విండోస్ 10లో మీ పీసీ యాక్టివిటీని ట్రాక్ చేసుకోవటం ఎలా..?

By: BOMMU SIVANJANEYULU

టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి సెర్చ్ ఇంజిన్స్ ద్వారా మనం చేసి ప్రతి ఇంటర్నెట్ యాక్టివిటీని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బ్రౌజర్లు ట్రాక్ చేస్తూనే ఉంటాయి. సెర్చ్ ఇంజిన్స్ మాదిరిగానే వ్యక్తిగత కంప్యూటర్లు కూడా మన డేటాను నిత్యం ట్రాక్ చేస్తూనే ఉంటాయి.

విండోస్ 10లో మీ పీసీ యాక్టివిటీని ట్రాక్ చేసుకోవటం ఎలా..?

మనం ఒపెన్ చేసే ఫైల్ దగ్గర నుంచి విజిట్ చేసే ప్రతి వెబ్‌సైట్ వరకు అన్ని వివరాలు విండోస్ దాని ఆధారిత అప్లికేషన్‌లలో హిస్టరీ రూపంలో స్పష్టంగా రికార్డ్ కాబడతాయి. ఈ డేటాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కావల్సిన మేర డిలీట్ చేసుకునే వీలుంటుంది.

విండోస్ ఉత్పత్తులైన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్, బింగ్ సెర్చ్ ఇంజిన్ ఇంకా కార్టోనా వర్చువల్ అసిస్టెంట్‌లు తమ యాజర్లకు సంబంధించిన ఇంటర్నెట్ యాక్టివిటీలను నిత్యం ట్రాక్ చేస్తుంటాయి. ఈ డేటా మొత్తాన్ని యూజర్ల సౌకర్యార్థమే ట్రాక్ చేసి ఉంచుతున్నట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది. విండోస్ 10 ఆధారిత కంప్యూటర్‌లలో పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ 1 :

ముందుగా మీ డివైస్‌లోని Settings -> Privacy -> Activity History -> Manage my activity infoలోకి వెళ్లండి.

స్టెప్ 2 :

బ్రౌజర్ విండో పాపప్ అయిన వెంటనే మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ మీ అకౌంట్‌కు సంబంధించిన బ్రౌజింగ్ హిస్టరీతో పాటు లొకేషన్ యాక్టివిటీ, వాయిస్ యాక్టివిటీ ఇంకా కార్టోనా నోట్‌బుక్ యాక్టివిటీలకు సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి.

విండోస్ 10లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ఎలా..?

స్టెప్ 1 :

ముందుగా మీ డివైస్‌లోని Settings -> Privacy -> Activity Historyలోకి వెళ్లండి.

స్టెప్ 2 :
Clear Activity History ఆప్షన్ క్రింద క్రింద కనిపించే క్లియర్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసుకునే వీలుంటుంది.

స్టెప్ 3 :

విండోస్ మీ డేటాను కలెక్ట్ చేయకూడదనుకుంటే 'Let Windows collect my activities'
ఆప్షన్‌ను టర్నాఫ్ చేసుకోవల్సి ఉంటుంది.

మీ కంప్యూటర్‌‌లో మీరు చేసే ప్రతీ యాక్టివిటీ కూడా ట్రాక్ అవ్వాలనుకుంటున్నట్లయితే LastActivityView అనే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో Oppo A83

Read more about:
English summary
When it comes to technology, each and every activity of ours are tracked and saved by various companies including Google, Microsoft, as we use their product. Check it out for more information
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot