మీకు నచ్చిన కలర్స్‌లో ఫేస్‌బుక్‌ని సెట్ చేసుకోవచ్చు, సింపుల్ ట్రిక్స్

Written By:

మీరు మీ ఫేస్‌బుక్‌ని రంగుని నిశితంగా గమనించినట్లయితే కేవలం బ్లూ కలర్ మాత్రమే ఉంటుంది. ఇది ఫేస్‌బుక్‌ కలర్ కోడ్ కావున దీనిని మార్చడానికి వీలు లేదు. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవాలనుకున్నా కాని అది కుదరదు..అయితే దీనికి ప్రత్యామ్నాయం లేదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే దీనికి ప్రత్యామ్నాయం ఉంది. మీరు ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవడం ద్వారా మీరు మీ ఫేస్‌బుక్‌ని రోజుకొక రంగులో మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు అలాగే డెస్క్‌టాప్‌లకు వర్తిస్తుంది.

చరిత్ర పుటల్లోకి టాటా టెలికం, 5000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

మీరు ముందుగా గూగుల్ క్రోమ్‌లో మీ ఐడీతో లాగిన్ కావాలి. ఆ తరువాత మీరు క్రోమ్ Extensionsలోకి వెళ్ళి facebook colour changer అనే ఫీచర్‌ని క్రోమ్‌కి యాడ్ చేసుకోవాలి.

టిప్ 2

అది యాడ్ అయిన తరువాత దాన్ని మీరు దాన్ని ఓపెన్ చేసే సమయంలో యాడ్స్ గురించి అలాగే కలర్స్ గురించి, టెక్ట్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి మీరు సమాధానం ఇస్తే చాలు మీ అకౌంట్ రంగుల్లోకి మారిపోతుంది.

టిప్ 3

మీరు ఫేస్‌బుక్ లాగిన్ అయిన తరువాత రైట్ సైడ్లో మీకు B,F అనే రెండక్షరాలు కనపడతాయి. అక్కడ మీరు టాప్ చేస్తే మీకు నచ్చిన రంగులు అలాగే ఫాంటు సైజుతో పాటు కొన్ని రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిని మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ టీమ్ సెట్ చేసుకున్న బ్యాక్ గ్రౌండ్ ..

మీరు చూస్తున్నది గిజ్‌బాట్ టీమ్ సెట్ చేసుకున్న బ్యాక్ గ్రౌండ్ అలాగే టెక్ట్స్.. మీరు ఇక్కడ రెండు రంగుల్లోకి కూడా తీసుకోవచ్చు. హెడ్ అండ్ బార్ ఒక కలర్‌లో అలాగే బ్యాక్ గ్రౌండ్ మరో కలర్‌లోకి మార్చుకోవచ్చు.

మొబైల్‌లో నచ్చిన కలర్స్

ముందుగా మీరు ఇంతకుముందు వాడుతున్న ఫేస్‌బుక్ యాప్‌ను మీ మొబైల్ నుంచి డిలీట్ చేయండి. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి Friendly for Facebookని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మొబైల్‌లో నచ్చిన కలర్స్

అది ఇన్‌స్టాల్ అయిన తరువాత మీరు లాగిన్ అయితే అక్కడ మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకుంటే మీ ఫేస్‌బుక్ వివిధ రంగుల్లోకి మారిపోతుంది. ఈ యాప్‌లో మీరు సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు.

మొబైల్‌లో నచ్చిన కలర్స్

ఇందులో మీకు బ్యాక్ గ్రౌండ్ అలాగే ఇతరుల ప్రొఫైల్ పేర్లు రంగుల్లో కనిపిస్తాయి. మీరు చూస్తున్నది గిజ్‌బాట్ టీమ్ సెట్ చేసుకున్నపేజీ..

కొంచెం జాగ్రత్త

మొబైల్ యూజర్లు ఈ యాప్‌లను వాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కావాలనుకుంటే సెట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫేస్‌బుక్‌ కలర్ ఛేంజ్ ఆప్సన్ ఇంకా ఇవ్వలేదు. వీటితో మీ అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోట్ : మీరు చేసే ఈ ప్రయోగానికి Gizbot Telugu ఎటువంటి భాద్యత వహించదు. 

English summary
Change the Text Color & Default Blue Facebook Theme for a More Swaggy Profile Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot