కాల్ డ్రాప్ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ చిట్కాలు ప్రయత్నం చేయండి..!
ముఖ్యమైన అంశంపై మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు కాల్ డ్రాప్ (కాల్ కట్) అవుతుంది. అయితే నెట్‌వర్క్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉన్న సమయంలోనూ ఈ సమస్య ఉంటుంది. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయి. మారుమూల మరియు రద్దీ ప్రాంతాల్లోనూ ఈ కాల్ డ్రాప్ లు (Call Drop) ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతోపాటు సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు మరియు అప్‌డేట్‌లు కూడా ఇందుకు కారణం గా ఉన్నాయి.
కాల్ డ్రాప్ కారణాలు :
బలహీనమైన సిగ్నల్ : సాధారణంగా కాల్ డ్రాప్ అయ్యేందుకు బలహీనమైన సిగ్నల్ మరియు స్థిరంగా లేని సిగ్నల్ కూడా కారణం. ఫోన్ సిగ్నల్ బార్‌ల సంఖ్య ఆధారంగా సిగ్నల్ స్థితిని గుర్తిస్తుంటారు. అయితే సిగ్నల్ స్థితిని తెలుసుకొనేందుకు ఇదే మార్గమని కచ్చితంగా తెలిపే ప్రమాణాలు లేవు.

సాఫ్ట్‌వేర్ సమస్యలు : కొన్ని సందర్భాల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు కూడా కాల్ డ్రాప్ లకు కారణమవుతుంది. గతంలో గూగుల్ పిక్సల్ సిరీస్ లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనంతరం ఫోన్ నెట్ వర్క్ కనెక్ట్ కావడంలో అనేక సమస్యలు తలెత్తాయి.
రద్దీగా ఉన్న నెట్‌వర్క్ : ఒక సిగ్నల్ టవర్‌కు పరిమితికి మించి యూజర్లు కనెక్ట్ కావడం కూడా కాల్ డ్రాప్‌లకు కారణం అవుతుంది. ఒకే టవర్ వద్ద కొన్నిసార్లు ఎక్కువ మంది ఒకేసారి కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించిన సందర్భాల్లో కాల్ డ్రాప్‌లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
అయితే కాల్ డ్రాప్‌లపై గతంలో టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కాల్ డ్రాప్‌లను తగ్గించేందుకు కచ్చితమైన మార్గాలు ఏవీ అందుబాటులో లేవు. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న సిగ్నల్ సామర్థ్యం మీ ప్రాంతంలో తక్కువగా ఉండే కాల్ డ్రాప్‌లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇతర నెట్‌వర్క్‌లకు మారేందుకు ప్రయత్నం చేయాలి. అయితే ఇతర నెట్‌వర్క్‌ల సిగ్నల్ స్థితి మరియు రీఛార్జి్ ప్లాన్‌ల వివరాలను పూర్తిగా తెలుసుకొనేందుకు ప్రయత్నం చేయాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లోని సమస్యలు కూడా కాల్ డ్రాప్ అయ్యేందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. కొన్నిసార్లు ఫోన్‌ను Restart చేయడం వల్ల కూడా ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీంతోపాటు వైఫై కాలింగ్ ఫీచర్ వల్ల కూడా కాల్ డ్రాప్ అయ్యేందుకు అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








