మీ పాత కంప్యూటర్‌ను ఏం చేస్తున్నారు..?

కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నారా, అయితే మీ పాత కంప్యూటర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు?, పాత పీసీని ఇంటిలో ఉంచటం వల్ల లాభమా.. నష్టమా..? ఏమైనా అద్భుతాలు సృష్టించవచ్చా..? పలు ముఖ్యమైన సూచనలు..

Read More : రూ.1999కే అమెజాన్ టీవీ, నేడే మార్కెట్లోకి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీ పాత కంప్యూటర్ కండీషన్ బాగున్నట్లయితే డిజిటల్ ఫోటోఫ్రేమ్‌గా మార్చేయండి. ఇందుకుగాను ఫ్లికర్, పికాసా వంటి ఉచిత అప్లికేషన్‌లు వెబ్ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి.

టిప్ 2

మీ పాత కంప్యూటర్‌లోని హార్డ్‌డ్రైవ్ పనిచేస్తున్నట్లయితే పోర్టబుల్ ఎక్సటర్నల్ స్టోరేజ్‌లా ఉపయోగించుకోవచ్చు.

టిప్ 3

మీరు వెబ్ ప్రొఫెషనల్ అయితే మీ పాత మానిటర్‌ను సెకండరీ డిస్‌ప్లేలా ఉపయోగించుకోవచ్చు.

టిప్ 4

అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల, మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు.

టిప్ 5

మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.

టిప్ 6

మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి. ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు.

టిప్ 7

మీరు గేమింగ్ ప్రియులా, అయితే మీ పీసీని గేమింగ్ సర్వర్‌లా మార్చేయండి. మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్‌లో పరీక్షించవచ్చు.

టిప్ 8

కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ డివైస్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.

టిప్ 9

ఆశించిన దానికన్న ఎక్కువ ధర లభించినట్లయితే మీ పాత కంప్యూటర్‌ను అమ్మేసి ఆ డబ్బుతో వేరొక వస్తువును కొనుగోలు చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Ways to Repurpose Your Old Computer. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot