Home
How to

COVID వ్యాక్సిన్ ఉచితంగా పంపిణి!! 18+ సంవత్సరాల పైబడిన ఎవరైనా పొందవచ్చు

ఇండియాలో కరోనా యొక్క తీవ్రతను తగ్గించడం కోసం ప్రభుత్వం రెండు రకాల వాక్సిన్లను విడుదల చేసింది. 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు వాక్సిన్ ను వేసుకోవాలని కూడా సూచించాయి. 18+ సంవత్సరాల వారికి వాక్సిన్ ప్రక్రియ చాలా కాలం నుండి అందుబాటులో ఉన్నప్పటికీ వయస్సులో ఉన్నవారు ఇప్పటికీ వాక్సిన్ ను పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడం కోసం PM మోడీ ప్రభుత్వం ఒక పరిష్కారంను తీసుకువచ్చారు. ప్రస్తుతం వాక్సిన్లపై పూర్తి నియంత్రణను రాష్ట్రాల వద్ద నుండి కేంద్ర ప్రభుత్వానికి తీసుకుంటామని ప్రకటించారు.

కోవిడ్ వ్యాక్సిన్

ఈ నెల అంటే జూన్ 21 నుంచి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం కరోనా యొక్క వాక్సిన్లను ఉచితంగా వేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వయస్సులో (18-44 సంవత్సరాలు) గల ప్రజలు ఎక్కువగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం డబ్బులను చెల్లించాల్సి వస్తున్నది. కానీ జూన్ 21 నుండి ఈ విధానం మారాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

 

కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం జూన్ 21 నుంచి అందించే ఉచిత వాక్సిన్ ను పొందడం కోసం ఎప్పటిలాగే COVID స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి 18 - 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు కోవిన్ పోర్టల్‌కు వెళ్లవలసి ఉంటుంది. వాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడం చాలా సులభం. కానీ మీరు ఇప్పటికే మొదటి డోస్ పొంది ఉంటే కనుక రెండవ డోస్ ప్రస్తుతం పొందడం చాలా కష్టం. కోవిన్ పోర్టల్ ద్వారా COVID వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేయడం తెలియని వారు కింద ఉన్న సాధారణ దశలను అనుసరించండి.

కోవిన్ పోర్టల్ ద్వారా COVID వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకునే విధానం

కోవిన్ పోర్టల్ ద్వారా COVID వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకునే విధానం

- COVID వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభించడానికి మీరు మొదట కోవిన్ వెబ్‌సైట్ లేదా cowin.gov.in ను ఓపెన్ చేయవలసి ఉంటుంది.

- తరువాత స్క్రీన్ పైభాగంలో కనిపించే రిజిస్టర్ / సైన్ ఇన్ యువర్సెల్ఫ్ ఎంపికపై క్లిక్ చేయండి.

-తరువాత మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి గెట్ OTP ఎంపికను ఎంచుకోండి.

- తరువాత మీ మొబైల్ లో లభించిన OTP ని టైప్ చేసి 'ఎంటర్' ఎంపిక మీద క్లిక్ చేయండి.

- తరువాత మీరు రిజిస్ట్రేషన్ ఫర్ టీకా పేజీకి వెళ్ళవచ్చు. అందులో ఫోటో ఐడి ప్రూఫ్, పేరు, లింగం మరియు పుట్టిన సంవత్సరం వంటి మీ మొత్తం సమాచారాన్ని నమోదు చేసుకొని రిజిస్టర్ ఎంపికపై క్లిక్ చేయండి.

-తరువాత మీరు అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసే ఎంపికను పొందుతారు. నమోదు చేసుకున్న వ్యక్తి పేరు పక్కన ఉన్న షెడ్యూల్ ఎంపికపై క్లిక్ చేయండి.

-పిన్‌కోడ్‌ను నమోదు చేసి సెర్చ్ బటన్‌ను నొక్కండి. అది పూర్తయిన తర్వాత వెబ్‌సైట్ పిన్ కోడ్‌లోని టీకా కేంద్రాలను చూపుతుంది.

- తరువాత మీరు టీకా వేసుకునే తేదీ మరియు సమయాన్ని ఎంచుకుని స్క్రీన్ పై ప్రదర్శించబడే కన్ఫర్మ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఒక లాగిన్ ద్వారా నలుగురు సభ్యుల టీకా కోసం వెబ్‌సైట్ అనుమతిస్తుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
COVID Vaccine Free For 18+ Years From June 21: PM Modi Announced
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X