Home
How to

Geyser Usage మీ ఇంట్లో గీజర్‌ వినియోగిస్తున్నారా.. అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..!!

భారత్‌ లో ప్రస్తుతం చలిగాలులు వణికిస్తున్నాయి. దక్షిణ భారతంతో పోలిస్తే ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే గతం కంటే దేశవ్యాప్తంగా చలి ప్రభావం అధికంగానే ఉంది. దీంతో అనేక మంది ప్రజలు వాటర్ హీటర్‌ లు, గీజర్‌ లు వినియోగిస్తుంటారు. ముఖ్యంగా గీజర్‌ లు వినియోగిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గీజర్‌ ల వినియోగం ఎక్కువ ఉంటోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం అధికమవుతోంది. అయితే గీజర్‌ ల వినియోగం సమయంలో అప్రమత్తంగా లేకుంటే ఎలక్ట్రిక్‌ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

అలసత్వం ప్రదర్శిస్తే ఏం జరుగుతుంది? :
గీజర్‌లను వినియోగించే సమయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఎలక్ట్రిక్‌ షాక్‌, అగ్ని ప్రమాదం సహా కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఈ వీటిని ఉపయోగించే సమయంలో ఈ కింది తెలిపిన జాగ్రత్తలను పాటించడం చాలా ఉత్తమం. దీంతోపాటు గీజర్‌ వినియోగం సమయంలో అప్రమత్తత ఎల్లప్పుడూ ముఖ్యం.

how to avoid accidents during geyser usage in winter season

స్నానం చేసే సమయంలో గీజర్‌ ఆన్‌లోనే ఉంటుందా ? :
స్నానం చేసే సమయంలో గీజర్‌ ను (Geyser Usage Guide) ఆఫ్ చేయడం ఉత్తమం. ఏదైనా కారణంతో విద్యుత్‌ ప్రవాహంలో హెచ్చు తగ్గులుంటే.. అది క్రమంగా ఎలక్ట్రిక్‌ షాక్‌ కు దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల నీరు వేడెక్కినట్లు మీరు భావిస్తే వెంటనే గీజర్‌ ను ఆఫ్‌ చేయాలి. అనంతరమే స్నానం చేయాలి.

మీరు ఏ గీజర్‌ వినియోగిస్తున్నారు ? :
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక సంస్థల గీజర్‌లు అందుబాటులో ఉంటున్నాయి. ప్రముఖ బ్రాండ్‌లు లేదా నాణ్యత సర్టిఫికేషన్‌ లు కలిగిన సంస్థల గీజర్‌లను మాత్రమే కొనుగోలు చేయండి. తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే గీజర్‌లు నాణ్యతలో రాజీ పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది.

గీజర్‌ను ఎక్కువ సమయం ఆన్‌లోనే ఉంచుతున్నారా ? :
చలికాలంలో కొంత మంది గీజర్‌ ను (Geyser Usage Tips) ఆన్‌ చేసి మర్చిపోతుంటారు. ఫలితంగా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. గీజర్‌ ను ఎక్కువ సమయం పాటు ఆన్ చేసి వదిలేస్తే.. విద్యుత్‌ వృథా కానుంది. దీంతోపాటు గీజర్‌ అతిగా వేడెక్కి, ప్రమాదాలకు కారణం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల నీరు వేడెక్కిన వెంటనే ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

కొత్తగా గీజర్‌ను కొనుగోలు చేశారా?
గీజర్‌ను కొత్తగా కొనుగోలు చేశారా అయితే వినియోగించే ముందు పూర్తిగా తనిఖీ చేయడం ఉత్తమం. విద్యుత్‌ కనెక్షన్‌లు సహా ఇతర తనిఖీలు చేయాలి. దీంతోపాటు ప్రతి సంవత్సరం శీతాకాలం కంటే ముందు సర్వీసింగ్‌ చేయించాలి. ఫలితంగా సరైన పనితీరు కనబరిచే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గీజర్‌లను వినియోగిస్తున్నారు. అయితే సరైన అవగాహన మరియు తనిఖీలు, సర్వీసింగ్‌ లేకుండా వినియోగించడం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Do you use a geyser at home during the winter season? Here are some tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X