క్రోమ్ బ్రౌజర్‌లో వెబ్‌సైట్ లోడింగ్ స్పీడును చెక్ చేసుకోవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండే ప్రతి వెబ్‌సైట్‌కు పేజ్ లోడింగ్ అనేది చాలా కీలకం. పేజ్ లోడింగ్ నెమ్మదిగా ఉండటం వల్ల యూజర్లు దాదాపుగా ఆ సైట్‌‌ను క్లోజ్ చేసి మరొక సైట్‌కు వెళ్లిపోతారు. ఓ సర్వే ప్రకారం ఏదైనా వెబ్ పేజీ 3 సెకన్లలో లోడ్ అవ్వని పక్షంలో వెంటనే ఆ పేజీని క్లోజ్ చేసి వేరొక సైట్ వైపు నెటిజనులు మళ్లుతున్నట్లు వెల్లడైంది.

క్రోమ్ బ్రౌజర్‌లో వెబ్‌సైట్ లోడింగ్ స్పీడును చెక్ చేసుకోవటం ఎలా..?

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్‌లకు లోడింగ్ టైమ్ ఆధారంగానే ర్యాంకింగ్ అలానే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగానే రేటింగ్‌లను ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా వెబ్ పేజీకి సంబంధించిన లోడింగ్ స్పీడ్ అనేది బ్యాండ్‌విడ్త్ క్వాలిటీ అలానే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఏదైనా వెబ్‌సైట్‌కు సంబంధించిన లోడింగ్ స్పీడును తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.

స్టెప్ 1 :

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఏదైనా వెబ్‌సైట్‌కు సంబంధించిన లోడింగ్ స్పీడును టెస్ట్ చేసే ముందు మీ బ్రౌజర్‌లోని క్యాచీ అలానే హిస్టరీని క్లియర్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల లోడింగ్ స్పీడ్ మరింత ఖచ్చితత్వంతో తెలుస్తుంది. క్రోమ్ బౌజర్‌లో సెర్చ్ హిస్టరీని క్లీన్ చేసుకునేందుకు settings -> History -> click on clear browsing data.

స్టెప్ 2 :

బ్రౌజింగ్ సెట్టింగ్స్‌లోని హిస్టరీ విభాగంలోకి వెళ్లి క్లియర్ బ్రౌజింగ్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా, క్యాచిడ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్ పేర్లతో మూడు ఆప్షన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో బ్రౌజింగ్ హిస్టరీతో పాటు క్యాచిడ్ ఇమేజెస్ అండ్ ఫైల్స్ ఆప్షన్ల పై టిక్ మార్క్ చేసి Clear Data ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ బ్రౌజర్‌లోని క్యాచీ అలానే హిస్టరీ ఫైల్స్ పూర్తిగా క్లియర్ అయి పోతాయి.

స్టెప్ 3 :

మరొక ప్రొసీజర్‌లో భాగంగా బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోకుండానే వెబ్‌సైట్‌కు సంబంధించిన లోడింగ్ స్పీడ్‌ను తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ మొత్తం Incognito మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా జరుగుతుంది.

స్టెప్ 4 :

క్రోమ్ బ్రౌజర్‌లోని క్యాచీ అలానే హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసుకున్న తరువాత Ctrl+Shift+Cని ప్రెస్ చేయటం ద్వారా క్రోమ్ కన్సోల్ టూల్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో నెట్‌వర్క్ టూల్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5 :

నెట్‌వర్క్ టూల్‌లోని ఫిల్టర్ ఆప్షన్‌లో మీ డొమైన్ నేమ్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై హిట్ చేసినట్లయితే వెబ్ పేజీకి సంబంధించిన పూర్తి సమాచారం డిస్‌ప్లే కాబడుతుంది. అందులో వెబ్‌పేజీ లోడింగ్‌కు సంబంధించిన మొత్తం డేటాను మీరు తెలుసుకునే వీలుంటుంది.

జియో గుడ్ న్యూస్.. క్యాష్‌బ్యాక్ ఆఫర్ మరోసారి పొడగింపు!

English summary
When it comes to personal blogging, small-scale business or other online stuff, the factor called 'Page loading' is very important. If in case, you want to check the loading speed of the page in Google Chrome browser, do follow the steps below.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot