YouTube షార్ట్‌లను రీమిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ విధానాలను అనుసరించండి...

|

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు నుంచి వినియోగదారులు వినోదం కోసం వినియోగిస్తున్న వాటిలో యూట్యూబ్ ఒకటి. స్మార్ట్‌ఫోన్లలో యూట్యూబ్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక అప్ డేట్ల తరువాత ఇప్పుడు యూట్యూబ్ తన వినియోగదారులకు షార్ట్‌ల పేరుతో చిన్న వీడియోలను చేయడానికి కూడా అనుమతిని ఇస్తున్నది. ప్రస్తుతం చిన్న చిన్న వీడియోలను చూడడానికి అధిక మంది ఇష్టపడుతున్నారు. యూట్యూబ్ యొక్క కొత్త టూల్‌కిట్ సహాయంతో వీడియోలను షార్ట్‌ల రూపంలో 5 సెకన్ల వరకు యూట్యూబ్ షార్ట్స్ గా రీమిక్స్‌లను సృష్టించడానికి అనుమతిస్తుంది.

 
Are You Trying to Remix YouTube Shorts? Follow These Steps

యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్ నుండి ముందు మాదిరి ఆడియోతో వినియోగదారులు తయారుచేసే షార్ట్‌లు సోర్స్ సృష్టికర్త యొక్క అసలైన వీడియోకి ఆపాదించబడతాయి. యూట్యూబ్ ప్రకారం సృష్టికర్తలు తమ వీడియోలను రీమిక్స్ చేయకూడదనుకుంటే యూట్యూబ్ స్టూడియోలో నిలిపివేసే అవకాశం కూడా ఉంది. యూట్యూబ్ అధికారిక మ్యూజిక్ భాగస్వాముల నుండి కాపీరైట్ చేయబడిన కంటెంట్‌తో కూడిన మ్యూజిక్ వీడియోలు రీమిక్స్ చేయడానికి అర్హత పొందలేవని గమనించాలి.

 

యూట్యూబ్ షార్ట్‌లను రీమిక్స్ చేసే విధానం

Are You Trying to Remix YouTube Shorts? Follow These Steps

** మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయండి.
** మీరు రీమిక్స్ చేయాలనుకుంటున్న సంబంధిత వీడియో లేదా షార్ట్‌కి వెళ్లండి.
** మూడు చుక్కల మెనుపై నొక్కండి మరియు "కట్" ఎంపికను ఎంచుకోండి.
** పెద్ద-సైజు వీడియోలలో మీరు రీమిక్స్ ఎంపికల నుండి "సృష్టించు" బటన్‌ను ఎంచుకొని ఆపై "కట్" ఎంపిక మీద నొక్కండి.

వినియోగదారులు యూట్యూబ్ షార్ట్‌లో వీడియోలోని ఏ భాగాన్ని ఉపయోగించాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. ఇంతకుముందు యూట్యూబ్‌లోని వీడియోల నుండి వినియోగదారులు చిన్న ఆడియో క్లిప్‌లను విభజించవచ్చు. అయితే ఇప్పుడు వినియోగదారులు అర్హత ఉన్న వీడియోలు మరియు షార్ట్‌ల నుండి 1 నుండి 5 సెకన్ల సెగ్మెంట్‌లను క్లిప్ చేయగలరు మరియు వాటిని వారి స్వంత షార్ట్‌లలో ఉపయోగించగలరు.

Are You Trying to Remix YouTube Shorts? Follow These Steps

యూట్యూబ్ షార్ట్‌లను ఇప్పుడు వెబ్ మరియు టాబ్లెట్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చని యూట్యూబ్ ప్రకటించింది. ఈ షార్ట్‌లు కొత్త షార్ట్‌ల ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఇవి రాబోయే వారాల్లో పరికరాల్లో అందుబాటులోకి వస్తాయి. మీ యొక్క వీడియోలకు ప్రతిస్పందించడానికి వినియోగదారులను అనుమతించడానికి యూట్యూబ్ కొత్త మార్గాన్ని పరీక్షిస్తోంది. కంపెనీ టైమ్డ్ ఎమోజీస్ అనే ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఇది వీక్షకులు వీడియోలో నిర్దిష్ట ఎమోజీతో ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది.

Best Mobiles in India

English summary
Are You Trying to Remix YouTube Shorts? Follow These Steps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X