Home
How to

స్మార్ట్‌ఫోన్‌లోని డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండాలా.. స్టోలెన్‌ డివైస్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ గురించి తెలుసుకోండి

స్మార్ట్‌ఫోన్లు లేనిదే ప్రస్తుతం రోజు గడవని పరిస్థితి నెలకొంది. కేవలం కాలింగ్‌ అవసరాలతోపాటు బ్యాంకింగ్‌ పనులు కూడా స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే చేసుకుంటున్నాం. దీంతోపాటు ఫోన్‌లో అనేక వ్యక్తిగత, సున్నితమైన వివరాలు ఉంటాయి. అయితే ఏదైనా పరిస్థితుల్లో ఫోన్‌ పొగొట్టుకోవడం వల్ల చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇటీవల కాలంలో ఐఫోన్‌లోని సున్నితమైన డేటాను కాజేందుకు వివిధ మార్గాల్లో సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నాలు చేశారు. అయితే ఐఫోన్‌ సెక్యూరిటీ కారణంగా విఫలం అయ్యారు. అయితే దొంగతనం వంటి సమయాల్లో మీ వ్యక్తిగత లేదా సున్నితమైన బ్యాంకింగ్‌ సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు ఐఫోన్‌ (iPhone Stolen Device Protecion) కీలక ఫీచర్లను కలిగి ఉంది.

Do you know iPhone stolen device protection

ఈ పరిస్థితుల్లో యూజర్లకు ఎక్కువ నష్టం జరగకుండా ఆపిల్‌ సంస్థ ఐఫోన్‌లో కీలక భద్రతా ఫీచర్లను అందుబాటులో ఉంచింది. స్టోలెన్‌ డివైస్‌ ప్రొటెక్షన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ iOS 17.3 వెర్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో కీలకమైన భద్రతా ఫీచర్‌ను కలిగి ఉంది.

ఫేస్‌ ఐడీ లేదా టచ్‌ ఐడీ ద్వారా మాత్రమే..
ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్న ఐఫోన్‌లలో పాస్‌వర్డ్‌, క్రెడిట్‌ కార్డు వంటి సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్‌ చేసేందుకు ఫేస్‌ ఐడీ లేదా టచ్‌ ఐడీ ద్వారా మాత్రమే ఆయా సెట్టింగ్స్‌ను మార్చాల్సి ఉంటుంది. సాధారణ పాస్‌వర్డ్‌ ద్వారా ఈ వివరాలు యాక్సెస్‌ చేసేందుకు అవకాశం ఉండదు.

బయోమెట్రిక్‌ తనిఖీలు కూడా.. :
దీంతోపాటు మీరు రోజు వినియోగిస్తున్న ప్రాంతం నుంచి కాకుండా కొత్త ప్రాంతం నుంచి ఐఫోన్‌లోని పాస్‌వర్డ్‌లు మార్చడం సహా ఇతర భద్రతకు సంబంధించిన ఫీచర్లలో మార్పులను చేసేందుకు గంట సమయం వేచిచూడాల్సి ఉంటుంది. దీంతోపాటు బయోమెట్రిక్‌ తనిఖీలు కూడా పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఎలా చేయాలి?

ఆపిల్‌ పేజీ సమాచారం ఆధారంగా స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్ ని ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోని ఫేస్‌ ఐడీ మరియు పాస్‌కోడ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఐఫోన్‌ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ టర్న్‌ ఆన్‌ ప్రొటెక్షన్‌ను క్లిక్‌ చేయాల్సి. ఫలితంగా స్టోలెన్‌ డివైజ్‌ ప్రొటెక్షన్‌ ఎనేబుల్‌ అవుతుంది.

ఆ సెట్టింగ్స్‌ మార్చాలంటే గంట వేచిచూడాలి..!
ఈ ఫీచర్‌ ప్రత్యేకంగా మీరు రోజు వినియోగించే ఇళ్లు, ఆఫర్‌ సహా మీరు ట్యాగ్‌ చేసిన ఇతర ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో ఐఫోన్‌ పాస్‌వర్డ్‌ మార్చేందుకు ప్రయత్నిస్తే స్టోలెన్ డివైజ్‌ ప్రొటెక్షన్‌ అందుకు అనుమతి ఇవ్వదు. అలా చేయాలంటే మాత్రం కచ్చితంగా గంట సమయం వేచిచూడాల్సి ఉంటుంది. లేదంటే మీరు రోజు ఐఫోన్‌ను వినియోగించే ప్రాంతంలోనే మార్పులు చేయాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Do you know iPhone stolen device protection and how its works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X