Home
How to

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా... అయితే ఈ సూచనలు మీకోసమే..!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ప్రస్తుతం ఫోల్డబుల్‌ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ ఫోన్లు ఆకర్షణీయ డిజైన్‌ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. శాంసంగ్‌, వన్‌ప్లస్‌, వివో, ఒప్పో, షియోమీ, మోటోరోలా వంటి సంస్థలు ఇప్పటికే తన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఆపిల్ సంస్థ కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే ఫోల్డబుల్‌ ఫోన్లను (Foldable smartphone) కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోల్డబుల్‌ ఫోన్లు అధిక ధరలు, ఆకర్షణీయ డిజైన్‌ కలిగి ఉన్నాయి. అయితే వీటిని సరిగ్గా వినియోగించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.

Foldable smartphone safety tips,

డిస్‌ప్లే పై ప్రత్యేక శ్రద్ద అవసరం: ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ల డిస్‌ప్లేలు చాలా సున్నితంగా ఉంటాయి. ఫలితంగా ఫోన్లును వినియోగించే సమయంలో (Tips to Protect your Foldable smartphone) జాగ్రతలు అవసరం. పదునైన వస్తువులతో డిస్‌ప్లేను టచ్‌ చేయకుండా ఉండాలి. మరియు స్క్రీన్‌పైన ఒత్తిడి లేకుండా చూడాలి.

స్క్రీన్ గార్డులు : ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు స్క్రీన్‌ గార్డులతో వస్తున్నాయి. అందువల్ల వినియోగదారులు వాటిని తీసేందుకు ప్రయత్నం చేయకపోవడం మంచిది. స్క్రీన్‌ గీతలు సహా ఇతర డ్యామేజీ కాకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఏదైనా సమస్య కారణంగా స్క్రీన్‌ గార్డులను తీసివేయాల్సి వస్తే సంస్థకు సంబంధించిన సర్వీస్‌ సెంటర్లనే ఎంచుకోవాలి.

Foldable smartphone safety tips,

నీరు, దుమ్ము నుంచి రక్షణ అవసరం : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు విడుదల చేసిన ఫోల్డబుల్‌ ఫోన్లు డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌తో వస్తాయి. అయినప్పటికీ నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్లను దూరంగా ఉంచాలి. విపరీతమైన ధూళి ఫోన్‌ పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

మాగ్నెటిక్‌ వస్తువులతో అప్రమత్తత అవసరం : ఫోల్డబుల్‌ ఫోన్లను క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు వంటి మాగ్నెటిక్‌ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ఇందులో ఉండే అయస్కాంత శక్తి.. ఫోల్డబుల్‌ ఫోన్‌ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరియు కొన్నిసార్లు డేటా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం శాంసంగ్‌ ఈ ఫో‌ల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో రాణిస్తోంది. దీంతోపాటు వన్‌ప్లస్‌, షియోమీ, వివో, ఒప్పో సంస్థలు కూడా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేశాయి. ఆపిల్ సంస్థ కూడా ఫోల్డబుల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌లను తీసుకొచ్చేందుకు ప్రోటోటైప్‌ మోడళ్లను అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది. కనీసం రెండు ప్రోటోటైప్‌ ఫోన్లను అభివృద్ధి చేస్తు్న్నట్లు సమాచారం.

ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు గెలాక్సీ Z Flip 5 స్మార్ట్‌ఫోన్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రోటోటైప్‌ డిజైన్‌ పై సంస్థ సంతృప్తి చెందాకా ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది. ఈ ఫోన్లు ప్రస్తుతానికి ప్రోటోటైప్‌ మోడళ్లుగానే ఉంటాయని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Do You have any plan to buy Foldable smartphone here are the safety tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X