లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

Written By:

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీలు ఇలా అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే వినియోగిస్తోన్న చాలా మంది యూజర్లు ఓఎస్ పనితీరు పలు సమస్యలను వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంలో తలెత్తుతున్న ప్రధాన బగ్స్ అలానే వాటి పరిష్కార మార్గాలను ఇప్పుడు సూచించటం జరుగుతోంది...

Read More : 10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై సమస్యలు సాధారణంగా వినిపించేవే. కాబట్టి ఈ సమస్య మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌కు ప్రత్యేకం ఏమి కాదు. వాస్తవానికి మన స్మార్ట్‌ఫోన్ అవకాశాన్ని బట్టి వై-ఫై, మొబైల్ డేటా నెట్‌వర్క్‌లకు మారుతుంటుంది. మీ లాలీపాప్ ఫోన్ లో వై-ఫై నెట్ వర్క్ సమస్యలు వేధిస్తున్నట్లయితే డివైస్ ను ఓసారి ఫ్యాక్టరి రీసెట్ చేసి చూడండి. అయితే రీసెట్ చేసే ముందు డేటాను రీస్టోర్ చేసుకోండి. వై-ఫై నెట్‌వర్క్‌ను అందిస్తోన్న హోమ్ రూటర్‌తో పాటు ఫోన్‌ను రీబూట్ చేయటమనేది మరో ట్రబుల్ షూటింగ్ ఫిక్స్. వై-ఫై స్ర్కీన్ మెనూలోని ఛానల్ సెట్టింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవటం వల్ల కూడా సమస్యను అధిగమించవచ్చు.

 

లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

సాధారణంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌లను బ్యాటరీ సమస్య వేధిస్తుంటోంది. కాబట్టి ఈ సమస్య మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌ది మాత్రం కాదు కాదు. ఓ యాప్ కారణంగా మీ ఫోన్ బ్యాటరీ డ్రెయిన్ అవుతోందనుకుంటే ఆ యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసి చూడండి. సమస్య పరిష్కారమవ్వొచ్చు. ఫోన్‌లో పనికిరాకుండా ఉన్న యప్స్‌ను తొలగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ సమస్యను అధిగమించవచ్చు.

 

లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఫోన్ సాఫ్ట్‌వేర్‌తో పాటు డివైస్ లోని అన్ని అప్లికేషన్‌లను అప్‌టు‌డేట్‌గా అప్‌గ్రేడ్ చేయండి. సమస్య పరిష్కారమవ్వొచ్చు.

 

లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?


మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌‌లో కెమెరా యాప్ ఫెయిల్ అయినట్లయిమే ముందుగా మీరు చేయవల్సిన పని ఫోన్‌ను రీస్టార్ట్ చేయటం. అలానే మీ కెమెరా యాప్ లోని క్యాచీని క్లియర్ చేయటం ద్వారా కూడా సమస్య పరిష్కారమవుతుంది.

 

లాలీపాప్ ఓఎస్‌లో సమస్యలా..?

మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌‌లో ప్లికేషన్‌లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఫోన్‌ను సేఫ్ మోడ్‌లో బూట్ చేయటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bugs in Android 5.0 Lollipop and How to Fix Them.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot