CovidVerified ద్వారా COVID-19 సంబంధిత ట్వీట్‌లను తనిఖీ చేయడం ఎలా?

|

కరోనా వైరస్ COVID-19 దేశంలో అధికంగా విస్తరిస్తున్న సమయంలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం. ప్రత్యేకించి జీవితం యొక్క మరణం విషయంలో ఇన్ఫర్మేషన్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న COVID-19 సంబంధిత సమాచారాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు యాక్సెస్ చేయడానికి అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో ట్విట్టర్ ఒకటి. ఇది ఆక్సిజన్ సరఫరా, ఔషధం, హాస్పిటల్ బెడ్స్ మొదలైన వాటి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. COVID-19 కు సంబందించిన మరియు ధృవీకరించబడిన సమాచారం కోసం తరచూ వెతుకుతూ ఉంటారు. అయితే అటువంటి వారి కోసం ఇక్కడ CovidVerified అమలులోకి వస్తుంది.

 

కోవిడ్ వెరిఫైడ్ అంటే ఏమిటి?

కోవిడ్ వెరిఫైడ్ అంటే ఏమిటి?

కోవిడ్ వెరిఫైడ్ అనేది క్రొత్త క్రౌడ్ సోర్స్డ్ టూల్. ఇది COVID-19 సంబంధిత ట్వీట్లను ధృవీకరించబడినట్లు లేదా గడువు ముగిసినట్లుగా సూచిస్తుంది. ఈ టూల్ ని ట్విట్టర్‌లో వివరించడానికి మరియు అందరికి షేర్ చేయడం కోసం శిఖర్ సక్సేనా ఈ కొత్త టూల్ ను ప్రారంభించారు. "చాలా మంది ధృవీకరించబడిన బటన్ కోసం ట్విట్టర్‌ను అడుగుతున్నారు - ఇది ఖాళీని పరిష్కరించడానికి మా ప్రయత్నం" అని సక్సేనా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

కోవిడ్ వెరిఫైడ్ ఎలా పనిచేస్తుంది?

ప్రతి ట్వీట్‌ను దాని ఖచ్చితత్వం మరియు టైమ్ వివరాలను గుర్తించడం ఒక పెద్ద పని. అయినప్పటికీ కోవిడ్ వెరిఫైడ్ టూల్ మొత్తం ఈ ప్రక్రియను సరళీకృతం చేసింది. కోవిడ్ వెరిఫైడ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మొదట కొన్ని నగరాలు మరియు COVID-19 కి సంబంధించిన కీలక పదాలతో ఇటీవలి ట్వీట్లను పొందటానికి ట్విట్టర్ యొక్క కొత్త టూల్ API ని ఉపయోగిస్తుంది.

వెబ్‌సైట్
 

తరువాత వెబ్‌సైట్ నుండి నేరుగా ధృవీకరించబడిన లేదా గడువు ముగిసిన ఏదైనా ట్వీట్‌లను గుర్తించవచ్చు. ఈ ప్రక్రియతో గత 24 గంటలలో ధృవీకరించబడిన అన్ని ట్వీట్లు కూడా పైభాగంలో కనిపిస్తాయి. అలాగే గడువు ముగిసిన వాటి కోసం సమయాన్ని వృథా చేయకుండా సంబంధిత మరియు ధృవీకరించబడిన సమాచారం యొక్క ట్వీట్‌లను తెలుసుకోవడానికి ఇది ప్రజలకు సహాయపడుతుంది. ప్రత్యేకించి ప్రస్తుతం మన జీవితం సంకటంలో ఉన్నప్పుడు అధికంగా ఉపయోగపడుతుంది.

కోవిడ్ వెరిఫైడ్‌ను ఉపయోగించే విధానం

కోవిడ్ వెరిఫైడ్‌ను ఉపయోగించే విధానం

కోవిడ్ గురించి సమాచారం తెలుసుకోవడం కోసం ట్విట్టర్ సహాయం కోరిన వెంటనే అనేక ట్వీట్లతో మీకు సహాయం అందిస్తుంది. ఏదేమైనా మీ నగరంలో సహాయపడేదాన్ని కనుగొనడానికి ట్వీట్ల ద్వారా క్రమబద్ధీకరించడానికి ఇది చాలా ఎక్కువగా సహాయపడుతుంది. కోవిడ్ వెరిఫైడ్ ను ఈ కింది సాధారణ దశలతో యాక్సెస్ చేయవచ్చు.


స్టెప్1: covidverified.in ని ఓపెన్ చేయండి. మీ నగరం మరియు ఆక్సిజన్, బెడ్ లేదా ప్లాస్మా వంటి వనరులను ఎంచుకోండి.

స్టెప్ 2: సెర్చ్ ఎంపికను ఎంచుకోండి. చార్ట్ యొక్క పైన సందర్భోచితమైన మరియు ధృవీకరించబడిన ట్వీట్ల జాబితా కనిపిస్తుంది.


ఇంకా కోవిడ్ వెరిఫైడ్ ధృవీకరించబడిన మరియు గడువు ముగింపు తేదీలను హైలైట్ చేస్తుంది. వినియోగదారులకు దాని ఖచ్చితత్వం గురించి సమాచారం ఇస్తుంది. అదనంగా ఎవరైనా దీన్ని ధృవీకరించిన లేదా గడువు ముగిసినట్లుగా కూడా గుర్తించవచ్చు. ఇది ధృవీకరించబడిన సమాచారం యొక్క థ్రెడ్‌ను కొనసాగించడంలో సహాయపడుతుంది.

 

Best Mobiles in India

English summary
CovidVerified Helps Identify Verified, Expired Tweets Related To COVID-19: Here’s How

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X