Tetheringకి, Hotspotకి మధ్య తేడాలేంటి..?

ప్రస్తుత డిజిటల్ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే దాదాపుగా ప్రతిఒక్కరూ ఏదో విధంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటున్నారు.

|

ప్రస్తుత డిజిటల్ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే దాదాపుగా ప్రతిఒక్కరూ ఏదో విధంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటున్నారు. ప్రజలకు ఇంటర్నెట్‌ను చేరువచేయటంలో శాటిలైట్స్, టెలిఫోన్ వైర్స్, మొబైల్ కనెక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్‌ను ఇన్‌స్టెంట్‌గా షేర్ చేసుకునేందుకుగానూ Tethering, hotspots వంటి కనెక్టువిటీ ఫీచర్స్ సహాయపడుతున్నాయి.

difference-between-tethering-hotspot-which-one-is-better

స్మార్ట్‌ఫోన్ కల్చర్ విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో టిథరింగ్ అలానే హాట్ స్పాట్ ఫీచర్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగాTethering అనే Hotspotలను ఒకదానితో మరొకటి కంపేర్ చేస్తూ వాటి మధ్య తేడాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం..

Tethering అంటే ఏంటి..?

Tethering అంటే ఏంటి..?

రెండు డివైస్‌లను మధ్య ఇంటర్నెట్‌ను షేర్ చేసేకునే ప్రక్రియనే టెక్నాలజీ పరిభాషలో Tethering అని పిలుస్తారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా మీ కంప్యూటర్‌లోని ఇంటర్నెట్ కనెక్షన్‌‌ను సెల్యులార్ నెట్‌వర్క్ సామర్థ్యంతో ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇతర డివైసెస్‌లోకి యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేసుకునే క్రమంలో వై-ఫై టిథరింగ్, బ్లుటూత్ టిథరింగ్, యూఎస్బీ టిథరింగ్ ఇలా రకరకాల టిథరింగ్‌లను మీరు ఉపయోగించుకోవచ్చు.

Hotspot అంటే ఏంటి..?

Hotspot అంటే ఏంటి..?

హాట్‌స్పాట్ అనేది టిథరింగ్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి హాట్‌స్పాట్ అనేది ఇంటర్నెట్ యాక్సిస్‌ను ప్రొవైడ్ చేసే వైర్‌లెస్ యాక్సిస్ పాయింట్. ఈ యాక్సిస్ పాయింట్‌కు మన కంప్యూటర్స్, స్మార్ట్‌ఫోన్స్ అలానే టాబ్లెట్‌లను కనెక్ట్ చేసేసుకోవచ్చు. పబ్లిక్ లొకేషన్స్‌లో అందుబాటులో ఉండే ఉచిత హాట్‌స్పాట్స్ వద్ద ఏవరైనా సరే తమ డివైస్‌లను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుసుకునే వీలుంటుంది.ఇదే సమయంలో మన ఇంట్లోని స్మార్ట్‌ఫోన్స్, రౌటర్స్ అలానే కంప్యూటర్స్‌ను వై-ఫై హాట్ స్పాట్స్‌లా మార్చేసుకోవచ్చు. మన స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ హాట్ స్పాట్‌లా మార్చటం వల్ల ఒకేసారి 4 నుంచి 5 డివైస్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్‌ను షేర్ చేయవచ్చు.

 

 

Tetheringకి, Hotspotకి మధ్య తేడాలేంటి..?

Tetheringకి, Hotspotకి మధ్య తేడాలేంటి..?

Tetheringకి, Hotspotకి మధ్య చాలానే తేడాలు ఉన్నాయి. టిథరిడ్ కనెక్షన్‌ను ప్రతి ఒక్కరూ కనెక్ట్ కాలేరు. ఇదే సమయంలో పబ్లిక్ హాట్‌స్పాట్‌కు ప్రతిఒక్కరూ కనెక్ట్ కాగలరు. Tethering కనెక్షన్స్‌తో పోలిస్తే వై-ఫై హాట్‌స్పాట్స్ అనేవి మరింత సౌకర్యవంతంగా అనిపిస్తాయి. వై-ఫై హాట్స్ పాట్స్ ద్వారా ఇంటర్నెట్‌ను షేర్ చేసకునేందుకు ఎటువంటి యాప్స్ అవసరం ఉండదు. వై-ఫై హాట్ స్పాట్స్ ద్వారా ఒకేసారి 5 డివైస్‌లకు ఇంటర్నెట్‌ను షేర్ చేసుకోవచ్చు.

 

 

సెక్యూరిటీ పరంగా..

సెక్యూరిటీ పరంగా..

ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసి వై-ఫై హాట్‌స్పాట్స్‌తో పోలిస్తే టిథరింగ్ కనెక్షన్స్ తక్కువ బ్యాటరీని ఖర్చు స్తాయి. సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి టిథరింగ్ కనెక్షన్స్‌తో పోల్చి చూసినట్లయితే వై-ఫై హాట్‌స్పాట్స్ పై ఎక్కువుగా ఇంటర్నెట్ దాడులు జరుగుతున్నాయి. మీ వ్యక్తిగత వై-ఫై హాట్‌స్పాట్‌లనుఅపరిచితులు ఉపయోగించుకోకుండా శక్తివంతమైన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను కల్పించంతో పాటు లేటెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను అనుసరించాలి.

 

 

Best Mobiles in India

English summary
Difference Between Tethering & Hotspot: Which One Is Better?.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X