Home
How to

USSD మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఎలా చేస్తారు..?

బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్‌లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈ USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.

By Sivanjaneyulu Bommu

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో క్యాష్‌లెస్ ఎకానమీ వైపు భారత్ అడుగులు వేస్తోంది. మన దేశ ఆర్ధిక వ్యవస్థలో క్యాష్‌లెస్, కార్డ్‌లెస్ సేవలు సుదూర స్వప్నమేమి కానప్పటికి.. యావత్ దేశం ఈ ప్రక్రియను అందిపుచ్చుకునేందుకు కాస్తంత సమయం పడుతుంది.

USSD మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి..? ఎలా చేస్తారు..?

Read More : AP PURSE, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

కరెన్సీ కష్టాల నేపథ్యంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు డిజిటల్ వాలెట్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తూ, రోజువారి అవసరాలను తీర్చకుంటున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ UPI ఆధారిత యాప్స్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమవటంతో ఫీచర్ ఫోన్‌లను వినియోగించుకునే వారు క్యాష్‌లెస్ చెల్లింపుల వైపు త్వరితగతిన అడుగులు వేయలేకపోతున్నారు.

USSD మొబైల్ బ్యాంకింగ్

USSD మొబైల్ బ్యాంకింగ్

స్మార్ట్‌ఫోన్ అలానే ఇంటర్నెట్ అందుబాటులోలేని సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు USSD ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది. బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లేతో పనిచేసే బేసిక్ ఫోన్‌లు మొదలుకుని టాప్ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు ఈ USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులను సపోర్ట్ చేస్తాయి.

నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌

నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌

నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్‌డి ప్లాట్‌ఫామ్‌చే అభివృద్థిచేయబడిన ఈ ఇంటర్‌ఫేస్, మిమ్మల్ని మీ టెలికం ఆపరేటర్ ద్వారా మీ బ్యాంకర్‌కు కనెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలు 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునేందుకు

మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునేందుకు

మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునేందుకు, మీ ఫోన్ కీప్యాడ్‌లో ఎంటర్ చేయవల్సిన షార్ట్ కోడ్స్‌.. తెలుగు కోసం (*99*24#), తమిళం కోసం (*99*23#), హిందీ కోసం (*99*22#), మరాఠీ కోసం (*99*28#), బెంగాలీ కోసం (*99*29#), పంజాబీ కోసం (*99*30#), కన్నడ కోసం (*99*26#), గుజరాతీ కోసం (*99*27#), మళయాళం కోసం (*99*25#), ఒరియా కోసం (*99*32#), అస్సామీస్ కోసం (*99*31#)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం..

 USSD చెల్లింపు విధానం ద్వారా ఒక్కో transactionకు రూ.1 నుంచి రూ.5,000 వరకు నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి రూ.50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుంది.

 

 

USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ..

USSD మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ..

మీ మొబైల్ నెంబర్ సిద్ధమైనట్లయితే ముందుగా ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి *99#కు డయల్ చేయండి. ఆంగ్ల భాషలో ఓ వెల్‌కమ్ స్ర్కీన్ మీ ఫోన్ లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు తెలుగులో USSD మొబైల్
బ్యాంకింగ్ సేవలను పొందాలనుకుంటున్నట్లయితే *99*24#కు డయల్ చేయండి.

 వెల్‌కమ్ స్ర్కీన్‌లో..

వెల్‌కమ్ స్ర్కీన్‌లో..

ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్‌కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ నేమ్ కాని, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌కు సంబంధించి మొదటి నాలుగు అక్షరాలు గాని, రెండు డిజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్‌ను గాని ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

మీకు స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే SBI అనే టైప్ చేస్తే సరిపోతుంది. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ క్రింద SBIN అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ అలానే బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది.

 

మెనూలో అనేక ఆప్షన్స్..

మెనూలో అనేక ఆప్షన్స్..

ఈ మెనూలో అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవటం, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు 1 అంకెను, మినీ స్టేట్‌మెంట్‌ను పొందేందుకు 2 అంకెను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. నగదును పంపుకునేందుకు MMID కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

 

ఫోన్ నుంచే నగదు ట్రాన్స్‌ఫర్

ఫోన్ నుంచే నగదు ట్రాన్స్‌ఫర్

USSD మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా మీ అకౌంట్‌లోని డబ్బును వేరొకరి అకౌంట్‌లోకి ఫోన్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం..

ముందుగా మీ ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి

ముందుగా మీ ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి

 *99# టైప్ చేసి మీ బ్యాంక్‌కు సంబంధించి మొదటి మూడు అక్షరాలను ఎంటర్ చేయండి. మీకు స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉన్నట్లయితే SBI అనే టైప్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ HDFCలో ఉన్నట్లయితే HDF అనే టైప్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసిన వెంటనే మరో ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది. అందులో మూడు ఆప్షన్‌ (Send Money Using MMID)ను సెలక్ట్ చేసుకుని సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ అయి ఉండాలి..

మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ అయి ఉండాలి..

మీరు నగదు ట్రాన్స్‌ఫర్ చేయబోయే లబ్ధిదారునికి సంబంధించి మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. (ముఖ్య గమనిక : USSD మొబైల్ బ్యాంకింగ్ విధానంలో మీరు నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న అవతలి వ్యక్తి మొబైల్ నెంబర్ కూడా మొబైల్ బ్యాంకింగ్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. అంతే కాకుండా ఆ వ్యక్తి కూడా MMID నెంబర్‌ను కలిగి ఉండాలి)

 MMID నెంబర్‌ను ఎంటర్ చేసి..

MMID నెంబర్‌ను ఎంటర్ చేసి..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు ఓపెన్ అయ్యే మరొక ఇంటర్‌ఫేస్‌లో లబ్ధిదారునికి సంబంధించిన MMID నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

 నగదు విలువను ఎంటర్ చేయండి

నగదు విలువను ఎంటర్ చేయండి

ఇప్పుడు ఓపెన్ అయ్యే మరొక ఇంటర్‌ఫేస్‌లో, మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనకుంటున్న నగదు విలువను ఎంటర్ చేయండి. ఒక్కో లావాదేవీకి రూ.5000 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నగదు విలువను ఎంటర్ చేసిన తరువాత సెండ్ బటన్ పై క్లిక్ చేయండి.

 MPINతో పాటు చివరి నాలుగు అంకెలు..

MPINతో పాటు చివరి నాలుగు అంకెలు..

ఇప్పుడు ఓపెన్ అయ్యే మరొక ఇంటర్‌ఫేస్‌లో మీకు కేటాయించబడిన MPINతో పాటు మీ అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలను స్పేస్ ఇస్తు ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయడంతో మనీ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ విజయవంతంగా ముగుస్తుంది.

Best Mobiles in India

English summary
Complete Details about USSD Mobile Banking. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X