మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నారా.. మీ వ్యక్తిగత సమాచారం భద్రత కోసం ఇలా చేయండి.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు ప్రధాన మార్కెట్ లుగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం అనేక బ్రాండ్ల నుంచి వివిధ రకాల స్మార్ట్‌ఫోన్ లు ( Smartphone Factory Reset ) అందుబాటులోకి వస్తున్నాయి. అయితే సెకెండ్ హ్యాండ్ మార్కెట్ కూడా గణనీయంగా ఉంది. కొత్త ఫోన్ లు కొనుగోలు చేస్తున్న చాలా మంది ఎక్స్ఛేంజీ సహా ఇతర మార్గాల్లో తమ పాత ఫోన్ లను విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మీ వ్యక్తిగత సమాచారానికి భద్రత :
మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విక్రయించాలని భావించినప్పుడు తప్పని సరిగా అందులోని వ్యక్తిగత డేటాను పూర్తి తొలగించాలి. కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఇతర ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉండాలి అంటే మాత్రం ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా పూర్తిస్థాయితో డేటాను తొలగించవచ్చు.

సెట్టింగ్స్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి :
స్టెప్ 1 : స్మార్ట్‌ఫోన్ లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి సిస్టమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 2 : అనంతరం కిందకు స్క్రోల్ చేసి రీసెట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 3 : అక్కడ Erase all data లేదా Factory reset ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
స్టెప్ 4 : అనంతరం మీ ఫోన్ పిన్ కోడ్ ను ఎంటర్ చేయాలి.
స్టెప్ 5 : అనంతరం ఫ్యాక్టరీ రీసెట్ చేసేందుకు అనుమతించాలి.
రీకవరీ మోడ్ ద్వారా కూడా :
దీంతోపాటు పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేసేందుకు మరో విధానం కూడా అందుబాటులో ఉంది. రీకవరీ మోడ్ ద్వారా కూడా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్ ఫోన్ పవర్ బటన్ ను గట్టిగా నొక్కి పట్టుకోవాలి (Long Press). అనంతరం రికవరీ మోడ్‌లోకి వెళ్తుంది. తర్వాత Wipe option ను గుర్తించాలి.
అనంతరం ఫార్మాట్ డేటా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేశాక.. రీసెట్ ప్రారంభం కానుంది. ఇలా పద్దతి ద్వారా మీ పాత స్మార్ట్‌ఫోన్ లోని అన్ని రకాల యాప్‌లు సహా ఇతర సమాచారం పూర్తిగా తొలగించబడుతుంది. అనంతరం మీ ఫోన్ ను ఎవరు ఉపయోగించినా కూడా మీ డేటాను గుర్తించే అవకాశం ఉండదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








