BGMI గేమ్‌ను ఐఫోన్, ఐప్యాడ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ ఎట్టకేలకు iOS మరియు iPad వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇది iOS ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభించబడింది. ఈ యాప్ ప్రస్తుతం iPhone మరియు iPad వినియోగదారుల కోసం Apple India App Store ద్వారా అందుబాటులో ఉంది. అయితే ఈ యాప్ ప్రారంభంలో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై జూలై 2 న ప్రారంభించబడింది. అప్పటి నుండి iOS యూజర్లు ఈ గేమ్‌ను తమ యొక్క ఫోన్ లలో పొందడానికి దేశంలో వేచి ఉన్నారు. మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో మీరు గేమ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు దానిని ఎలా ఇన్స్టాల్ చేయాలి వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్, ఐప్యాడ్‌లో BGMI ని డౌన్‌లోడ్ చేసే విధానం
** ఆపిల్ ఇండియా యాప్ స్టోర్‌కు వెళ్లి బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ కోసం శోధించండి.
** KRAFTON Inc గా జాబితా చేయబడిన డెవలపర్ గేమ్ కోసం చూడండి.
** ఈ గేమ్ కనిపిస్తే కనుక దాని యొక్క లిస్టింగ్‌పై నొక్కండి.
** ఇప్పుడు డెడికేటెడ్ యాప్ పేజీ లోపల గల డౌన్‌లోడ్ బటన్‌పై నొక్కండి.
** ఫేస్ ఐడి, టచ్ ఐడి లేదా మీ ఆపిల్ ఐడి పాస్‌వర్డ్ ద్వారా మీ గుర్తింపును నిర్ధారించండి.
** ఇప్పుడు, గేమ్ డౌన్‌లోడ్ అయ్యే వరకు వేచి ఉండండి.
** గేమ్ పూర్తిగా డౌన్‌లోడ్ అయిన తర్వాత ఐకాన్‌పై నొక్కి దాన్ని ఓపెన్ చేయండి.
** గేమ్‌కు లాగిన్ అవ్వండి మరియు మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న గ్రాఫిక్స్ సెట్టింగ్‌ల ప్యాక్‌ని ఎంచుకోండి.
** డౌన్‌లోడ్ చేసిన తర్వాత గేమ్ ఆడటం ప్రారంభించండి.

గమనిక: ఈ గేమ్ ప్రారంభంలో అందరికీ కనిపించకపోవచ్చు. అందుకే మీరు కొంచెం వేచి ఉండి మళ్లీ ప్రయత్నించమని మేము సిఫార్సు చేస్తున్నాము. మేము ప్రయత్నించినప్పుడు ఒక ఐఫోన్‌లో ఇలాగే చూపబడింది.
క్రాఫ్టన్ ఆటగాళ్లకు కార్డులు, స్కిన్స్ మరియు మరెన్నో గేమ్‌లోని ప్రత్యేక లాంచ్ అవార్డులను అందిస్తోంది. ఇది కాకుండా కంపెనీ ఇటీవల Android లో 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను కూడా పాస్ చేసింది. అంతేకాకుండా గెలాక్సీ మెసెంజర్ సెట్ స్కిన్ వంటి ప్రత్యేక రివార్డ్‌లను అందరు ప్లేయర్‌లకు అందిస్తోంది. iOS యూజర్లు కూడా ఈ రివార్డ్‌కు అర్హులు మరియు గేమ్ లోపలి నుండి సేకరించవచ్చు.


Click it and Unblock the Notifications








