స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవుతోందా.. చిన్న చిట్కాలతో పరిష్కారం చేసుకోండి..!
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఛార్జింగ్ త్వరలో డిశ్ఛార్జి అయిపోవడం ఒకటి. చాలా మందికి అవగాహన లేకపోవడం, సరైన కారణం తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు కూడా ఈ తరహా సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంంగా పరిష్కారం చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జి కావడానికి (Smartphone Battery Discharge Issues) అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ కాలం నుంచి ఫోన్ వినియోగించడం, బ్యాగ్రౌండ్ యాప్స్, ఎక్కువ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ తో ఫోన్ వినియోగించడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడం, బగ్స్ ఉన్న యాప్స్ ను ఉపయోగించడం వంటివి ఉన్నాయి.

దీంతోపాటు మొబైల్ నెట్‌వర్స్ సరిగా లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా ఫోన్ బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవుతుంది. దీంతోపాటు మరిన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని చిట్కాల ద్వారా ఇందులో అధిక శాతం సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
* ఎన్ని సంవత్సరాల నుంచి ఫోన్ వినియోగిస్తున్నారు? :
సాధారణంగా పాత స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీలు త్వరగా డిశ్చార్జి అవుతుంటాయి. 2 నుంచి మూడేళ్ల నుంచి వినియోగిస్తున్న ఫోన్‌ల బ్యాటరీ పనితీరు క్రమంగా తగ్గుతుంటుంది. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితి ఉంటుంది.
ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో అందుబాటులో ఉండే ఫీచర్ ల ద్వారా బ్యాటరీ హెల్త్ ను తెలుసుకొనే ప్రయత్నం చేయండి. బ్యాటరీ డ్యామేజీ అయినట్లు గుర్తిస్తే, బ్యాటరీ మార్చేందుకు ప్రయత్నం చేయండి. దీంతోపాటు రాత్రంతా ఛార్జింగ్ చేయడం లేదా నాసిరకం ఛార్జర్ లను ఉపయోగించడం కూడా బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అయ్యేందుకు కారణం అవుతాయి.
* నెట్‌వర్క్ కవరేజీ స్థిరంగా ఉన్న ప్రాంతాల్లో :
నెట్‌వర్క్ కవరేజీ స్థిరంగా లేని ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ ను వినియోగిస్తున్నప్పుడు బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. ఇది తాత్కాలిక సమస్య. ఇలాంటి సందర్భాల్లో Aeroplane Mode యాక్టివేట్ చేయడం ద్వారా బ్యాటరీ త్వరగా డిశ్చార్జి కాకుండా నియంత్రించవచ్చు. లేకుంటే వైఫై ఆన్ చేసి ( Wi-Fi ) ఫోన్ ను ఉపయోగించుకోవడం ఉత్తమం.
* ఎక్కువ కాలం నుంచి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడం :
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొన్ని సంవత్సరాల వరకు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ సహా ఇతర అప్‌డేట్స్ ను అందిస్తుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బగ్స్ ఉన్న యాప్స్ ఉపయోగించడం వల్ల కూడా బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
* అధిక బ్రైట్‌నెస్ తో ఫోన్ వినియోగిస్తున్నారా? :
కొంత మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధిక డిస్‌ప్లే బ్రైట్‌నెస్ తో ఫోన్‌ను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవుతుంది. డార్క్ మోడ్ ఫీచర్ ను ఉపయోగించుకోవడం, ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ( Always On Display ) వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ త్వరగా డిశ్చార్జి కాకుండా నివారించవచ్చు.


Click it and Unblock the Notifications