Paytm అకౌంట్ నుంచి ఆధార్ వివరాలను తొలగించటం ఎలా?

ఆధార్ దృవీకరణ అన్ని చోట్లా తప్పనిసరికాదంటూ సుప్రిమ్ ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఇక మీదట తీసుకునే కొత్త మొబైల్ కనెక్షన్స్, కొత్త బ్యాంక్ అకౌంట్స్

|

ఆధార్ దృవీకరణ అన్ని చోట్లా తప్పనిసరికాదంటూ సుప్రిమ్ ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో, ఇక మీదట తీసుకునే కొత్త మొబైల్ కనెక్షన్స్, కొత్త బ్యాంక్ అకౌంట్స్, ఇంకా కొత్త డిజిటల్ వాలెట్ అకౌంట్లను ఓపెన్ చేసే క్రమంలో ఆధార్ కార్డును లింక్ చేయవల్సిన అవసరం ఉండదు.

పేటీఎమ్ అకౌంట్ల నుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు..

పేటీఎమ్ అకౌంట్ల నుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు..

ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది యూజర్లు తమ పేటీఎమ్ అకౌంట్లకు ఆధార్ నెంబర్లను లింక్ చేయటం జరిగింది. తాజా తీర్పు నేపథ్యంలో ఆధార్ కార్డ్ వివరాలను మీ పేటీఎమ్ అకౌంట్ల నుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ముందుగా కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయాలి..

ముందుగా కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేయాలి..

ముందుగా ఐవీఆర్‌ను యాక్సిస్ చేసకునేందుకుగాను పేటీఎమ్ కస్టమర్ కేర్‌ నెంబర్ 01204456456కు కాల్ చేయాలి. కాల్ కనెక్ట్ అయిన తరువాత లాంగ్వేజ్‌ను సెలక్ట్ చేసుకునేందుకు ఫోన్ కీప్యాడ్‌లోని 1 అంకె పై ప్రెస్ చేయాలి. కేవైసీ క్వైరీ సెక్షన్‌లోకి ఎంటరయ్యేందుకు 2 అంకె పై ప్రెస్ చేయాలి. మీ పేటీఎమ్ అకౌంట్‌కు సంబంధించి కేవైసీ క్వైరీ నిమిత్తం మరలా 1 అంకె పై ప్రెస్ చేయాలి.

 

 

పేటీఎమ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు...

పేటీఎమ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు...

వేరొక పేటీఓమ్ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ క్వైరీని తెలుసుకునేందుకు 2 అంకె పై ప్రెస్ చేయాలి. ఆ తరువాత కస్టమర్ కేర్‌తో మాట్లాడేందుకు 1 అంకె పై ప్రెస్ చేయాలి. ఆ తరువాత మీ పేటీఓమ్ అకౌంట్‌కు సంబంధించిన పాస్ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత పేటీఎమ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు 9 అంకె పై ప్రెస్ చేయాలి. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లైన్‌లోకి వచ్చిన తరువాత లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్‌ను అకౌంట్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నట్లు వారితో చెప్పాలి.

 

 

మీ ఈమెయిల్ ఐడీకి వెరిఫికేషన్ రిక్వెస్ట్ పంపబుడుతుంది..

మీ ఈమెయిల్ ఐడీకి వెరిఫికేషన్ రిక్వెస్ట్ పంపబుడుతుంది..

ఆ తరువాత అకౌంట్‌కు సంబంధించిన కొన్ని వెరిఫికేషన్స్ డిటెయిల్స్‌ను ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని అడుగుతారు. వీటికి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత మీ పేటీఎమ్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మీ ఈమెయిల్ ఐడీకి వెరిఫికేషన్ రిక్వెస్ట్ పంపబుడుతుంది. ఈ రిక్వెస్టుకు మీ ఆధార్ కార్డ్ ఫోటో కాపీని జత చేయవల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తియిన వెంటనే మరొక కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మెయిల్ మీకు అందుతుంది. రిక్వెస్ట్‌ ఓకే చేసిన 72 గంటలలోపు మీ ఆధార్ వివరాలు డీలింక్ కాబడతాయి.

Best Mobiles in India

English summary
Delink your Aadhaar from Paytm account in 4 simple steps.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X