బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలో స్మార్ట్‌ఫోన్ క్రియాశీలక పాత్రపోషిస్తోంది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న ఈ స్మార్ట్  వైర్‌లైస్ కమ్యూనికేషన్ డివైస్‌ల ద్వారా సమాచారాన్ని అనేక రకాలుగా షేర్ చేసుకుంటున్నాం. స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్, వై-ఫై అనే వ్యవస్థలు వైర్‌లెస్ విధానం ద్వారా సమాచారాన్ని సరఫరా చేస్తున్నాయి. వీటి వినియోగం ఇటీవల కాలంలో తారాస్థాయికి చేరుకుంది.

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలామందికి బ్లూటూత్, వై-ఫైల గురించి పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ బ్లూటూత్, వై-ఫై వ్యవస్థల మధ్య గల తేడాలు అలానే వాటి పనితీరును మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ వ్యవస్థ అనేది పరిమిత స్థాయిలో పరిమిత వ్యక్తుల అనుమతితో పరిమిత పరిధిలో పని చేస్తుంది.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

బ్లూటూత్ అప్లికేషన్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ తదితర కమ్యూనికేషన్ పరికరాల్లోకి వ్యాప్తి చెందింది. అంతర్జాతీయ మొబైల్ బ్రాండ్‌లు మొదలుకుని దేశీవాళీ మొబైల్ తయారీ కంపెనీల వరకు తాము రూపొందిస్తోన్న ఫోన్‌లలో బ్లూటూత్ అప్లికేషన్‌ను ఓ ఫీచర్‌గా అందిస్తున్నాయి.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

బ్లూటూత్ వినియోగం కమ్యూనికేషన్ ఇంకా మల్టీమీడియా విభాగాల్లో మరింతగా వ్యాప్తి చెందింది. బ్లూటూత్ సాంకేతికత, ఇన్స్ట్ట్‌ట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ నిర్థేశించిన వ్యవస్థ ప్రకారం కోడ్ నెంబరు IEEE 802.15.1లో పనిచేస్తుంది.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

గ్రూప్ విధానంలో భాగంగా బ్లూటూత్ వ్యవస్థను ఏకకాలంలో 7 పరికరాలకు మాత్రమే కనెక్ట్ చేయగలం.

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

బ్లూటూత్ కనెక్షన్ 10 మీటర్ల పరిధి వరకు స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

బ్టూటూత్ ఫోన్ ఛార్జింగ్‌ను దహించివేస్తుంది. కాబట్టి బ్లూటత్ ఫీచర్‌ను ఉపయోగించుకునే సమయంలో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి ఉంచండి.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

మీ ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ ఖచ్చితంగా బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్నదై ఉండాలి.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

ముందుగా మీరు పంపాలనుకుంటున్న ఫైల్‌ను ఎంపిక చేసుకోండి. సదరు ఫైల్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే షేర్, సెండ్ వంటి ఆప్షన్‌లతో కూడిన మెనూ ఫోన్ డిస్‌ప్లే పైప్రత్యక్షమవుతుంది. సదరు మెనూలోని బ్లూటూత్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వెను వెంటనే బ్లూటూత్ అప్లికేషన్ ఆన్ అవుతుంది.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

ఇప్పుడు మీరు పంపబోయే ఫైల్‌ను స్వీకరించే డివైజ్ బ్లూటూత్‌ను ఆన్ చేయండి. తరువాతి క్రమంలో రిసీవింగ్ డివైజ్‌కు సంబంధించిన పేరు మీ డివైజ్‌కు చేరుతుంది. ఆ పేరును సెలెక్ట్ చేసుకుని కనెక్షన్‌ను ఓకే చేయండి. తరువాతి క్రమంలో రెండు డివైజుల్లో సమాన పాసవర్డ్‌లను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనంతరం ఫైల్ షేరింగ్ ప్రారంభమవుతుంది.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

ఇక వై-ఫై విషయానికొస్తే... ఈ వ్యవస్థకు చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

అలానే, వై-ఫై స్థావరం పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

IEEE 802.11 కోడ్ పరిధిలో వై-ఫై పనిచేస్తుంది. వై-ఫై వ్యవస్థ 100 మీటర్ల పరిధి వరకు స్పందించగలదు. దూరం పెరిగే కొద్ది సిగ్నల్స్ ప్రవాహం మందగిస్తుంది.

 

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

వై-ఫై వ్యవస్థలో 2.4గిగాహెట్జ్ నుంచి 5గిగాహెట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ గల రేడియో తరంగాలను వినియోగిస్తారు.

బ్లూటూత్, వై-ఫై‌ల మధ్య తేడాలేంటి..?

సాధారణంగా వై-ఫై వ్యవస్థను ఒక ప్రాంగంణలో ఏర్పాటు చేసిన పలు రకాల ఐటీ పరికరాలను కలిపేందుకు, ఇంటర్నెట్ సర్వర్‌ను పలు కంప్యూటర్లుకు అనుసంధానం చేసేందుకు వై-ఫై పద్థతిని వినియోగిస్తారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Difference Between Bluetooth and Wifi. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot