స్మార్ట్‌ఫోన్ సరిగా పనిచేయడం లేదా.. అయితే వెంటనే ఈ చిట్కాలు పాటించండి..!
స్మార్ట్‌ఫోన్ లను కొంత మంది తరచూ మారుస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం ఒకే ఫోన్ ను ఎక్కువ కాలం పాటు వినియోగిస్తుంటారు. అయితే కొంత కాలానికి ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది. స్టోరేజీ నిండిపోవడం సహా ఇందుకు అనేక కారణాలున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి, ఫోన్‌ను తిరిగి వేగంగా పనిచేసేలా చేసేందుకు (Smartphone Performance Tips) కొన్ని చిట్కాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది వినియోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఆండ్రాయిడ్ గుర్తింపు పొందింది.
స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ చేయడం : కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ ను నిరంతరాయంగా వినియోగిస్తుంటాం. బ్యాగ్రౌండ్ లో కొన్ని యాప్‌లు పనిచేస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా ర్యామ్ ఫ్రీ అవుతుంది. దీంతోపాటు సరిగ్గా పనిచేయని యూప్‌లు కూడా సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. మరియు స్పైవేర్ అటాక్ ల నుంచి కూడా స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

మేనేజ్ యాప్స్ : అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ లో అనేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అయితే వాటి అవసరం తీరిపోయాక అన్ ఇన్‌స్టాల్ చేయడం మర్చిపోతుంటాం. దీంతోపాటు కొన్ని యాప్స్ బ్యాగ్రౌండ్‌లో నిరంతరంగా పనిచేస్తుంటాయి. దీంతో ఫోన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతోపాటు Widgets కూడా ఫోన్ పనితీరు నెమ్మదించేందుకు కారణవుతున్నాయి. హోం స్క్రీన్ పైన ఉన్న విడ్జట్‌లను తొలగించడం ఉత్తమం.
యానిమేషన్ : యానిమేషన్ ను తొలగించడం లేదా ఆఫ్ చేయడం వల్ల ఫోన్ పనితీరు కొంతవరకు మెరుగుపడుతుంది. ఇందుకోసం డెవలపర్ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇందుకోసం బిల్డ్ నంబర్‌పైన నోటిఫికేషన్ వచ్చేంత వరకు ట్యాప్ చేస్తూ ఉండాలి. అనంతరం యానిమేషన్ ను ఆఫ్ చేయడం లేదా 5X వద్ద ఉండేలా మార్పులు చేయాలి.
స్టోరేజీ : తక్కువ స్టోరేజీ వల్ల కూడా ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది. అందువల్ల స్టోరేజీని అవసరం లేని ఫైల్స్‌ను డిలీట్ చేయాలి. లేదా మైక్రో SD కార్డులోకి ఆయా ఫైల్స్‌ను బదిలీ చేయాలి. లేదా గూగుల్ ఫైల్స్ యాప్ ద్వారా అవసరం లేని ఫైల్స్‌ను గుర్తించి డిలీట్ చేయాలి. దీంతో స్మార్ట్‌ఫోన్ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు : స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్న OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లు సహా ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఈ అప్‌డేట్‌ల కారణంగా బగ్స్ ఫిక్స్ సహా ఇతర సాంకేతిక సమస్యలు తొలగిపోతాయి. ఫలితంగా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications