గీజర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇవి తెలియకుంటే ఎన్ని సమస్యలు ఎదురవుతాయో తెలుసా?
ప్రస్తుత శీతాకాలంలో చలి తీవ్రగా అధికంగా ఉంది. భారత్ లో ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు భారీగా క్షీణిస్తున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ చలి తీవ్రగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది గీజర్లు (Geyser Guide) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గీజర్‌లను కొనుగోలు చేసే సమయంలో రేటింగ్, బ్రాండ్, మీకు ఎన్ని లీటర్ల సామర్థ్యం కలిగిన గీజర్ అవసరం, ఆటోమేటిక్ వంటి అనేక అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. శీతాకాలం మూడు, నాలుగు నెలల కోసమే కదా అంటూ కొందరు నాణ్యత లేని గీజర్‌లను (How to Choose Best Geyser) కొనుగోలు చేస్తున్నారు. ఈ తరహా గీజర్‌లు ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంది.

అందువల్ల గీజర్‌లను కొనుగోలు చేసే సమయంలో కుటుంబ సభ్యుల సంఖ్య, ఉత్తమ బ్రాండ్, 5 స్టార్ పవర్ రేటింగ్ ఆధారంగా కొనుగోలు చేయాలి. లేకుంటే విద్యుత్ ఛార్జీలు కూడా భారమయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని అంశాల్లో అప్రమత్తత వహించడం వల్ల గీజర్‌తో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
గీజర్‌ను కొనుగోలు చేసే సమయంలో మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగానూ కొనుగోలు చేయవచ్చు. చిన్న కుటుంబం అయితే చిన్న గీజర్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. లేకుంటే విద్యుత్ ఛార్జీలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇన్‌స్టంట్ గీజర్లను కొనుగోలు చేసుకోవాలి.
దీంతోపాటు గీజర్‌ల కొనుగోలు సమయంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్ల ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే ఫీచర్ ఉన్న గీజర్‌ను కొనుగోలు చేయాలి. ఈ ఫీచర్ కారణంగా గీజర్ ఓవర్ హీట్ కాకుండా ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ కానుంది. ఓవర్ హీట్ కారణంగా కొన్నిసార్లు గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆటోమేటిక్ ఫీచర్‌తో విద్యుత్ ఛార్జీలు ఆదా కానుంది.
గీజర్ కొనుగోలు సమయంలో 5 స్టార్ పవర్ రేటింగ్ కలిగిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతోపాటు ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన నాణ్యమైన గీజర్‌లను కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే బ్రాండ్‌ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. అధిక శాతం ఈ తరహా గీజర్‌లు నాణ్యత విషయంలో రాజీపడే అవకాశం ఉంది.
అయితే బ్రాండ్‌లు, స్టార్ రేటింగ్‌తోపాటు గీజర్‌ల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నిర్ణీత సమయంలో కంటే ఎక్కువగా ఆన్‌లో ఉంచకపోవడం ఉత్తమం. దీంతోపాటు క్రమం తప్పకుండా గీజర్‌ను సర్వీసింగ్ చేయించాలి. స్నానం చేసే సమయంలో గీజర్‌ను ఆఫ్ చేయడం ఉత్తమం. విద్యుత్ ప్రవాహంలో ఎర్పడిన హెచ్చుతగ్గులు.. ఎలక్ట్రిక్ షాక్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
దీంతోపాటు కొత్తగా గీజర్‌ను కొనుగోలు చేసిన వాళ్లు, వినియోగానికి ముందుగానే పూర్తిగా తనిఖీలు చేయించాలి. విద్యుత్ కనెక్షన్‌లు సహా ఇతర విభాగాలు తనిఖీ చేయాలి. నీరు వేడెక్కిన వెంటనే గీజర్‌ను ఆఫ్ చేయడం ఉత్తమం, అతిగా వేడెక్కడం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








