SIM స్వాపింగ్ ఫ్రాడ్ నుండి సురక్షితంగా ఉండడం ఎలా?

|

ప్రస్తుత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజులలో సైబర్ దాడుల గురించి తరచుగా వింటూ ఉంటాము. ఫిషింగ్, మాల్వేర్ మరియు ransomware దాడుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో SIM మార్చడం వంటివి గుర్తించబడదు. దీని ద్వారా మీ మొబైల్ SIM కార్డ్ యొక్క క్లోన్‌ను పొంది టూ-ఫ్యాక్టర్ అతేంటికేషన్ ను దాటవేయడానికి సైబర్ నేరస్థులు తరచుగా ఉపయోగిస్తుంటారు అని మేము అర్థం చేసుకున్నాము. ఇది వారికి మీ ప్రైవేట్ సమాచారానికి పొందడానికి యాక్సిస్ ను అందజేస్తుంది. మీ యొక్క SIM ఫంక్షన్‌కి మారడానికి సైబర్ నేరస్థుడికి మొదటగా ఇదే అవసరం అవుతుంది. బాధితురాలి SIM కార్డు యొక్క డూప్లికేట్ ని పొందడానికి వారి పూర్తి పేరు, ID ప్రూఫ్, ఫోన్ నంబర్ వంటి మొదలైన వ్యక్తిగత సమాచారం వారికి అవసరం అవుతుంది.

Beware OF SIM Swapping Fraud! How to Stay Safe

SIM కార్డ్ వినియోగదారుడి యొక్క గుర్తింపును తనిఖీ చేయడంలో మొబైల్ ప్రొవైడర్ శ్రద్ధ చూపకపోతే బాధితుని వలె నటించడం చాలా సులభంగా చేయవచ్చు. కొత్త SIM కార్డ్‌ని పొందుతున్నప్పుడు భద్రతా చర్యలు అమలు చేయకపోతే కనుక మిమ్మల్ని బాధపెట్టాలనుకునే ఎవరైనా సరే మీలాగే నటిస్తూ చాలా సులభంగా SIM ని పొందవచ్చు. అందువల్ల డూప్లికేట్ సిమ్‌ని పొందిన తర్వాత సైబర్ నేరస్థుడు దానిని మరొక పరికరంలో సులభంగా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ఫోన్ కాల్ మరియు మెసేజ్ హిస్టరీతో సహా బాధితుల ఒరిజినల్ సిమ్ కార్డ్‌లోని మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. వీటితో పాటుగా బ్యాంకింగ్ లావాదేవీ లేదా బదిలీకి అవసరమైన OTPకి కూడా యాక్సెస్ ను సులభంగా పొందుతారు. బ్యాంకింగ్ OTP యాక్సిస్ లభించే వారు మీ వద్ద ఉన్న మొత్తం డబ్బును దోచుకోవడానికి కేవలం ఒక్క నిమిషం మాత్రమే సరిపోతుంది.

Beware OF SIM Swapping Fraud! How to Stay Safe

సిమ్ స్వాపింగ్ నుండి సురక్షితంగా ఉండే విధానం

** గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే మీ యొక్క ఫోన్ లో సిమ్ నెట్ వర్క్ యొక్క సిగ్నల్ పోయిందో లేదో చూడటం. రెండవ SIM కార్డ్ ని జోడించబడినప్పుడు బాధితుడి SIM కార్డ్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయబడదు మరియు కాల్‌లు చేయడానికి లేదా టెక్స్ట్ మెసేజ్ లను పంపడానికి ఉపయోగించబడదు కాబట్టి అది మొత్తం మొబైల్ సిగ్నల్‌లను కోల్పోతుంది.

Beware OF SIM Swapping Fraud! How to Stay Safe

** వెబ్‌సైట్‌కి వ్యక్తిగత సమాచారాన్ని అందించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వెబ్‌సైట్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించడాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించండి.

** దయచేసి ఏదైనా తెలియని వెబ్‌సైట్‌లో మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసే ముందు అది సురక్షితమైనదని మరియు నమ్మదగినదని నిర్ధారించుకోండి.

Best Mobiles in India

English summary
Beware OF SIM Swapping Fraud! How to Stay Safe

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X