ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
ప్రస్తుతం రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా ఉక్కపోత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీంతో అనేక మంది ACలు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. AC (ఎయిర్ కండిషనర్) విండో AC, స్ప్లిట్ AC రకాలుగా ఉంటుంది. అయితే మీ అవసరాలకు తగినట్లు ఎలాంటి ACను కొనుగోలు చేయాలి, ఎంత సామర్థ్యంతో కొనుగోలు చేయాలి వంటి వివరాలతో పూర్తి కథనం.
విండో AC : ఈ విండో ఎయిర్ కండిషనర్ సింగిల్, దీర్ఘచతురస్రాకార యూనిట్‌గా ఉంటుంది. తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరియు నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ విండో AC కి సంబంధించిన అన్ని పరికరాలు ఒకే చట్రం లోపల ఉంటాయి. ఫలితంగా బయట వస్తువుల నుంచి డ్యామేజీ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

అయితే (Window AC) తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నా.. పనిచేసే సమయంలో ఎక్కువ శబ్దం వస్తుంది. మరియు ఈ విండో ఏసీని అమర్చేందుకు 9 నుంచి 12 అంగుళాల గోడలు కావాల్సి ఉంటుంది. అందువల్ల అందరూ వీటిని అమర్చుకొనేందుకు అవకాశం ఉండదు. పెద్ద గదులకు ఈ విండో ఏసీ ప్రభావవంతంగా పనిచేయలేదు.
స్ప్లిట్ ఏసీ : ఈ ఏసీ (Split AC) రెండు విభాగాలుగా ఉంటుంది. గది లోపల మరియు గది బయట అమర్చాల్సి ఉంటుంది. ఈ రెండు విభాగాలను పైపుల ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్ప్లిట్ ఏసీ ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎటువంటి శబ్దం చేయకుండా పనిచేస్తాయి. సన్నని గోడలపై కూడా ఈ ఏసీని అమర్చవచ్చు.

అయితే ఏసీలను కొనుగోలు చేసే ముందు ఎంత సామర్థ్యం కలిగిన ఎయిర్ కండిషనర్ కావాలో అంచనా వేసుకోవాలి. 1 టన్ను లేదా 1.5 టన్ను వంటి పేర్లను ఎయిర్ కండిషనర్ గురించి మాట్లాడే సమయంలో మీరు వినే ఉంటారు. చిన్న గదులకు 1 టన్ను సామర్థ్యం కలిగిన ఏసీ సరిపోతుంది. అదే పెద్ద గదులకు 1.5 టన్ను సామర్థ్యం కలిగిన ఎయిర్ కండిషనర్ కావాల్సి ఉంటుంది.
రేటింగ్ ఆధారంగా కొనుగోలు చేయాలి! :
దీంతోపాటు మంచి ఎనర్జీ రేటింగ్ కలిగిన ACను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధారంగా ఈ రేటింగ్ ఇస్తారు. అయితే విద్యుత్ ఛార్జీలను ఆదా చేసేందుకు 5 స్టార్ రేటింగ్ కలిగిన కొనుగోలు చేయడం ఉత్తమం.

ఇన్వర్టర్ మరియు నాన్ ఇన్వర్టర్ :
ఎయిర్ కండిషనర్‌లలో రెండు రకాలుంటాయి. ఇన్వర్టర్ మరియు నాన్ ఇన్వర్టర్ ఏసీలుగా ఉంటాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీలోని కంప్రెషర్ ఫిక్సడ్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. గదిలో అవసరమైన ఉష్ణోగ్రత వచ్చేంత వరకు రన్ అవుతుంది. అనంతరం ఆఫ్ అవుతుంది. గదిలో ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో మళ్లీ ఆన్ అవుతుంది.
ఇన్వర్టర్ ఏసీ.. ఇళ్లు లేదా కార్యాలయానికి సఫ్లై అయ్యే విద్యుత్‌ను AC నుంచి DC కరెంట్‌గా మారుస్తుంది. అనంతరం కంప్రెషర్ కోసం AC కరెంట్‌గా మారుస్తుంది. ఈ రకం ఏసీ తక్కువ శబ్దాన్ని వెదజల్లుతుంది. నిరంతరం వినియోగించేందుకు ఇన్వర్టర్ ఏసీని కొనుగోలు చేయాలి. రోజులో కొంత సమయం కోసమే అయితే నాన్ ఇన్వర్టర్ ఏసీ సరిపోతుంది.


Click it and Unblock the Notifications








