ఐఫోన్‌లో వీడియోలను కంప్రెస్ చేయడం ఎలా?

|

వీడియోలను రూపొందించడం కోసం ఐఫోన్‌లు ఉత్తమమైన కెమెరాలను కలిగి ఉంటాయి. సరికొత్త ఐఫోన్ 13 సిరీస్ లో కూడా ఓవర్‌హాల్డ్ కెమెరాస్ మరియు సినిమాటిక్ వీడియో రికార్డింగ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ లలో లభించే వీడియో నాణ్యత మరింత ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అలాగే సేవ్ చేయబడిన వీడియోలు మొబైల్ లో ఎక్కువ స్పేస్ ను ఆక్రమిస్తాయి. ఈ పెద్ద వీడియో ఫైల్‌లు ఇమెయిల్‌లకు జోడించబడవు ఎందుకంటే అవి అటాచ్‌మెంట్‌ల పరిమాణ పరిమితితో వస్తాయి. ఐఫోన్లలో వీడియోలను కంప్రెస్ చేయడానికి ఆపిల్ ఇంకా డిఫాల్ట్ పద్ధతిని ప్రవేశపెట్టలేదు.

 
ఐఫోన్‌లో వీడియోలను కంప్రెస్ చేయడం ఎలా?

4K లేదా 1080p వంటి అందుబాటులో ఉన్న ఇతర మోడ్‌ల కంటే తక్కువ నాణ్యతతో కంప్రెస్ చేయాల్సిన వీడియోలను రికార్డ్ చేయడం ఉత్తమ పద్ధతి. కానీ మీరు ఇప్పటికే వీడియోలను రికార్డ్ చేసి ఉంటే కనుక మరియు వాటిని చిన్నవిగా మార్చాల్సిన అవసరం ఉంటే సరైన టూల్స్‌ను ఉపయోగించడంతో దీనిని సులభంగా చేయవచ్చు. అది ఎలా చేయాలో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్‌లో వీడియోలను కంప్రెస్ చేసే విధానం

ఐఫోన్‌లో వీడియోలను కంప్రెస్ చేయడానికి ఎటువంటి డిఫాల్ట్ మార్గం లేదు. పెద్ద వీడియోలను కంప్రెస్ చేయడానికి వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. మేము పరీక్షించిన అటువంటి విశ్వసనీయ యాప్‌లను మాత్రమే మేము ప్రస్తావించనున్నాము. కానీ యాప్ స్టోర్‌లో అనేక వీడియో కంప్రెషన్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్‌లో వీడియోలను కంప్రెస్ చేయడం ఎలా?

ప్రత్యామ్నాయంగా స్టోరేజ్ ను ఆదా చేయడానికి మీరు తక్కువ నాణ్యతతో రికార్డ్ చేయవచ్చు. అలా చేయడానికి రికార్డ్ నాణ్యతను మార్చవలసి ఉంటుంది. ఇందుకోసం సెట్టింగ్స్> కెమెరా> వీడియో రికార్డ్ ఎంపికలను ఎన్నుకోవాలి. కానీ ఇప్పటికే ఉన్న వీడియో పరిమాణాన్ని మార్చడానికి వీడియో కంప్రెస్ యాప్‌ని ఉపయోగించి ఐఫోన్‌లో వీడియోను కంప్రెస్ చేయడానికి క్రింది సాధారణ దశలను అనుసరించండి.

1** యాప్ స్టోర్ నుండి వీడియో కంప్రెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.

2** ఇన్‌స్టాల్ చేసిన తర్వాత హోమ్‌పేజీలోని '+' గుర్తుపై నొక్కండి.

3** ఫోటోల యాప్‌ని యాక్సెస్ చేయడం వంటి సంబంధిత అనుమతులను యాప్ అడుగుతుంది. 'ok' ఎంపిక మీద నొక్కండి. వీడియో కంప్రెస్ మీ కెమెరా రోల్‌లో అందుబాటులో ఉన్న అన్ని వీడియోల జాబితాను మీకు చూపుతుంది.

4** మీరు కంప్రెస్ చేయాలనుకుంటున్న వీడియోపై క్లిక్ చేయండి. వినియోగదారులు ఒకేసారి కంప్రెస్ చేయడానికి అనేక వీడియోలను కూడా ఎంచుకోవచ్చు.

ఐఫోన్‌లో వీడియోలను కంప్రెస్ చేయడం ఎలా?

5** ఈ యాప్ ఇప్పుడు వీడియో కోసం వారు కోరుకునే కంప్రెషన్ స్థాయిలో యూజర్ ఎంపికలను చూపుతుంది. వీడియో కంప్రెస్ యాప్‌లో లభించే ప్రీసెట్‌లలో ఫుల్ HD నాణ్యత కూడా ఉంది. ఇది నిమిషానికి 28.6MB కి కంప్రెస్ చేస్తుంది మరియు కనిష్టంగా 360p ఉంది. ఆలాగే ఇది నిమిషానికి 3.6MB కి కంప్రెస్ చేస్తుంది. మీరు ఇష్టపడే ఎంపికను ఎంచుకోండి.

6** డెస్టినేషన్ ఆల్బమ్‌ను ఎంచుకోమని వీడియో కంప్రెస్ వినియోగదారుడిని అడుగుతుంది. ఆఫర్ చేసిన ఎంపికలు పని చేయకపోతే కనుక వినియోగదారులు దిగువన 'కొత్త ఆల్బమ్‌ను జోడించు' ఎంపికను ఎంచుకోవచ్చు.

 

7** గమ్యాన్ని ఎంచుకున్న తర్వాత వీడియో కంప్రెషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియకు దాదాపు 30 సెకన్లు పడుతుంది.

8** చివర్లో యాప్ వారు ఒరిజినల్ వీడియోను ఉంచాలనుకుంటున్నారా లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారా అని ఎంచుకోమని వినియోగదారులను అడుగుతుంది. కొత్త కంప్రెస్డ్ వీడియో డెస్టినేషన్ ఆల్బమ్‌లో మరియు కెమెరా రోల్‌లో కూడా కనిపిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Compress High Quality Videos on Your iPhone Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X