స్మార్ట్‌ఫోన్ వాడేవారు సాధారణంగా చేస్తున్న తప్పులు

ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్‌ వినియోగమూ విపరీతంగా పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ ఇంటర్నెట్‌ వినియోగమూ విపరీతంగా పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి తోడు ఎన్నో అవసరాలను ఇంటర్నెట్‌ తీరుస్తోంది.అయితే మన ఫోన్‌లో మనకు తెలియకుండానే కొంత ఇంటర్నెట్‌ వినియోగం జరిగిపోతుంటుంది. దానిని నివారించడం, సెర్చ్‌ చేసేటప్పుడు మనకు ఏది అవసరమో దానినే సెర్చ్‌ చేస్తే డేటా వినియోగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో మొబైల్‌లో ఇంటర్నెట్‌ డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి... బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్న సమయంలో ఏ విధమైన సూచనలు పాటించాలో కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ సార్మ్ట్ లుక్కేయండి.

రెండేళ్ల జియో ప్రస్థానంలో ఎన్నో మలుపులురెండేళ్ల జియో ప్రస్థానంలో ఎన్నో మలుపులు

మొబైల్‌ డేటాపై అవగాహన ..

మొబైల్‌ డేటాపై అవగాహన ..

స్మార్ట్‌ఫోన్స్‌ ఉపయోగించే వారందరికీ మొబైల్‌ డేటాపై అవగాహన ఉంటుంది. ఇంటర్నెట్‌ కావాలంటే రీచార్జి చేసుకోవడం ద్వారా డేటా లభిస్తుంది. వచ్చిన డేటాను లిమిట్‌ వరకు వినియోగించుకునే వీలుంది.

4జీ డేటా

4జీ డేటా

ఇటీవల మార్కెట్లో అనేక సంస్థలు 4జీ డేటాను ప్రవేశపెట్టాయి. 4జీ డేటాను తీసుకోవడం ద్వారా వేగం ఉంటుంది. అందువల్ల డేటా మొత్తం ఖర్చ య్యే అవకాశాలున్నాయి. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

వై-ఫై ద్వారా డౌన్‌లోడ్‌..

వై-ఫై ద్వారా డౌన్‌లోడ్‌..

ఈ-మెయిల్‌ ద్వారా వచ్చే ఎటాచ్‌మెంట్స్‌ను వై-ఫై ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది. ఈ మెయిల్స్‌ ద్వారా పలు అటాచ్‌మెంట్స్‌ వస్తుంటాయి. వీటిని ఈ మెయిల్‌ చూసిన వెంటనే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయ్యే విధంగా ఉంచకూడదు.

ఈ మెయిల్స్‌ను చెక్‌ చేసుకున్న తర్వాత

ఈ మెయిల్స్‌ను చెక్‌ చేసుకున్న తర్వాత

ఈ మెయిల్స్‌ను చెక్‌ చేసుకున్న తర్వాత ఎటాచ్‌మెంట్స్‌ ఉంటే వీటిని వై-ఫై అందుబాటులో ఉన్న చోట డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

ముఖ్యమైన వీడియోలను..

ముఖ్యమైన వీడియోలను..

ప్రస్తుతం ప్రతి కార్యాలయంలోనూ వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. దీనివల్ల మీ మొబైల్‌లోని డేటా సేవ్‌ చేసినట్టే. ముఖ్యమైన వీడియోలను వైఫై ద్వారా చూసుకోవడం మంచిది.

ఓపెరా, క్రోమ్‌ వంటి బ్రౌజర్స్‌లో..

ఓపెరా, క్రోమ్‌ వంటి బ్రౌజర్స్‌లో..

ఓపెరా, క్రోమ్‌ వంటి బ్రౌజర్స్‌లో డేటా డేటా కంప్రెషన్‌ యుటిలిటీ బిల్ట్‌ఇన్‌గా వస్తుంది. దీనివల్ల కొంత డేటా యూసేజ్‌ సేవ్‌ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమేటిక్‌ అప్‌డేట్స్‌ను ఆన్‌లో ఉంచకూడదు. దీనివల్ల అనేక యాప్స్‌ నిరంతరం అప్‌డేట్‌ అవుతునే ఉంటాయి.

వైఫై పాస్‌వర్డ్‌ను..

వైఫై పాస్‌వర్డ్‌ను..

ప్రస్తుతం నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లి నా వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. వైఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవడం ద్వారా మీ మొబైల్‌ నుంచే నెట్‌ని వినియోగిస్తూ పనులు పూర్తి చేసుకునే వీలుంది.

సెక్యూరిటీ లేకుండా వైఫై

సెక్యూరిటీ లేకుండా వైఫై

కొన్ని చోట్ల సెక్యూరిటీ లేకుండా వైఫై ఉంటుంది. ఇటువంటి వైఫై సౌకర్యాన్ని వినియోగించుకోవడం చాలా ఇబ్బంది కరమైన విషయమైనా నెట్‌ను ఇతరులు సులువుగా ఉపయోగిస్తారు. దీని వలన తెలియకుండానే మన ఇంటర్నెట్‌ డేటా ఖర్చవుతుంది.

రూటర్‌ ద్వారా వైఫై..

రూటర్‌ ద్వారా వైఫై..

అందువల్ల మీరు తీసుకున్న నెట్‌కు రూటర్‌ ద్వారా వైఫై ఉంచినప్పటికీ తప్పకుండా పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ ఉంచుకోవాలి. పాస్‌వర్డు ప్రొటెక్షన్‌ లేకపోవడం వల్ల ఇతరులు సులువు గా మన నెట్‌ ఉపయోగిస్తారు.

సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు..

సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు..

ఇంటర్నెట్‌ ను సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా మనకే ఇబ్బంది వస్తుంది. మనం వినియోగిస్తున్న ఐపీ రికార్డు అవుతుంది. కాబట్టి సమస్యలు తలెత్తకుండా వైఫైను జాగ్రత్తగా వినియోగించుకోవాలి.

Best Mobiles in India

English summary
Best Tips and Tricks To Reduce Data Usage On Android more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X