రహస్య బ్రౌజింగ్ సురక్షితమేనా..?

సెక్యూర్డ్ బ్రౌజింగ్‌ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది.

రహస్య బ్రౌజింగ్ సురక్షితమేనా..?

Read More : మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాను Translatorలా మార్చటం ఎలా..?

ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు. Incognito mode గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అలా అనుకుంటే పొరబడినట్లే..

Incognito mode ద్వారా మీరు చేసే వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే. ఈ ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్ ద్వారా మీరు చేసే బ్రౌజింగ్ హిస్టరీ లోకల్ డ్రైవ్‌లో మాత్రమే సేవ్ కాదు. మీ ఇంటర్నెట్ సర్వీస్‌ను మానిటర్ చేసేవారి డ్రైవ్‌లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం సేవ్ అవుతుంది.

న్‌కాగ్నిటో అంటే దాచబడినా అని అర్థం

Incognito mode ద్వారా మీరు చేసే డౌన్‌లోడ్స్ అన్ని, మీ లోకల్ డ్రైవ్‌లోనే స్టోర్ అవుతాయి. ఇన్‌కాగ్నిటో అంటే దాచబడినా అని అర్థం. అలా అని పూర్తిగా దాచబడినట్లు కాదు. పలు కార్పొరేట్ కంపెనీలు పర్యవేక్షణ బృందం సహాయంతో ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ లో తమతమ ఉద్యోగుల విజిట్ చేసిన యూఆర్ఎల్స్ ను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి.

మీ సెషన్‌ను స్పై చేస్తున్నట్లే..?

Incognito mode ద్వారా మీరు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నట్లయితే ఖచ్చితంగా మీ సెషన్‌ను స్పై చేస్తున్నట్లే.

ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు..

ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.

క్రోమ్ బ్రౌజర్‌‍లో Incognito modeను ఓపెన్ చేయటం ఎలా..?

ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new window' ఆప్షన్ క్రింద కనిపించే ‘new incognito window' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. ctrl+Shift+N షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘new incognito window' ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌‍లో Incognito modeను ఓపెన్ చేయటం ఎలా..?

ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new tab' ఆప్షన్ క్రింద కనిపించే ‘ ‘new private window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారాను ‘న్యూ ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో Incognito modeను ఓపెన్ చేయటం ఎలా..?

సేఫ్టీ(Saftey) మెనూలోకి ప్రవేశించి.. ‘In Private Browsing' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘In Private Browsing' లోకి ప్రవేశించవచ్చు.

 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Browsing in Incognito Mode Really Private?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot