Home
How to

ChatGPTతో అచ్చం మీలాగే ఉండే యాక్షన్ ఫిగర్‌ను యాడ్ చేసుకోవాలా.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

AI Action Figure with ChatGPT : తమ యాక్షన్ ఫిగర్ (Action Figure) బొమ్మను తయారు చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ పెద్ద పెద్ద బొమ్మల కంపెనీలకు మాత్రమే ఆ పని చేయడం సాధ్యమవుతుందని ఊరుకుంటాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ లోని సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌తో, కేవలం నిమిషాల్లో అచ్చం మీలాగే కనిపించే యాక్షన్ ఫిగర్‌ను మీరే డిజైన్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది, ముఖ్యంగా ఈ మధ్య వైరల్ అయిన 'జిబ్లీ-స్టైల్' (Ghibli-style) ఫోటోల తర్వాత. ఇప్పుడు, చాలామంది మరో అడుగు ముందుకేసి, తమకు నచ్చిన యాక్సెసరీలు, ప్యాకేజింగ్‌తో అచ్చం ఖరీదైన కలెక్టబుల్ బొమ్మల్లా కనిపించేలా తమ యాక్షన్ ఫిగర్లను సృష్టించుకుంటున్నారు.

Create Your Realistic AI Action Figure with ChatGPT

* ఎలా సృష్టించుకోవాలి..
ఈ ట్రెండ్‌లో మీరూ భాగమై, మీ సొంత కస్టమ్ యాక్షన్ ఫిగర్‌ను ChatGPT ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి. మీ యాక్షన్ ఫిగర్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని కావలసి వస్తుంది. మీ యాక్షన్ ఫిగర్‌ను సృష్టించుకోవడానికి, మీకు చాట్‌జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్ యాక్సెస్ ఉండాలి.

ఈ ఫీచర్ ముఖ్యంగా GPT-4o మోడల్‌తో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాట్‌జీపీటీ ప్లస్ సభ్యులకు అందుబాటులో ఉంది. ఉచితంగా వాడేవాళ్లు కూడా ప్రయత్నించవచ్చు, కానీ వారికి రోజుకు మూడు సార్లు మాత్రమే ఫొటోలను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. మీరు లాగిన్ అయి, GPT-4o వాడుతున్నట్లయితే, ఇక మొదలుపెట్టవచ్చు.

* యాక్షన్ ఫిగర్‌ను క్రియేట్ చేసుకునే విధానం (Step-by-Step)
ముందుగా, స్పష్టంగా ఉన్న మీ ఫొటోను అప్‌లోడ్ చేయండి. మీ ముఖం స్పష్టంగా కనిపించాలి. ఫొటో మంచి వెలుతురులో ఉండాలి. ఈ ఫొటో, మీ యాక్షన్ ఫిగర్‌లో మీ ముఖ కవళికలు సరిగ్గా వచ్చేలా చాట్‌జీపీటీకి సహాయపడుతుంది. తరువాత, వివరంగా ఒక ప్రాంప్ట్ (prompt - అంటే మీరు AIకి ఇచ్చే ఆదేశం) ఎంటర్ చేయండి.

* ఉదాహరణకు ఇలా ఇవ్వొచ్చు
"నేను అప్‌లోడ్ చేసిన ఫోటో ఆధారంగా, నాలాంటి ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిగర్‌ను బ్లిస్టర్ ప్యాక్‌లో (అట్టపెట్టె లాంటి ప్యాకింగ్‌లో) సృష్టించు. ఇది అచ్చం ఖరీదైన కలెక్టబుల్ బొమ్మ లాగా కనిపించాలి. బొమ్మ నిటారుగా నిలబడినట్లు ఉండాలి. బ్లిస్టర్ ప్యాక్ హెడర్ (పై భాగం) నీలం రంగులో ఉండాలి.

దానిపై [మీ పేరు] అనేది పెద్ద తెల్ల అక్షరాలతో, దాని కింద [మీ హోదా లేదా పాత్ర] చిన్న తెల్ల అక్షరాలతో ఉండాలి. బొమ్మకు కుడి వైపున ప్రత్యేక అరల్లో (కంపార్ట్‌మెంట్లలో) యాక్సెసరీలు చేర్చు: ఒక ఫోన్, కెమెరా, స్నీకర్ (షూ), దానిపై లోగో ఉన్న ల్యాప్‌టాప్. బ్లిస్టర్ ప్యాక్ బ్యాక్‌గ్రౌండ్ నల్లగా ఉండాలి.

యాక్షన్ ఫిగర్ నా ముఖ కవళికలను, రూపాన్ని (నేను అప్‌లోడ్ చేసిన ఫొటోలోని విధంగా) పోలి ఉండేలా చూసుకోండి, ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఈ చిత్రాన్ని హై-డీటెయిల్‌తో, నిజమైన ఫోటోలా కనిపించేలా (ఫోటోరియలిస్టిక్ క్వాలిటీతో) రూపొందించండి." మీకు అర్థం అవ్వడానికి దీన్ని తెలుగులో రాశాం కానీ ఇంగ్లీష్‌లోనే మీరు ఇలా రాయాలి.

* ఇంకా క్రియేటివ్‌గా ఎలా మార్చుకోవచ్చు?
మీ యాక్షన్ ఫిగర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటున్నారా? మరిన్ని వివరాలు జోడించండి. మీ వృత్తి, మీకు ఇష్టమైన డ్రెస్, మీరు కోరుకుంటున్న పోజ్, లేదా బొమ్మ ప్యాకేజింగ్ రంగు వంటివి చెప్పండి. మీ ముఖంలో ఎలాంటి హావభావాలు ఉండాలో (నవ్వుతూ, సీరియస్‌గా?) చెప్పాలి.

మీ హెయిర్‌స్టైల్, మీకు కావాల్సిన యాక్సెసరీలు (ఉదా: పుస్తకం, కాఫీ కప్పు, హెడ్‌ఫోన్స్) స్పష్టంగా వివరించండి. మీరు ఎంత వివరంగా చెబితే, ఫలితం అంత అద్భుతంగా వస్తుంది. ఒకవేళ మంచిగా రాకపోతే ఎక్కడ మంచిగా రాలేదు చూసుకుని మరొకసారి ప్రాంప్ట్ మంచిగా రాసి మళ్లీ ఇవ్వచ్చు.

* బెస్ట్ రిజల్ట్ కోసం కొన్ని చిట్కాలు
ఏది పడితే అది కాకుండా సూటిగా చెప్పండి. కేవలం "బొమ్మ" అనకుండా, అది ఎలా ఉండాలో వివరించండి. "మాట్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్" (మెరుపు లేని నలుపు) లేదా "నియాన్ బ్లూ హెడర్" (మెరిసే నీలం రంగు హెడర్) ఇలా స్పష్టంగా చెప్పండి. యాక్షన్ ఫిగర్ ఏదైనా వస్తువు పట్టుకున్నట్లు కావాలా? అది చెప్పండి.

నవ్వుతున్నట్లు కావాలా, గంభీరంగా లేదా పవర్‌ఫుల్‌గా కనిపించాలా? అడగండి. నిజమైన ఫొటోలా (ఫొటోరియలిస్టిక్) కనిపించాలని అడగండి, అప్పుడే అది నిజమైన ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది. మీకు ఫోటో నిలువుగా (పోర్ట్రెయిట్) కావాలా లేక అడ్డంగా (వైడ్‌స్క్రీన్) కావాలా అనేది కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు, "పోర్ట్రెయిట్ ఫార్మాట్‌లో ఇవ్వు" అని అడగండి.

* ఒకేసారి ఎక్కువ వివరాలు వద్దు
వివరాలు ముఖ్యమే కానీ, ఒకే ప్రాంప్ట్‌లో మరీ ఎక్కువ అంశాలను చేర్చకండి. చాలా ఎక్కువ సూచనలు ఇస్తే AI కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి. మీ లుక్, పోజ్, ఎక్స్‌ప్రెషన్, యాక్సెసరీలు, ప్యాకేజింగ్ ఎలా ఉండాలి అనేవి ప్రధానంగా చెప్పండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Create Your Realistic AI Action Figure with ChatGPT, Custom Design Guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X