ట్విట్టర్ నుంచే ఫేస్‌బుక్ కనెక్ట్ అవ్వండి.. ఇలా

|
ట్విట్టర్ నుంచే ఫేస్‌బుక్ కనెక్ట్ అవ్వండి.. ఇలా

ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు మీరు వీరాభిమానా..?, రెగ్యులర్‌గా వీటితో టచ్‌లో ఉంటున్నారా..?, ఒకే కంటెంట్‌ను ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారా..?, అయితే, ఇప్పటి వరకు మీరు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లను వేరు వేరుగా ఓపెన్ చేసి కార్యకలాపాలు నిర్వహించి ఉంటారు. అలాకాకుండా, ట్విట్టర్ నుంచే నేరుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ముందుగా వెబ్ బ్రౌజర్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్విట్టర్.కామ్‌లోకి వెళ్లండి. మీ ఆకౌంట్‌లోకి లాగినై కుడివైపు కార్నర్‌లో ఉన్న ‘యూజర్ సింబల్'అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం ప్రొఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేసిన ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ‘పోస్ట్ యువర్ ట్వీట్స్ టూ ఫేస్‌బుక్'అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అనంతరం సైన్ ఇన్ టూ ఫేస్‌బుక్ బటన్ పై క్లిక్ చేసి లాగిన్ కండి. మీ సెక్యూరిటీ వివరాలను ట్విట్టర్ స్టోర్ చేసుకోదు కాబట్టి, భద్రంగా ఉంటాయి. లాగిన్ అయిన్ అనంతరం ‘కనెక్ట్ టూ ఫేస్‌బుక్'అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్ అప్లికేషన్‌కు కనెక్ట్ కండి, మీ అప్‌డేట్‌లను పోస్ట్‌చేసే విధంగా అప్లికేషన్‌కు అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది. పేజీ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన డ్రాప్ డౌన్ మెనూలో అప్‌డేట్‌లు పొందాల్సిన స్నేహితులను ఎంచుకోవచ్చు, ఇప్పుడు లాగిన్ విత్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ అయ్యే విండోలో‘Allow' ‘Skip' అనే రెండు ఆప్షన్ లు ప్రత్యక్షమవుతాయి. Allow బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫేస్‌బుక్‌లో మీ ట్విట్టర్ ఆకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ లభిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X