ఈ ట్రిక్ పాటిస్తే నిమిషాల్లో ఫోన్ ఛార్జింగ్ ఫుల్

|

అర్జెంటుగా బయటకు వెళ్లవలసి వచ్చింది... అదే సమయంలో మీ ఫోన్ ఛార్జింగ్ నిండుకుంది. ఇప్పుడు ఏం చేస్తారు..?, మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా..? మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు ఓ మార్గాన్ని మీకు సూచిస్తున్నాం.

Read More : మహిళలు ఉపయోగించే గదుల్లో రహస్య కెమెరాలను గుర్తించటం ఎలా..?

flight mode

మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవ్వాలంటే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి.వైర్‌లెస్ కనెక్షన్‌లను ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌లోని వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్ ఫీచర్లు పూర్తిగా బంద్ అయిపోతాయి. ఫోన్ ఛార్జింగ్ నిమిషాల వ్యవధిలోనే పూర్తి అవుతుంది.

Read More : ఫీచర్లు ఒకటే.. ఆ ఫోన్‌ల మధ్య తేడా మాత్రం రూ.5,000

flight mode

కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.

flight mode

Read More : ఫోన్‌లో సమస్యలా..? ఫ్లిప్‌కార్ట్ ఇంజినీర్లు మీ ఇంటికే వస్తున్నారు

ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్‌ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్‌ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

Best Mobiles in India

English summary
Does your phone charge faster in aeroplane mode. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X