ఈ ఎక్స్‌టెన్షన్స్‌తో బ్రౌజింగ్ అదరహో..!

డెస్క్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ ఇలా ఏ గ్యాడ్జెట్‌లోనైనా ప్రధానంగా ఉపయోగించే అప్లికేషన్ వెబ్‌ బ్రౌజర్.

|

డెస్క్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్ ఇలా ఏ గ్యాడ్జెట్‌లోనైనా ప్రధానంగా ఉపయోగించే అప్లికేషన్ వెబ్‌ బ్రౌజర్. ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. వేగవంతమైన వెబ్‌బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. ఈ బ్రౌజర్‌కు ఎక్స్‌టెన్షన్‌లుగా పుట్టుకొస్తోన్న పలు టూల్స్ వెబ్‌ బ్రౌజింగ్‌ను మరింత సుఖమయం చేస్తున్నాయి. ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను పొందేందుకు, బ్రౌజర్ పైభాగంలో కుడివైపున కనిపించే సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అందులో More Tools ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మోర్ టూల్స్ ఆప్షన్‌లో కనిపించే ఎక్స్‌టెన్షన్స్ ట్యాబ్‌ను క్లిక్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న అనేక ఎక్స్‌టెన్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరమైన ఎక్స్‌టెన్షన్‌ను సెలక్ట్ చేసుకుని Add to Chrome పై క్లిక్ చేసినట్లయితే, ఆ ఎక్స్‌టెన్షన్‌ మీ బ్రౌజర్‌కు యాడ్ అవుతుంది. గూగుల్ క్రోమ్ అలానే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న పలు ఉపయుక్తమైన ఎక్స్‌టెన్షన్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.

3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..

బిహైండ్ ద ఓవర్‌లే (Behind the Overlay)

బిహైండ్ ద ఓవర్‌లే (Behind the Overlay)

గూగుల్ క్రోమ్ అలానే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా బ్రౌజ్ చేసే వెబ్‌‌సైట్‌లలో ఏమైనా ఓవర్ లేస్ ఉన్నట్లయితే అవి వెంటనే బ్లాక్ చేయబడుతాయి.

 పేజ్‌వన్ (క్రోమ్/సఫారీ), రీ-పేజీనేషన్ (ఫైర్‌ఫాక్స్)

పేజ్‌వన్ (క్రోమ్/సఫారీ), రీ-పేజీనేషన్ (ఫైర్‌ఫాక్స్)

గూగుల్ క్రోమ్ అలానే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా మల్టిపుల్ పేజీలలో ఉన్న కంటెంట్‌ను ఒకే పేజీలో యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఇలా చేయటంలో బోలెడంత సమయంతో పాటు డేటా కూడా ఆదా అవుతుంది.

లజారుస్ (Lazarus)
 

లజారుస్ (Lazarus)

గూగుల్ క్రోమ్ ఇంకా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా డిలీట్ కాబడిన టెక్స్ట్‌ను రికవర్ చేసుకునే వీలుంటుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌కు డేటా‌బేస్ పై పూర్తి నియంత్రణ ఉంటుంది.

మ్యాజిక్ యాక్షన్స్ (క్రోమ్/ఫైర్‌ఫాక్స్/ఒపెరా)

మ్యాజిక్ యాక్షన్స్ (క్రోమ్/ఫైర్‌ఫాక్స్/ఒపెరా)

గూగుల్ క్రోమ్ ఇంకా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా ప్లే అయ్యే యూట్యూబ్ వీడియోస్‌లో యాడ్స్ అనేవి పూర్తిగా కనిపించవు. ఇదే కమయంలో కామెంట్స్ సెక్షన్ కూడా మాయమైపోతుంది.

వికీవాండ్ (క్రోమ్/ఫైర్‌ఫాక్స్/సఫారీ)

వికీవాండ్ (క్రోమ్/ఫైర్‌ఫాక్స్/సఫారీ)

ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా వికిపీడియాలోని పేజీలను మరింత సలువుగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. మొబైల్ డివైసెస్‌లోనూ ఈ ఎక్స్‌టెన్షన్ లభ్యమవుతోంది.

సైలెంట్ సైట్ సౌండ్ బ్లాకర్ (క్రోమ్)
గూగుల్ క్రోమ్ యూజర్లు ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా వెబ్‌సైట్‌లలో ప్లే అయ్యే యాడ్ వీడియోలను మ్యూట్‌లో ఉంచుకోవచ్చు. ఇదే సమయంలో నచ్చని వెబ్‌సైట్‌లను బ్లాక్‌లిస్ట్‌లో కూడా ఉంచుకోవచ్చు.

 

ఇమేగస్ (క్రోమ్/ఫైర్ ఫాక్స్) Imagus (Chrome/Firefox)

ఇమేగస్ (క్రోమ్/ఫైర్ ఫాక్స్) Imagus (Chrome/Firefox)

గూగుల్ క్రోమ్ అలానే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లు ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా చిన్నచిన్న తంబ్ నెయిల్స్‌ను పెద్దపెద్ద ఇమేజెస్‌ రూపంలో ఓపెన్ చేసుకోవచ్చు.
పాకెట్ (క్రోమ్/ఫైర్‌ఫాక్స్/సఫారీ/ఒపెరా/ఎడ్జ్)
ఈ ఎక్స్‌టెన్షన్‌ను పూర్తిస్థాయిలో ఆఫ్‌లైన్ రీడింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. గూగుల్ క్రోమ్ అలానే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లు ఈ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమకు కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని ఆన్లైన్‌లో స్టోర్ చేసుకుని ఆఫ్‌‌లైన్‌లో చదువుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Browser extensions can change the user interface of the web browser without directly affecting viewable content of a web pages..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X