మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి, లేదంటే డేటా, డబ్బులు పోవడం ఖాయం!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను కేంద్ర హోంశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ఫోన్లలోని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్‌లను వెంటనే తొలగించడమే కాకుండా, డేటా బ్యాకప్ తీసుకోవాలని సూచించింది. ఆగస్టు 26న జారీ చేసిన ఈ హెచ్చరికను సెప్టెంబర్ 1న మళ్లీ పునరుద్ఘాటించింది. ఇందులో Night Play, Reloop, Kyss, Vimo, Rivo, Nexo, Vixa వంటి యాప్‌ల పేర్లను స్పష్టంగా పేర్కొంది. సోషల్ మీడియా ప్రకటనలు, బయటి నుంచి డౌన్‌లోడ్ చేసుకునే APK ఫైళ్ల ద్వారా ఇవి భారతీయ యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు వాట్సాప్, ఫోటోలను ఎలా కాపాడుకోవాలో కింద చూడండి.
ఈ యాప్‌లు ఫోన్‌లోని ‘యాక్సెసిబిలిటీ’ (Accessibility) అనుమతులను దుర్వినియోగం చేస్తూ ఫోన్‌ను తమ అదుపులోకి తీసుకుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే యాడ్స్ ద్వారా యూజర్లను ఇతర లింక్‌లకు తీసుకెళ్లి ఈ APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని యాప్‌లు నకిలీ VPNలను ఇన్‌స్టాల్ చేసి ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మళ్లిస్తుండగా, మరికొన్ని ఫోన్ నుంచి డిలీట్ కాకుండా అప్‌డేట్ల పేరుతో మరింత హానికరమైన వైరస్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నాయి. సమయానికి స్పందించకపోతే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వడంతో పాటు ఫోన్ లాక్ అయ్యే ప్రమాదముంది.

తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేయాల్సిన యాప్‌లు.. ఫోన్ క్లీనప్ ప్రాసెస్ ఇదే
| యాప్ పేరు | చేయాల్సిన పని |
|---|---|
| Night Play | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
| Reloop | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
| Kyss | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
| Vimo | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
| Rivo | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
| Nexo | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
| Vixa | వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసి, యాడ్‌ను రిపోర్ట్ చేయండి |
యాప్‌ను తొలగించడానికి దాన్ని లాంగ్ ప్రెస్ చేసి, 'యాప్ ఇన్ఫో' (App info)కి వెళ్లి 'అన్‌ఇన్‌స్టాల్' (Uninstall) చేయండి. ఆ తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. ప్రోఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి 'ప్లే ప్రొటెక్ట్' (Play Protect) ద్వారా 'స్కాన్' (Scan) చేయండి. అపరిచిత యాప్‌ల ఇన్‌స్టాల్‌ను ఆపడానికి Settings > Security > Install unknown apps లో 'Deny' (నిరాకరించు) ఎంచుకోండి. అలాగే ప్రమాదకర అనుమతులను రద్దు చేయడానికి Settings > Privacy > Permission manager కి వెళ్లి అనుమానాస్పద యాక్సెస్‌లను తొలగించండి (Revoke access).
ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకోవడం.. వాట్సాప్ చాట్లు, ఫోటోల రికవరీ ఎలా?
ముందుగా వాట్సాప్ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ చేయండి: Settings > Chats > Chat backup > Back up నొక్కండి. వీలైతే WhatsApp/Databases ఫోల్డర్‌లోని local.crypt14 ఫైల్‌ను కూడా క్లౌడ్ లేదా కంప్యూటర్‌లోకి కాపీ చేయండి. ఇక ఫోటోల కోసం.. Google Photos ఓపెన్ చేసి, ప్రొఫైల్ పిక్చర్‌పై టాప్ చేసి 'Backup now' (ఇప్పుడు బ్యాకప్) ఎంచుకోండి. కాంటాక్ట్‌ల కోసం Contacts యాప్‌లో Fix and manage > Export to.vcf ఎంచుకుని సేవ్ చేసుకోండి. ఈ బ్యాకప్‌లన్నీ పూర్తయ్యాక మాత్రమే ఫోన్‌ను 'ఫ్యాక్టరీ రీసెట్' చేయండి.
రీసెట్ తర్వాత డేటా పునరుద్ధరణ, బ్యాంకింగ్/UPI భద్రతా సూత్రాలు
ఫోన్ రీసెట్ లేదా క్లీనింగ్ పూర్తయ్యాక, గూగుల్ డ్రైవ్ లేదా మీ దగ్గరున్న.crypt14 ఫైల్ ద్వారా వాట్సాప్‌ను రీస్టోర్ చేసుకోండి. ఆ తర్వాత వెంటనే మీ గూగుల్ పాస్‌వర్డ్, వాట్సాప్ పిన్ (PIN), ఫోన్ స్క్రీన్ లాక్‌ను మార్చేయండి. బ్యాంకింగ్ సురక్షితంగా ఉండాలంటే, వైరస్ బారిన పడిన ఫోన్‌లో ఉన్న UPI సేవల డిజిస్ట్రేషన్ (Deregister) పూర్తి చేసి, UPI PINలను మార్చండి. ఒకవేళ మీ ఖాతా నుంచి డబ్బులు పోయినట్లు గమనిస్తే.. ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
డేటా లీక్‌లు కాకుండా చూసుకోవడానికి చిట్కాలు
ఫోన్ బ్యాటరీ హఠాత్తుగా అయిపోవడం, డిస్‌ప్లేపై ఏవైనా కొత్త స్క్రీన్‌లు పాప్ అప్ అవ్వడం, లేదా యాక్సెసిబిలిటీ పర్మిషన్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవ్వడం లాంటివి గమనిస్తూ ఉండండి. యాప్‌లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి. 'Play Protect' ఎప్పుడూ ఆన్‌లో ఉంచి, ఆటో-అప్‌డేట్‌ను ఎనేబుల్ చేయండి. ప్రతినెలా యాప్ పర్మిషన్లను సమీక్షించండి.. ముఖ్యంగా Accessibility, Notifications, SMS పర్మిషన్లను గమనించాలి. ప్రకటనలు లేదా తెలియని లింక్‌ల ద్వారా వచ్చే APK ఫైళ్లను పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ చాట్లు, ఫోటోలు, కష్టపడి దాచుకున్న సొమ్ము భద్రంగా ఉంటాయి.


Click it and Unblock the Notifications