సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి..!!
భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. దీంతోపాటు సెకెండ్ హ్యాండ్ (Second Hand Smartphone) ఫోన్లను కొనుగోలు చేసేందుకు కూడా అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువ ధరకు అందుబాటులోకి రావడం, నచ్చిన మోడల్ కావడం సహా ఇతర కారణాలతో వీటిని కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే సెకెండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ లను కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రతలు తీసుకోవాలి. ఫోన్ పనితీరు, ధర, కండిషన్ సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ అంశాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే సెకెండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ కండిషన్ : సెకెండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ఫోన్ కండిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఫోన్ డ్యామేజీ అయిందా, డిస్‌ప్లే దెబ్బతిందా మరియు ఫోన్‌లోని బటన్‌లు అన్ని పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేసుకోవాలి. అన్ని అంశాల్లో సంతృప్తి చెందితేనే కొనుగోలు చేయాలి.
ఫోన్ ఎప్పుడు విడుదల అయిందో చూడాలి : సెకెండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో హ్యాండ్‌సెట్ విడుదల తేదీని తనిఖీ చేయాలి. ఎందుకంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 3 నుంచి 5 సంవత్సరాల వరకు మాత్రమే OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తున్నాయి. అప్‌డేట్‌లు లేకుండా కొన్ని యాప్‌లను సపోర్టు చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల విడుదల తేదీని పరిగణనలోకి తీసుకోవాలి.

బ్యాటరీ పనితీరు : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు సమయంలో బ్యాటరీ పరిస్థితిని ఆరా తీయాలి. బ్యాటరీ ఛార్జింగ్, డిశ్ఛార్జ్ పరిస్థితిని గురించి తెలుసుకోవాలి. బ్యాటరీ సరైన పనితీరు కనబరచకుండా ఉండే ఎలాంటి హ్యాండ్‌సెట్‌ను అయినా సంతృప్తికరంగా వినియోగించే అవకాశం ఉండదు.
నెట్‌వర్క్ : కొన్ని స్మార్ట్‌ఫోన్ కేవలం కొన్ని నెట్‌వర్క్‌లకు మాత్రమే సపోర్టు చేస్తాయి. మిగిలిన నెట్‌వర్క్‌లను లాక్ చేసి ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే సమయంలో మీ నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుందో లేదో తెలుసుకోవాలి. దీంతోపాటు భద్రతకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు పొందే విధంగా ఉండే హ్యాండ్‌సెట్లను మాత్రమే కొనుగోలు చేయాలి.
IMEI : సెకెండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనుగోలు చేసే సమయంలో IMEI నంబర్‌ను తనిఖీ చేయాలి. కొన్నిసార్లు దొంగిలించిన లేదా బ్లాక్ చేయబడిన ఫోన్‌లను కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ర్యామ్, స్టోరేజీని కూడా తనిఖీ చేయాలి. మీ అవసరాలకు తగినట్లు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ధర : సెకెండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసే సమయంలో అన్నింటి కన్నా ముఖ్యమైనది.. ధర. మీరు కొనుగోలు చేస్తున్న ఫోన్ మార్కెట్ ధర, ప్రస్తుత ధరను సరిచూసుకోవాలి. దీంతోపాటు విక్రయదారుడి గురించి తనికీ చేసుకోవాలి. రేటింగ్‌లు, రివ్యూల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








