ఆపిల్ యూజర్లకు ప్రమాదం! మీ ఐఫోన్, మ్యాక్ వెంటనే అప్‌డేట్ చేయండి, లేదంటే డేటా చోరీ!
భారత సైబర్ భద్రతా సంస్థ CERT-In అక్టోబర్ 9న సైబర్ బెదిరింపుల తీవ్రతపై మరోసారి స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఆపిల్ యూజర్లకు సంబంధించి అక్టోబర్ 1నే ఒక 'హై-సివియారీటీ' అలర్ట్ విడుదల కాగా, ప్రత్యక్షంగా సైబర్ దాడులు జరుగుతున్నట్లు గుర్తించడంతో ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పాత iOS, iPadOS, macOS వర్షన్‌లలో ‘రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్’ ముప్పు ఉందంటూ హెచ్చరించింది. మీరు గనక మీ పరికరాల అప్‌డేట్లను వాయిదా వేస్తుంటే, ఈరోజే (అక్టోబర్ 12) వెంటనే ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. సరికొత్త వర్షన్లకు మారడమే దీనికి అత్యంత సులువైన పరిష్కారం. ఆపిల్ ఎకోసిస్టమ్‌లో ఉన్న డివైజ్లను అప్‌డేట్ చేసుకోవాలని CERT-In జారీ చేసిన హెచ్చరిక గుర్తు చేస్తోంది.
CoreGraphics విభాగంలో వెలుగుచూసిన 'CVE-2026-86950' అనే అవుట్-ఆఫ్-బౌండ్స్ రైట్ బగ్ వల్ల హ్యాకర్లు డివైజ్‌లో హానికరమైన కోడ్‌ను రన్ చేసే అవకాశం ఉంది. అత్యంత వ్యూహాత్మకంగా, నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడుల్లో ఈ లోపాన్ని ఇప్పటికే ఉపయోగించి ఉండవచ్చని ఆపిల్ పేర్కొంది. ఈ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉందని భావించిన CERT-In, ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు వెంటనే ప్యాచ్ చేసుకోవాలని సూచించింది. నేషనల్ వల్నరబిలిటీ డేటాబేస్ కూడా ఈ ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని తెలిపింది. అప్‌డేట్లను ఆలస్యం చేస్తే ఫైల్ ఆధారిత దాడులు జరగడం, సిస్టమ్ క్రాష్ కావడం లేదా డేటా కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది. వెంటనే అప్‌డేట్ చేయడం ద్వారా మీరు రోజువారీ వాడే డివైజ్‌లపై దాడుల ముప్పును సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.

మీరు సెక్యూరిటీ ప్యాచ్‌లను మిస్ అయ్యారనడానికి కొన్ని సంకేతాలు గమనించవచ్చు: పదే పదే అప్‌డేట్ మెసేజ్‌లు రావడం, ఇన్‌స్టాలేషన్ విఫలం కావడం లేదా ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే సఫారీ (Safari) బ్రౌజర్ క్రాష్ కావడం వంటివి జరగవచ్చు. అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత పరికరాన్ని రీస్టార్ట్ చేయడాన్ని వాయిదా వేయకండి. సాఫ్ట్‌వేర్ తనిఖీ చేసేముందు బీటా ప్రొఫైళ్లను తొలగించండి. బ్యాక్‌గ్రౌండ్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఆప్షన్‌ను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచండి. ఒకసారి అప్‌డేట్ చేశాక మళ్లీ మునుపటి వర్షన్‌కు సులువుగా డౌన్‌గ్రేడ్ చేయడం కుదరదు కాబట్టి, ముందే ఒక క్విక్ బ్యాకప్ తీసుకుని, ఆలస్యం చేయకుండా అప్‌డేట్ చేయండి.
CERT-In అలర్ట్: ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్‌లలో అప్‌డేట్ చేసే స్టెప్స్
వెంటనే అప్‌డేట్ చేయండి. ఐఫోన్ లేదా ఐప్యాడ్: సెట్టింగ్స్ → జనరల్ → సాఫ్ట్‌వేర్ అప్డేట్, ఆపై Install నొక్కండి. మ్యాక్: Apple menu → System Settings → General → Software Update ఎంచుకోండి. ఆపిల్ వాచ్: వాచ్ యాప్ → జనరల్ → సాఫ్ట్‌వేర్ అప్డేట్ లేదా వాచ్‌లోని Settings లోకి వెళ్లండి. అన్ని పరికరాల్లోనూ ఆటో అప్డేట్స్ ఆన్ చేయండి. భారతీయ యూజర్లకు ఈ వారం ఇవే అత్యంత సురక్షితమైన బేస్‌లైన్ వర్షన్లు.
| ప్లాట్‌ఫామ్ | కనీస సురక్షిత వర్షన్ |
|---|---|
| iOS / iPadOS | 26.7.1 లేదా ఆపైన |
| macOS Sequoia | 15.8.1 లేదా ఆపైన |
| macOS Tahoe | 26.7.1 లేదా ఆపైన |
ఆపిల్ ఖాతాల కోసం 2FA, లాక్‌డౌన్ మోడ్, ప్రైవసీ చెక్‌లు
మీ ఆపిల్ ఖాతాల భద్రతను ఈరోజే మరింత బలోపేతం చేయండి. టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఆన్ చేసుకోండి: సెట్టింగ్స్ → మీ పేరు → Sign‑In & Security → Two‑Factor Authentication. సైబర్ దాడి ముప్పు ఎక్కువగా ఉన్న వినియోగదారులు లాక్‌డౌన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోండి: సెట్టింగ్స్ → ప్రైవసీ & సెక్యూరిటీ → Lockdown Mode. సపోర్ట్ చేసే చోట పాస్‌కీలు లేదా సెక్యూరిటీ కీలను ఉపయోగించండి. యాప్‌ల ప్రైవసీ వివరాలను సరిచూసుకోండి: సెట్టింగ్స్ → Privacy & Security → App Privacy Report. వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌లలో వచ్చే ఇన్వాయిస్ లేదా స్టేట్‌మెంట్ ఫైళ్లను తెరవకుండా జాగ్రత్తపడండి. ఆండ్రాయిడ్ డివైజ్ ఉన్నట్లయితే, Install Unknown Apps ఆప్షన్‌ను ఎప్పుడూ డిసేబుల్‌లోనే ఉంచండి.


Click it and Unblock the Notifications
