కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల పిల్లల కోసం నమోదు చేసుకోవడం ఎలా?

|

భారత ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ కవరేజీని మళ్లీ విస్తరించాలని చూస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ను మార్చి 16 అంటే నేటి నుండి దేశంలో 12 నుండి 14 సంవత్సరాల పిల్లల కోసం ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటనను విడుదల చేసారు. శాస్త్రీయ సంస్థలతో సరైన సంప్రదింపుల తర్వాత మార్చి 16, 20222 నుండి 12 నుండి 13 సంవత్సరాల మరియు 13 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సూచిస్తూ వారికి అందుబాటులో వ్యాక్సిన్‌ను ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మీ యొక్క పిల్లలను కరోనా నుంచి సురక్షితంగా ఉంచడం కోసం వ్యాక్సిన్‌ను తీసుకోవాలని చూస్తున్నవారు దానిని ఎలా బుక్ చేసుకోవాలి వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

కార్బెవాక్స్

కోవిడ్-19 వ్యాక్సిన్ కార్బెవాక్స్ ను హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఎవాన్స్ తయారు చేసింది. నేటి నుండి 12-14 సంవత్సరాల పిల్లలకు అందుబాటులోకి రానున్న కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 12-14 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులకు 28 రోజుల వ్యవధిలో రెండు-డోస్ల వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఇ ఇంట్రామస్కులర్ వ్యాక్సిన్ కార్బావాక్స్ ను అందిస్తుంది అని కొన్ని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

CoWIN పోర్టల్‌

మార్గదర్శకాల ప్రకారం 2010 లేదా అంతకు ముందు (2008, 2009 మరియు 2010)లో జన్మించిన వారు ఇప్పటికే 12 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న లబ్ధిదారులందరూ CoWIN పోర్టల్‌లో నమోదు చేసుకోగలరు. అదేవిధంగా టీకా కోసం CoWIN పోర్టల్‌లో 12-14 సంవత్సరాల పిల్లలను ఎలా నమోదు చేసుకోవాలో మరింత తెలుసుకుందాం.

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల పిల్లల కోసం నమోదు చేసుకొనే విధానం
 

కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల పిల్లల కోసం నమోదు చేసుకొనే విధానం

* ముందుగా www.cowin.gov.in లింక్‌ని ఉపయోగించి Co-WIN పోర్టల్‌ను ఓపెన్ చేయండి.

* కోవిడ్-19 టీకా కోసం మీ యొక్క పిల్లలను నమోదు చేయడానికి "రిజిస్టర్ / సైన్ ఇన్" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

* మీ యొక్క ఫోన్ నంబర్ కు అందుకున్న OTP ను ఉపయోగించి లాగిన్ చేయండి

* మీరు టీకా కోసం మొదట నమోదు చేసుకున్న అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తుంటే కనుక కుడివైపు ఎగువ మూలలో ఉన్న సభ్యులను జోడించు బటన్‌ను క్లిక్ చేయండి. మీరు కొత్త ఫోన్ నంబర్‌ని ఉపయోగిస్తుంటే కనుక యాడ్ మెంబర్ బటన్‌పై నొక్కండి.

* పిల్లల విషయంలో మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలైన కొన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయమని అడుగుతారు. రికార్డులు లేనప్పుడు పిల్లలను నమోదు చేసుకోవడానికి పాఠశాల ID కార్డులను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.

 

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ఎలా?ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ఎలా?

సీనియర్ సిటిజన్లు కోవిడ్-19 వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోనే విధానం

సీనియర్ సిటిజన్లు కోవిడ్-19 వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకోనే విధానం

* వృద్ధులు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వారి అర్హతతో కో-విన్ సిస్టమ్‌లో నమోదు చేయబడిన రెండవ డోస్ అడ్మినిస్ట్రేషన్ తేదీపై ఆధారపడి ఉంటుంది.

* వృద్ధాప్య ధృవీకరణ ఆధార్ ఉపయోగించి ఈ ప్రక్రియ మొదలవుతుంది.

* వృద్ధులు వారి యొక్క పెన్షన్ పత్రాలు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్ కార్డ్‌, NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్‌లు లేదా ఫోటోగ్రాఫ్‌లను కూడా ఉపయోగించవచ్చు.

* OTP మీ నంబర్‌కు పంపబడుతుంది. మీరు తనిఖీ చేయాలి.

* సమీక్ష ముగిసిన తర్వాత లొకేషన్, జిప్‌కోడ్ మొదలైనవాటిని నమోదు చేయడం ద్వారా మీ స్లాట్‌ను బుక్ చేసుకోవడం ప్రారంభించి, ఆపై బుక్ అపాయింట్‌మెంట్‌పై నొక్కండి/క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
CoWIN Registration Step by Step Process; How to Register Online for Covid Jabs of aged 12-14

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X