వాట్సాప్ ద్వారా PNR స్టేటస్ చెక్ చేసుకోవటం ఎలా..?

నిన్న మొన్నటి వరకు PNR లేదా లైవ్ ట్రెయిన్ స్టేటస్‌ వివరాలను తెలుసుకోవాంటే రైల్వే రిజర్వేషన్ ఎంక్వైరీ నెంబర్ (139)కి కాల్ చేయటం లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్‌డేట్‌లను తెలుసుకోవల్సి వచ్చేది

By GizBot Bureau
|

నిన్న మొన్నటి వరకు PNR లేదా లైవ్ ట్రెయిన్ స్టేటస్‌ వివరాలను తెలుసుకోవాంటే రైల్వే రిజర్వేషన్ ఎంక్వైరీ నెంబర్ (139)కి కాల్ చేయటం లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్‌డేట్‌లను తెలుసుకోవల్సి వచ్చేది. ఈ ప్రాసెస్ చాలా కష్టతరంగా ఉండటంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది.తాజగా ఈ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తూ ఇండియన్ రైల్వేస్, ఆన్‌లైన్ ట్రావెల్ వెబ్‌సైట్ అయిన మేక్‌మై‌ట్రిప్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రయాణికులకు సంబంధించి పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రెయిన్ స్టేటస్ వంటి అప్‌డేట్‌లను వారివారి వాట్సాప్ నెంబర్‌లకు మేక్‌మై‌ట్రిప్‌ పంపుతుంది. వాట్సాప్ ద్వారా PNR స్టేటస్ ను ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ వద్ద సిద్ధంగా ఉండాల్సినవి..?

మీ వద్ద సిద్ధంగా ఉండాల్సినవి..?

ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయి ఉండాలి. ఇదే సమయంలో ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. PNR లేదా లైవ్ ట్రెయిన్ స్టేటస్‌ వివరాలను తెలుసుకునేందుకు అవసరమైన ట్రెయిన్ నెంబర్ ఇంకా పీఎన్ఆర్ నెంబర్లు మీ వద్ద సిద్ధంగా ఉండాలి.

 

 

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ‘Dialer' యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత మేక్‌మై‌ట్రిప్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అయిన ‘7349389104'ను కాంటాక్ట్స్ లిస్టులో సేవ్ చేసుకోవాలి. నెంబర్‌ను సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లిస్టును రీఫ్రెష్ చేయాలి.

లిస్ట్ రీఫ్రెష్ అయిన తరువాత....

లిస్ట్ రీఫ్రెష్ అయిన తరువాత....

లిస్ట్ రీఫ్రెష్ అయిన తరువాత మేక్‌మై‌ట్రిప్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్‌ను ప్రత్యేకమైన చాట్ విండోలో ఓపెన్ చేసి మీ పీఎన్ఆన్ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి. మెసేజ్ సెండ్ అయిన వెంటనే రియల్ టైమ్‌లో మీ పీఎన్ఆర్ నెంబర్‌కు సంబంధించిన బుకింగ్ స్టేటస్‌ను మేక్‌మై‌ట్రిప్ మీకు సెండ్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
How to check PNR status using WhatsApp.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X