Home
How to

ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్‌ త్వరగా అయిపోతోందా.. ఈ చిట్కాలు ప్రయత్నం చేయండి..!

Laptop Charging Tips : ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు సహా ఇతరులు ఉద్యోగం, విద్యా, ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరాల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనా నుంచి ల్యాప్‌టాప్‌ ల వినియోగం మరింత అధికం అయింది. అయితే ప్రస్తుతం అనేక మంది ల్యాప్‌టాప్‌ యూజర్లు బ్యాటరీ లైఫ్‌ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంటే తక్కువ సమయంలోనే ల్యాప్‌టాప్‌ బ్యాటరీ డిశ్ఛార్జ్ అయిపోవడంపై ఆందోళన చెందుతున్నారు.

* మెరుగైన బ్యాటరీ లైఫ్‌ కోసం :
బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అవసరం లేని యాప్స్‌ ను డిలీట్‌ చేయడం, అవసరం లేని ఫీచర్‌లను ఆఫ్‌ చేసుకోవడం, క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేయడం సహా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్‌ ను మెరుగుపరుచుకొనేందుకు అవకాశం ఉంటుంది.

avoid these mistakes during laptop charging to get longer battery life full guide

* ఒరిజినల్‌ ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి :
సాధారణంగా ల్యాప్‌టాప్‌ లు కొనుగోలు చేసే సమయంలో వాటి ఛార్జర్‌ లను కూడా సంస్థలు అందిస్తుంటాయి. ఛార్జర్‌ డ్యామేజీ కావడం సహా ఇతర కారణాలతో కొంత మంది యూజర్లు ఇతర ఛార్జర్‌లను ఉపయోగిస్తుంటారు. బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోయేందుకు ఇది కూడా కారణమే. అందువల్ల ఒరిజినల్‌ ఛార్జర్‌ లను మాత్రమే ఉపయోగిస్తే.. బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది.

* ప్రత్యేక ఫీచర్‌లను ఉపయోగించుకోవాలి :
ల్యాప్‌టాప్‌ లో ఎక్కువ సమయం బ్యాటరీ లైఫ్‌ వచ్చేందుకు వీలుగా Battery Saver Mode లేదా Power Saver Mode వంటి ఫీచర్‌లను అందిస్తున్నాయి. ఈ ఫీచర్‌ లు ల్యాప్‌టాప్‌ బ్యాటరీ లైఫ్‌ మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి.

avoid these mistakes during laptop charging to get longer battery life full guide

* గరిష్ఠంగా 90 శాతం.. కనిష్ఠంగా 20 శాతం :
ల్యాప్‌టాప్‌ యూజర్లు అనేక మంది ఇష్టానుసారం ఛార్జింగ్‌ చేస్తుంటారు. ల్యాప్‌టాప్‌ బ్యాటరీని 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్‌ చేయాలి. మరియ బ్యాటరీ ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే ల్యాప్‌టాప్‌ మెరుగైన బ్యాటరీ లైఫ్‌ ను అందించే అవకాశం ఉంటుంది.

అయితే కొంత మందికి సరైన అవగాహన లేకపోవడం సహా ఇతర కారణాలతో 100 శాతం వచ్చేంత వరకు ఛార్జింగ్‌ చేస్తుంటారు. ఫలితంగా బ్యాటరీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు పూర్తిగా స్విచ్‌ ఆఫ్‌ అయ్యేంత వరకు ఎదురుచూడకుండా 20 శాతం ఉన్నప్పుడే ఛార్జింగ్‌ చేసే అలవాటు చేసుకోవాలి.

avoid these mistakes during laptop charging to get longer battery life full guide

* తక్కువ బ్రైట్‌నెస్‌ తో వినియోగం :
ల్యాప్‌టాప్‌ ను వీలైనంత తక్కువ బ్రైట్‌నెస్‌ తో ఉపయోగించే అలవాటు చేసుకోవాలి. మరియు అవసరం లేని యాప్స్‌, సాఫ్ట్‌వేర్‌ ను తొలగించాలి. దీంతోపాటు బ్లూటూత్‌, వైఫై ను ఆఫ్‌ చేసుకోవాలి. అవసరం అయిన సమయాల్లోనే ఆన్‌ చేసుకోవాలి.

Take a Poll

* క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాలి :
దీంతోపాటు ల్యాప్‌టాప్‌ సాఫ్ట్‌వేర్‌, డ్రైవర్స్‌ ను క్రమంగా తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి. ఫలితంగా ల్యాప్‌టాప్‌ పనితీరు మెరుగుపడడంతో పాటు బ్యాటరీ పనితీరు కూడా మెరుగవుతుంది. సంస్థలు అందించే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

Best Mobiles in India

English summary
avoid these mistakes during laptop charging to get longer battery life full guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X