ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ఎలా?

|

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 2018 సంవత్సరంలో జాతీయ ఆరోగ్య విధానం యొక్క 2017 సిఫార్సులలో భాగమైన జాతీయ చొరవను ప్రధానమంత్రి ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత ప్రభుత్వంచే నిధులు సమకూర్చబడిన జాతీయ ఆరోగ్య రక్షణ పథకం. దేశంలోని 50 కోట్ల మందికి పైగా పౌరులు మరియు దాదాపు పది కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు వారి యొక్క వయస్సుపై ఎటువంటి పరిమితులు లేకుండా ఈ పథకం రూపొందించబడింది.

Ayushman Bharat Yojana Scheme Online Register Process Step by Step

అనారోగ్య కారణంగా ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు బీమా కవరేజీతో కూడిన ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో కుటుంబాలకు సహాయం చేయడానికి PMJAY సెట్ చేయబడింది. ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రులు మరియు నెట్‌వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను చేయించుకోవడానికి అందిస్తుంది. ఈ పథకం యొక్క ప్రాథమిక ప్రయోజనం విషయానికి వస్తే ఇందులో దాదాపు 1,400పైగా చికిత్సలు ఉచితంగా చేయించుకోవడానికి అనుమతిస్తుంది.

Ayushman Bharat Yojana Scheme Online Register Process Step by Step

ఈ పథకం క్రింద లభించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే PMJAY క్రింద చికిత్స మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా ఉచితంగా లభిస్తాయి. ఇది పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది మరియు బహుళ శస్త్రచికిత్సల విషయంలో, అత్యధిక ప్యాకేజీ ఖర్చు కూడా కవర్ చేయబడుతుంది. మీరు ఆన్‌లైన్‌లోనే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక కింద గల గైడ్ లైన్ ను అనుసరించండి.

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానం

Ayushman Bharat Yojana Scheme Online Register Process Step by Step

PMJAY స్కీమ్ SEC 2011 జాబితా కింద గుర్తించబడిన మరియు RSBY పథకంలో భాగమైన లబ్ధిదారులందరికీ వర్తిస్తుంది. మీరు PMJAY కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకుంటే మీరు అనుసరించాల్సిన దశలు..

** ముందుగా https://www.pmjay.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

** తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

** మీరు మీ నమోదిత మొబైల్ నంబర్‌లో OTPని అందుకుంటారు. అది మిమ్మల్ని PMJAY లాగిన్ పోర్టల్‌కు తీసుకెళ్తుంది.

** తర్వాత మీరు PMJAY స్కీమ్ లో చేరడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క రాష్ట్రాన్ని ఎంచుకోండి.

** తర్వాత మొబైల్ నంబర్, పేరు, రేషన్ కార్డ్ నంబర్ లేదా RSBY URN నంబర్ వంటి ఎంపికలలో దేనిలోని వివరాలను నమోదు చేయడం ద్వారా మీ అర్హతను ఎంచుకోండి.

** మీరు అర్హత కలిగి ఉంటే కనుక మీ యొక్క పేరు పేజీ యొక్క కుడి వైపున ప్రతిబింబిస్తుంది.

** లబ్ధిదారుల వివరాలను తనిఖీ చేయడానికి మీరు 'కుటుంబ సభ్యుల' ట్యాబ్‌పై క్లిక్ చేయవచ్చు.

Ayushman Bharat Yojana Scheme Online Register Process Step by Step

PMJAY స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల విషయానికి వస్తే మొదటిది మీ వయస్సు మరియు గుర్తింపు రుజువు, సంప్రదింపు వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు కుటుంబం యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన డాక్యుమెంట్ రుజువు (ఉమ్మడి లేదా అణు) కోసం ఆధార్ లేదా పాన్ కార్డ్ అవసరం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Ayushman Bharat Yojana Scheme Online Register Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X