విండోస్ ఫోన్ 8లో తలెత్తే సాధారణ సమస్యలు పరిష్కారాలు

Posted By:

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ ఒకటి. ఫోన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తటం సహజం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్‌లో తలెత్తే సాధారణ సమస్యలు వాటి పరిష్కారాలను మీముందుంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

విండోస్ ఫోన్ 8లో తలెత్తే సాధారణ సమస్యలు పరిష్కారాలు

కాల్స్ మధ్యలో బ్లాక్ స్ర్కీన్ వచ్చేస్తోంది..?

చాలా మంది విండోస్ ఫోన్ 8 యూజర్లను ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా కాల్ మాట్లాడుతున్న సమయంలో స్ర్కీన్ బ్లాక్‌గా మారిపోతుంటుంది. ఇలాంటి సమయంలో కాల్‌ను ఎండ్ చేయాలంటే కష్టతరంగా ఉంటుంది.

ఈ జనవరిలో విడుదల కాబోతున్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

ఇలా ప్రయత్నించండి:

స్ర్కీన్ బ్లాక్‌గా మారిన సమయంలో ఫోన్ పవర్ బటన్‌ను రెండు సార్లు టాప్ చేసినట్లయితే ఫోన్ స్ర్కీన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు కాల్‌ను ఎండ్ చేయండి.  ఈ సమస్యకు ప్రధాన కారణం ఫోన్‌లోని ప్రాక్సిమిటీ సెన్సార్ అయి ఉండొచ్చు. కాబట్టి మీ ఫోన్ పై ఏర్పాటు చేసిన స్ర్కీన్ ప్రొటెక్టర్ సెన్సార్‌కు అడ్డుగా ఉందేమో ఒక్కసారి చూసుకోండి. అంతేకాకుండా సెన్సార్ పై దుమ్ములాంటిది ఏదైనా ఏర్పడినట్లయితే దాన్ని తొలగించండి.

విండోస్ ఫోన్ 8లో తలెత్తే సాధారణ సమస్యలు పరిష్కారాలు

కెమెరా పనిచేయటం లేదా..?

కొందరు తమ విండోస్ ఫోన్ 8 డివైస్‌లో కెమెరా పనిచేయటం లేదంటూ గగ్గోలు పెడుతుంటారు. ఈ సమస్య మీ విండోస్ పోన్ 8కు తలెత్తినట్లయితే కెమెరాకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్ టూ డేట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మరో ప్రయత్నంగా మీ  ఫోన్‌లోని ముఖ్యమైన ఫైళ్లను బ్యాకప్ చేసుకుని డివైస్‌ను రీసెట్ చేయండి. ఇప్పటికి కూడా సమస్య కొలిక్కి రానట్లయితే కంపెనీకి ఫిర్యాదు చేయండి.

విండోస్ ఫోన్ 8లో తలెత్తే సాధారణ సమస్యలు పరిష్కారాలు

డూప్లికేట్ సాంగ్స్

విండోస్ ఫోన్ 8 డివైస్‌లలో పలు సందర్భాల్లో ఒకే మ్యూజిక్ పైల్ అనేక మార్లు కనిపిస్తుంటుంది. ఫోల్డర్‌లో చూసినట్లయితే ఒక్క ట్రాక్‌గా మాత్రమే సేవ్ అయినట్ల కనిపిస్తుంది. ఈ సమస్య మీ విండోస్ ఫోన్‌లో కూడా ఉన్నట్లయితే ముందుగా మీ ఫోన్‌లోని మ్యూజిక్ కలెక్షన్ మొత్తాన్ని బ్యాకప్ చేసుకోండి. ఆ తరువాత ఫోన్ ఇంకా ఎస్డీ‌కార్డ్‌లోని మ్యూజిక్ ఫైళ్లను పూర్తిగా డిలీట్ చేయండి. ఆ తరువాత ఎస్డీ‌కార్డ్‌ను పీసీకి అనుసంధానం చేసి పూర్తిగా ఫార్మాట్ చేయండి.

వాల్యుమ్ మారటం లేదా..?

మీ విండోస్ ఫోన్‌లో వాల్యుమ్ మారకుండా విసిగిస్తున్నట్లయితే ఫోన్‌ను రీస్టార్ట్ చేసి చూడండి. పరిష్కారం దొరికే అవకాశముంది.

విండోస్ ఫోన్ 8లో తలెత్తే సాధారణ సమస్యలు పరిష్కారాలు

బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతోందా..?

మీ విండోస్ ఫోన్‌లో బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతున్నట్లయితే ఎన్‌ఎఫ్‌సీ, వై-ఫై, మొబైల్ డేటా తదితర కనెక్టువిటీ ఫీచర్లను అవసరం లేని సమయంలో టర్నాఫ్ చేయండి. తద్వారా బ్యాటరీని కొంత వేర ఆదా అవుతుంది. ఫోన్‌లో అవసరం లేని  యాప్‌లను తొలగించటం ద్వారా బ్యాటరీ అదుపులో ఉంటుంది.

English summary
common problems with Windows Phone 8, and how to fix them. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting