టీఓ ఏజెంట్లమని చెప్పినా కూడా ఎవరికీ మీ OTP లేదా UPI PIN వివరాలను షేర్ చేయకూడదు. అనధికార APK లింకులను అస్సలు క్లిక్ చేయకండి, కేవలం ఆపిల్ యాప్ స్టోర్ నుంచే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. Settings > General > VPN and Device Management లోకి వెళ్లి, ఏవైనా తెలియని ప్రొఫైల్స్ ఉంటే వెంటనే తొలగించండి. మీ ఆపిల్ అకౌంట్‌కు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేసుకోండి. అలాగే వాట్సాప్‌లో 'Two-step Verification' ఎనేబుల్ చేసి, రికవరీ ఈమెయిల్ ఐడీని జత చేయండి.

అప్‌డేట్ తర్వాత బ్యాటరీ డ్రెయిన్, యాప్స్ క్రష్ అవుతున్నాయా?

అప్‌డేట్ పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్‌లో ఇండెక్సింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి, ఆ సమయంలో బ్యాటరీ కాస్త త్వరగా ఖర్చవ్వడం సహజమే. దీనికి 24 నుంచి 72 గంటల సమయం పడుతుంది, కాబట్టి ఈ సమయంలో ఫోన్‌ను వైఫైకి కనెక్ట్ చేసి ఛార్జింగ్‌లో ఉంచండి. అప్పటికీ బ్యాటరీ త్వరగా అయిపోతుంటే యాప్‌లన్నింటినీ అప్‌డేట్ చేసి, 'Background App Refresh' సెట్టింగ్స్‌ను చెక్ చేయండి. ఒకవేళ యాప్‌లు క్రష్ అవుతుంటే అప్‌డేట్ చేయడం, ఫోన్‌ను ఫోర్స్ రీస్టార్ట్ చేయడం లేదా డేటా బ్యాకప్ తీసుకుని యాప్‌ను రీఇన్‌స్టాల్ చేయడం వంటివి చేయాలి. ఆపిల్ సపోర్ట్ టీమ్ కూడా అప్‌డేట్ తర్వాతి ఈ చిన్నచిన్న సమస్యలకు ఇవే సులువైన పరిష్కారాలని తెలిపింది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X