Home
How to

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన యూజర్లకు పలు ముఖ్యమైన సూచనలు..

By Sivanjaneyulu Bommu

ఆధునిక కమ్యూనికేషన్ అవసరాల రిత్యా కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఫీచర్ ఫోన్‌ల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌లు అంచెలంచెలుగా ఆక్రమించేసుకుంటున్నాయి. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్‌ఫోన్‌లను వెబ్ బ్రౌజర్‌లుగానూ, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లు గానూ నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన యూజర్లకు ముఖ్యమైన సూచనలు..

Read More : Oppo F3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది ధర రూ.19,999

హోమ్ స్ర్కీన్‌‍ను కస్టమైజ్ చేసుకోండి

హోమ్ స్ర్కీన్‌‍ను కస్టమైజ్ చేసుకోండి

అవసరమైన విడ్జెట్‌లు, నచ్చిన స్ర్కీన్ సేవర్లతో ఫోన్ హోమ్ స్ర్కీన్‌‍ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోండి.

కెమెరా ఫీచర్స్ గురించి అవగాహన చేసుకోండి

కెమెరా ఫీచర్స్ గురించి అవగాహన చేసుకోండి

ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక కెమెరా ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. కాబట్టి, మీ ఫోన్‌లోని కెమెరా ఆప్షన్‌ల గురించి పూర్తిగా ఓ అవగాహనకు రండి.

యాప్స్ గురించి తెలుసుకోండి..

యాప్స్ గురించి తెలుసుకోండి..

మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఏఏ అప్లికేషన్ ఎంతెంత డేటాను ఖర్చే చేస్తుందో మొత్తంగా ఫోన్ డేటా యూసేజ్ ఎంతవుతోందో తెలుసుకోండి.

బ్యాటరీ బ్యాకప్ పై అవగాహన పెంచుకోండి

బ్యాటరీ బ్యాకప్ పై అవగాహన పెంచుకోండి

బ్యాటరీ సేవర్లను సద్వినియోగం చేసుకోండి. ఇవి మీ బ్యాటరీ శక్తిని అవసరం మేరకు ఖర్చయ్యేలా చూస్తాయి.

 

గూగుల్ అకౌంట్స్ సెట్ చేసుకోండి..

గూగుల్ అకౌంట్స్ సెట్ చేసుకోండి..

మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఫోటోలను గూగుల్ + అకౌంట్‌లోకి ఉచితంగా బ్యాకప్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయవల్సిందాల్లా ఒక్కటే.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోబ్యాకప్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని తదుపరి సూచనలను అనుసరించండి. మీ ఫోటోలు ఆటోమెటిక్‌గా గూగుల్+ అకౌంట్‌లోకి బ్యాకప్ కాబడతాయి.

గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసుకోండి

గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసుకోండి

మీ ఫోన్‌లో ఏ స్ర్కీన్ నుంచైనా గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటున్నారా..?, అయితే ‘Ok Google' ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. Google App > Google Now > Settings > Voice > Ok Google Detection.

 

కావల్సిన యాప్స్‌ను పొందండి

కావల్సిన యాప్స్‌ను పొందండి

గూగుల్ ప్లే స్టోర్‌లో మీకు నచ్చిన యాప్స్ దొరకటం లేదా...? ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే, మీ కోసం అమెజాన్ యాప్ స్టోర్ సిద్థంగా ఉంది. అమెజాన్ యాప్ స్టోర్‌లో దొరికే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌తో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తాయి. ఈ యాప్ స్టోర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘యాప్ ఆఫ్ ద డే' సెక్షన్ కూల్ ఆఫర్స్‌తో మోత మోగిస్తోంది.

యాప్ సెట్టింగ్స్‌ను మార్చాలనుకుంటున్నట్లయితే..?

యాప్ సెట్టింగ్స్‌ను మార్చాలనుకుంటున్నట్లయితే..?

ఫోన్‌‍తో డీఫాల్ట్‌‍గా వచ్చిన యాప్ సెట్టింగ్స్‌ను మార్చాలనుకుంటున్నారా..? అయితే సెట్టింగ్స్‌లోని యాప్స్ విభాగంలోకి వెళ్లండి. మీరు మార్చాలనుకుటున్న యాప్‌ను సెలక్ట్ చేసుకుని సంబంధిత టాబ్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇప్పుడు యాప్‌కు సంబంధించి ఇన్ఫర్మేషన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో Clear Defaults పై క్లిక్ చేయండి.

 

జీపీఎస్ సర్వీసుల గురించి తెలుసుకోండి..

జీపీఎస్ సర్వీసుల గురించి తెలుసుకోండి..

మీ ఫోన్ జీపీఎస్ సర్వీసులు ఆన్ అయిఉన్నప్పటికి బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు. అది ఏలా సాధ్యం అనుకుంటున్నారా..? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ముందస్తుగా బిల్ట్ చేయబడిన ఓ సెట్టింగ్ జీపీఎస్ సర్వీసులను మూడు పద్ధతుల్లో యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాటిలో వివరాలు high accuracy, battery saving, device only. వీటిలో రెండవ మోడ్‌ను మీరు సెలక్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్ బ్యాటరీని మరింత ఆదా చేసుకోవ్చు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Location > Modeను ఎంపిక చేసుకోవటం ద్వారా బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు.

 

గూగుల్ సెర్చ్ కోసం షార్ట్ కట్స్..

గూగుల్ సెర్చ్ కోసం షార్ట్ కట్స్..

ఫోన్ హోమ్ బటన్‌ను పైకి స్వైప్ చేయటం లేదా హోమ్ బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వటం ద్వారా గూగుల్ సెర్చ్ లాంచ్ చేయాలనుకుంటున్నారా.? అయితే మీకోసం గూగుల్ ప్లే స్టోర్‌లో హోమ్ లాంచర్ యాప్ సిద్ధంగా ఉంది. ఈ యాప్‌కు మీ ఫోన్‌లోని అన్ని యాప్స్‌ను యాడ్ చేయటం ద్వారా కోరిన విధంగా షార్ట్‌కట్‌లను ఏర్పరుచుకోవచ్చు.

 

Language సెట్టింగ్స్‌ మార్చాలనుకుంటున్నట్లయితే..

Language సెట్టింగ్స్‌ మార్చాలనుకుంటున్నట్లయితే..

మెసేజ్ టైప్ చేస్తున్న సమయంలో అవసరంలేని పదాలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతూ ఇబ్బందికి గురిచేస్తున్నాయా..? అయితే, ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Language & inputలోకి వెళ్లి Auto-correctionను టర్నాఫ్ చేయండి.

Android Device Managerను ఎనేబుల్ చేసుకోవాలంటే..

Android Device Managerను ఎనేబుల్ చేసుకోవాలంటే..

రిమోట్ విధానం ద్వారా మీ ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయదలచినట్లయితే ముందుగానే మీ ఫోన్‌లో Android Device Manager feature ఎనేబుల్ చేసి ఉంచుకోండి. మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Manager. Now look for 'allow remote lock and erase and switch it on. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్ లేదా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ విధానంలో లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూడొచ్చు.

(గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు). ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్

చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది. లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు. Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే

మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్డీ కార్డ్‌లోని డేటా మాత్రం అలానే ఉంటుంది.

 

ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే లోకేషన్ తెలుస్తుంది

ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే లోకేషన్ తెలుస్తుంది

గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్  చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది. లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు. Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే
మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్డీ కార్డ్‌లోని డేటా మాత్రం అలానే ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Cool Tips And Tricks For New Android Smartphone User. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X